కరోనా లాక్ డౌన్ ప్రభావమే కాదు,లాక్ డౌన్ అనంతరం ప్లాంట్ తెరిచిన తర్వాత కూడా ఆటోమొబైల్ దిగ్గజం బజాజ్ ఆటోకు కష్టాలు తప్పడం లేదు. కంపెనీకి సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్ కరోనా కోరల్లో చిక్కుకుంది. కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కార్మికులు ప్లాంట్ కి వచ్చి పని చేయాలంటే భయపడుతున్నారు.
మహారాష్ట్రలోని వాలూజ్, చకన్ వద్ద బజాజ్ ఆటోకు రెండు ప్లాంట్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్ లోని పంత్ నగర్ వద్ద మరో ప్లాంట్ ఉంది. వాలూజ్ ప్లాంట్ లో ప్లాటినా, సిటి 100, బాక్సర్ 150 తో పాటుగా త్రిచక్ర వాహనాలు కూడా తయారుచేస్తారు. ఎనిమిది వేల మందికి పైగా కార్మికులు వాలూజ్ ప్లాంట్ లో పని చేస్తున్నారు. అయితే ఈ ప్లాంట్ లోనే కార్మికులకు కరోనా సంకటంగా తయారైంది .

ఇప్పటివరకు కరోనా కారణంగా ఈ ప్లాంట్ లో ఏడుగురు కార్మికులు మృత్యువాత పడ్డారు. బజాజ్ ఆటోకు సంబంధించిన ముంబై వాలూజ్ ప్లాంట్ లో 400 కరోనా కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో కార్మికులు పని చేయాలంటే భయపడుతున్నారు. ప్లాంట్ ను తాత్కాలికంగా మూసివేయాలని యాజమాన్యాన్ని కోరుతున్నారు. 8 నుండి 10 రోజులపాటు కరోనా వైరస్ సైకిల్ ను విచ్ఛిన్నం చేయడానికి ప్లాంట్లో పని నిలిపివేయాలని కోరుతున్నామని బజాజ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
మేనేజ్మెంట్ తో చర్చిస్తున్నామని, తమకు మేనేజ్మెంట్ కు మధ్యవర్తిత్వం వహించడానికి ప్రభుత్వ అధికారులను సైతం సంప్రదించాలని భావిస్తున్నామని వారు అంటున్నారు. ప్లాంట్ ను మూసి వేయడం వల్ల ఉత్పత్తి నష్టం జరిగితే, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి తరువాత అదనపు పనిగంటలు కేటాయించమని కోరుతున్నామని కూడా వారు పేర్కొంటున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు బజాజ్ యాజమాన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. మొన్నటి వరకు దేశవ్యాప్త లాక్ డౌన్ తో మూతపడిన ప్లాంట్, ప్రస్తుతం కరోనా కేసులతో మరోమారు తాత్కాలికంగా మూత పడటానికి సిద్ధంగా ఉంది. ఈ పరిణామాలు సంస్థకు తలనొప్పిగా మారాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications