covid-19: 8,000 మంది ట్రైనీలను ఇంటికి పంపిన ఇన్ఫోసిస్!
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశవ్యాప్తంగా వివిధ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇచ్చాయి. ఐటీ ఇండస్ట్రీ కూడా కంపెనీలను ఇంటి నుండి పని చేయమని చెప్పాయి. తాజాగా, కర్ణాటకలోని మైసూరు ఇన్ఫోసిస్ క్యాంపస్‌లోని తమ ట్రెయినీలను ఇంటికి పంపించింది కంపెనీ. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి. వీటికి కంపెనీలు, సంస్థలు, వ్యాపారులు కూడా సహకరించాల్సి ఉంటుంది.

ఇళ్లకు వెళ్లిపోండి..
కరోనా వ్యాప్తిని నిరోధించే ఉద్దేశ్యంలో భాగంగా ఇన్శోసిస్ తన మైసూరు క్యాంపస్‌లోని 8,000 మంది ట్రెయినీలను ఇంటికి పంపిస్తోంది. ఐదు రోజుల్లో వీరందరినీ తిప్పి పంపనుంది. మైసూరు తమ గ్లోబల్ ఎడ్యుకేషన్ సెంటర్‌లోని ట్రెయినీలు సాధ్యమైనంత తర్వగా ఇళ్లకు చేరుకోవాలని సూచించింది.

శిక్షణ కొనసాగుతుంది.. ఇలా
ట్రెయినీలను ఇంటికి పంపించినప్పటికీ, వారికి మాత్రం శిక్షణ కొనసాగుతుందని ఇన్ఫోసిస్ వెల్లడించింది. కంపెనీ డిజిటల్ లర్నింగ్ అండ్ టాలెండ్ ట్రాన్సఫర్మేషన్ ప్లాట్‌ఫాం Lex ద్వారా వారికి శుక్షణ కొనసాగుతుందని పేర్కొంది.

కర్ణాటక రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సహకారం
ట్రెయినీలను ఇళ్లకు పంపించేందుకు కర్ణాటక రోడ్ ట్రాన్సుపోర్ట్ కార్పోరేషన్ కూడా సహకరించేందుకు ముందుకు వచ్చింది. ట్రెయినీలను వారి వారి ఇళ్ళకు పంపించేందుకు ఈ కేంద్రంలో తాము 5 సమాచార కేంద్రాలను, అలాగే బుకింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఉద్యోగులను దక్షిణ భారత్‌లోని వారి స్వస్థలాలకు పంపించేందుకు విమానాశ్రయానికి బస్సు సర్వీసులు నడుపుతామని తెలిపింది. మొత్తానికి ఉద్యోగులు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తామని తెలిపింది.


Click it and Unblock the Notifications