Income Tax: దేశంలో విధించబడుతున్న పన్నుల పట్ల ట్యాక్స్ పేయర్స్ నుంచి విమర్శలు చెలరేగుతున్నాయి. భారీ స్థాయిలో పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరుస్తుందని తరచూ విశ్లేషకులు, ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. పెద్ద మొత్తంలో ట్యాక్స్ చెల్లిస్తున్నా వైద్యం, తమ పిల్లలకు విద్య విషయంలో ప్రైవేట్ సంస్థలను ఆశ్రయించాల్సి వస్తోందని వాపోతున్నారు.
ఈ నేపథ్యంలో 100% ఆదాయపు పన్ను సేవ్ చేయడం అసలు సాధ్యమేనా అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీనికి కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి పరిష్కారం చూపారు. కేరళ కంటెంట్ క్రియేటర్ శ్రీనిధి హండే దీనిపై చేసిన వీడియో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది. కొత్త పన్ను విధానంలో మార్పులను ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ వీడియో రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది.

చాలా సులభంగా, చట్టపరంగా ఆదాయపు పన్నును సేవ్ చేసుకోవచ్చంటూ హండే తన వీడియోను ప్రారంభించారు. 'మొదటి దశలో మీ ఇల్లు, బాల్కనీ లేదా టెర్రస్‌పై గడ్డిని పెంచుకోవాలి. అనంతరం HR వద్దకు వెళ్లి జీతం వద్దు అని చెప్పండి. అందుకు బదులుగా మీ నుంచి గడ్డిని కొనుగోలు చేయాలని కోరండి. మీ జీతం 50 వేలు అయితే ఒక్కొక్కటి 1 వెయ్యి చొప్పున 50 గడ్డి పోగులను కొనుగోలు చేయవచ్చు. ఇది పూర్తిగా చట్టపరమైన ప్రక్రియ' అన్నారాయన.
'ఈ విధానంలో జీతం నుంచి వచ్చే మీ ఆదాయం సున్నా అవుతుంది. మీ దగ్గర ఉన్నదంతా భారతదేశంలో పన్ను విధించబడని వ్యవసాయ ఉత్పత్తులను విక్రయించడం ద్వారా వచ్చిన ఆదాయంగా పరిగణించబడుతుంది. తద్వారా మీరు 100 శాతం ఆదాయాన్ని సేవ్ చేసుకోవచ్చు. TDS లేదా పెట్టుబడి గురించి కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు' అని వీడియో ముగించారు.


Click it and Unblock the Notifications