కరోనా వైరస్ అందరినీ భయానికి గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 2వేలమందికి పైగా మృతి చెందారు. దాదాపు లక్షమందికి కరోనా సోకింది. కరోనా భయాల నేపథ్యంలో అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సురక్షిత బంగారం వంటి అతివిలువైన లోహాలపై పెట్టుబడులు పెడుతున్నారు. కరోనా కారణంగా దాదాపు అన్ని రంగాల ఉత్పత్తులపై ప్రభావం పడింది. ఉత్పత్తి, ఎగుమతులు, దిగుమతుల ఆధారంగా ధరలు పడిపోవడం లేదా పెరగడం జరుగుతోంది. భారత్‌లో బాస్మతీ రైస్ ధర తగ్గింది.

తగ్గిన ఎగుమతులు
కరోనా వైరస్ చైనా నుండి ఇతర దేశాలకు వేగంగా వ్యాప్తిస్తోంది. కరోనా (కోవిడ్ 19) కారణంగా ఇరాన్‌లో 54 మంది వరకు మృతి చెందారు. రెండు వందల మందికి పైగా మృతి చెందారనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. చైనా తర్వాత ఇరాన్‌పై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో భారత్ నుంచి దిగుమతి చేసుకునే బాస్మతీ బియ్యాన్ని ఇరాన్ నిలిపివేసింది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 18% నుండి 20% మేర ఎగుమతులు తగ్గిపోయాయి.

నిన్న అమెరికా.. నేడు కరోనా
భారత్ నుండి బాస్మతి బియ్యాన్ని ఇరాన్ సహా వెస్ట్ ఆసియా దేశాలు పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాయి. ఎగుమతి అయ్యే బాస్మతిలో ఈ దేశాలకు 30 శాతానికి పైగా ఉన్నాయి. అంతకుముందు ఇరాన్‌పై అమెరికా ఆంక్షల నేపథ్యంలో భారత్ బియ్యం ఎగుమతులు అప్పటికే కొంత దెబ్బతినగా, కరోనా వైరస్ కారణంగా మరింత ప్రభావం పడింది. వెస్ట్ ఆషియా దేశాల్లో ఎక్కువ బాస్మతీ ఎగుమతులు ఇరాన్‌కు ఉంటాయి.

ఐదేళ్ల సగటు కంటే ఎక్కువ ఉత్పత్తి
2019-20లో 117 మిలియన్ టన్నుల వరి ఉత్పత్తయింది. ఇప్పుడు ఎగుమతులు లేకపోవడంతో పాడి రైతులు ఇబ్బందులు పడుతున్నారు. గత అయిదేళ్ల సగటు రైస్ ఉత్పత్తి 107.80 మిలియన్ టన్నులుగా ఉంది. కానీ 2019-20లో మాత్రం ఏకంగా 117 మిలియన్ టన్నులతో 9.67 మిలియన్ టన్నులు ఎక్కువగా పండించారు.

క్వింటాల్ బాస్మతీ ధర...
2010 నుండి 2019 మధ్య బియ్యం ఉత్పత్తి ఎగుమతుల్లో 14 శాతం పెరుగుదల ఉంది. అయితే ప్రతికూల భౌగోళిక రాజకీయ, కఠినమైన వాణిజ్య నిబంధనలు, కనీస మద్దతు ధర కారణంగా ప్రభావితమయ్యాయి. బాస్మతి బియ్యం (PB1121) ధర కరోనా వైరస్ కారణంగా క్వింటాల్‌కు రూ.3,030గా ఉంది.

పరిస్థితి మరింతగా దిగజారింది
కరోనా వైరస్ కారణంగా ఎగుమతిదారులు ఆందోళన చెందుతున్నారని, ఇది తీవ్రంగా ఆందోళన కలిగించే అంశమని, ఇరాన్‌లో కరోనా కారణంగా జనాలు చనిపోతుండటంతో పరిస్థితి మరింతగా దిగజారిందని, ఇప్పటికే అంతర్జాతీయ వాణిజ్యం, ప్రయాణాలపై భారీ ప్రభావం పడుతోందని కోహినూర్ ఫుడ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ గుర్నామ్ అరోరా అన్నారు. ఈ పరిస్థితిని ఎలా అధిగమించాలో అర్థంకాని పరిస్థితుల్లో ఎగుమతిదారులు ఉన్నారన్నారు. బియ్యం ఎగుమతి చేసే వాటిలో కోహినూర్ ఫుడ్స్ ఒకటి.

బ్రెజిల్‌కు ఎగుమతి చేసేలా..
రాబోవు ఒకటి రెండు నెలల్లో పరిస్థితి సద్దుమణుగుతుందని భావిస్తున్నామని ముంబైకి చెందిన రైస్ ట్రేడర్ దేవేంద్ర వోరా అన్నారు. ఎగుమతిదారుల నష్టాలు తగ్గించేందుకు బియ్యం, గోదుమలు ఎక్కువగా వినియోగించే బ్రెజిల్‌కు వ్యవసాయ ఉత్పత్తులను మరింతగా ప్రోత్సహించేలా కేంద్రం చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రపంచవ్యాప్తంగా క్షీణించిన ఎగుమతులు
2018-19 ఆర్థిక సంవత్సరంలో భారత్ నుండి ఇరాన్‌కు ఎగుమతి అయిన బాస్మతి విలువ 1.5 బిలియన్ డాలర్లు. ఇది భారతీయ బియ్యం రవాణాలో 25 శాతం. అమెరికాకు చెందిన ట్రేడ్ ఫైనాన్స్ కంపెనీ డ్రిప్ క్యాపిటల్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా బియ్యం ఎగుమతులు క్షీణించాయి. ప్రపంచంలోనే అతిపెద్ద బియ్యం ఎగుమతిదారు భారత్. ప్రపంచ వాటాలో 25 శాతంగా ఉంది. కానీ భారతీయులు పండించే బియ్యంలో ఎగుమతి అయ్యే వాటా కేవలం 2 శాతమే.
More From GoodReturns

యుద్దంపై ఇరాన్ కీలక ప్రకటన.. భారీ సైనిక దాడులు చేస్తామంటున్న ట్రంప్.. అసలేం జరుగుతోంది..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?



Click it and Unblock the Notifications