కరోనావైరస్ కారణంగా భారత డైమండ్ ఎగుమతులపై ప్రభావం పడుతోంది. ఈ వైరస్ కారణంగా వజ్రాల ఎగుమతులు తగ్గనున్నాయి. 2020-21 ఏడాది చివరి నాటికి 20 శాతం వరకు తగ్గి 19 బిలియన్ డాలర్ల స్థాయికి పడిపోనున్నాయని అంచనా. ఆ తర్వాత ఆర్థిక సంవత్సరంలోను ఎగుమతులు తగ్గడం లేదా అదే స్థాయిలో కొనసాగవచ్చునని క్రిసిల్ రేటింగ్స్ ఓ నివేదికలో తెలిపింది.
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి వజ్రాల ఎగుమతులు 24 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో భారత్ నుంచి మొత్తం వజ్రాల ఎగుమతులు విలువపరంగా 18 శాతం తగ్గాయి. మార్చి 2019 నుండి జనవరి 2020 మధ్య డైమండ్ ఎగుమతులు 16.32 బిలియన్ డాలర్లు మాత్రమే ఉంది. ఏప్రిల్ 2018 నుండి జనవరి 2019 మధ్య 19.61 బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే 17 శాతం తగ్గిపోయాయి.

వీటిలో 40 శాతం ఎగుమతులు హాంగ్‌కాంగ్‌కు ఉన్నాయి. జనవరి 15 నుంచి హాంగ్‌కాంగ్‌కు ఎగుమతులు నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో జనవరి - మార్చి త్రైమాసికంలో ఎగుమతులు మరింతగా తగ్గవచ్చు. ఈ ఒక్క క్వార్టర్‌లోనే ఎగుమతులు దాదాపు బిలియన్ డాలర్ల మేరకు ప్రభావం చూపవచ్చునని అంచనా. ఇప్పటికే డిమాండ్ తగ్గి, వసూళ్లు పడిపోవడం, హాంగ్‌కాంగ్ రాజకీయ సంక్షోభం వంటి సమస్యలతో డైమండ్ పరిశ్రమ ఇబ్బందులు పడుతోంది. ఇప్పుడు కరోనా మరో కొత్త సమస్యగా మారింది.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications