కరోనా మహమ్మారి వల్ల కాంట్రాక్ట్ ఉద్యోగులపై ప్రభావం ఎక్కువగా పడుతోందట. వివిధ సంస్థలు పర్మినెట్ ఉద్యోగుల కంటే ముందు కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించేందుకు మొగ్గు చూపుతున్నాయట. దాదాపు అన్ని రంగాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోందట. ఉదాహరణకు ఓ కంపెనీలో రెండేళ్లుగా పని చేసే ఉద్యోగికి హఠాత్తుగా మే 14న ఉద్యోగం నుండి తొలగిస్తున్నట్లు చెప్పారట. సౌత్ ఢిల్లీ ప్రాంతంలో ఫైనాన్స్, రిటైల్, ఇన్సురెన్స్, ఈ-కామర్స్, ఎఫ్ఎంసీజీ సహా వివిధ రంగాల్లోని కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారట.

వర్క్ లేకపోవడంతో తొలగింత
కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతినడంతో చాలామంది క్లయింట్స్ తమకు ఎలాంటి వర్క్ ఇవ్వడం లేదని, వారికి అందించే సేవలు నిలిపివేయాలని కోరారని, దీంతో సిబ్బందిని తగ్గించే పరిస్థితి వచ్చిందని ఓ కంపెనీ బిజినెస్ యూనిట్ హెచ్ఆర్ టీమ్.. తొలగించబడిన ఓ ఉద్యోగికి లేఖ ద్వారా తెలియజేసింది. నోటీసు పీరియడ్‌కు గాను అతనికి 30 రోజుల వేతనం లభిస్తుందని పేర్కొన్నారు. అతని టేక్ హోమ్ శాలరీ రూ.20,000.

వివిధ రంగాల్లో ఎంతో మందిది ఇదే పరిస్థితి
ఈ పరిస్థితి ఏ ఒక్కరిదో కాదని, వివిధ రంగాల్లో లక్షలాదిమందిది ఇదే పరిస్థితి అని చెబుతున్నారు. దాదాపు ప్రతి వ్యాపారంలో, ప్రతి పరిశ్రమలో కరోనా కారణంగా ఉద్యోగాల తొలగింపు లేదా శాలరీ కట్ లేదా యథాతథంగా ఉంచడం జరుగుతోంది. ఈ ప్రభావం ఎక్కువగా టెంపరరీ ఉద్యోగులపై, ఆ తర్వాత పర్మినెంట్ ఉద్యోగులపై పడుతోందని చెబుతున్నారు.

శ్రామిక శక్తిని తగ్గిస్తున్నారు...
గత 45 రోజులుగా రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో శ్రామిక శక్తిని తగ్గిస్తున్నారని చెబుతున్నారు. మే, జూన్ నెలల్లో మరింత తొలగింపులు ఉండవచ్చునన్నారు. బీటుబీ ఈ-కామర్స్ స్టార్టప్‌లలో గత నెలలో పది శాతం నుండి పదిహేను శాతం కాంట్రాక్ట్ స్టాఫ్‌ను తగ్గించుకున్నారని ఓ అంచనా.


Click it and Unblock the Notifications