కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఓ ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్‌కు చెందిన 100 శాతం రుణాలను తాను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. భారత ఆర్థిక వ్యవస్థపై కూడా భారీగానే ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలో మాల్యా ట్వీట్ చేశారు. ఈ సంక్షోభ సమయంలోనైనా తన విజ్ఞప్తిని ఆలకించాలని కోరారు. కింగ్ ఫిషర్ ఎయిర్‌లైన్స్ అప్పులు వంద శాతం తిరిగి చెల్లిస్తానని, తన కోరిక మన్నించాలన్నారు.

ఇప్పుడైనా తన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని నిర్మల సీతారామన్‌ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. తాను తీసుకున్న రుణాల్ని మొత్తం తిరిగి చెల్లిస్తానని పలుమార్లు చెబుతున్నప్పటికీ బ్యాంకులు సిద్ధంగా లేవన్నారు. బ్యాంకుల ఆదేశాల మేరకు వారు చేసిన అటాచ్‌మెంట్లను విడుదల చేసేందుకు ఈడీ కూడా సిద్ధంగా లేదన్నాడు.
కరోనా వైరస్ కారణంగా దేశ ఆర్ధిక వ్యవస్థ కుదేలవుతున్న నేపథ్యంలో తాను చెల్లిస్తానన్న రుణాల విషయంలో ఆర్థికమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు దేశ వ్యాప్త లాక్‌డౌన్‌ను గౌరవిస్తున్నామన్నాడు. కింగ్ ఫిషర్‌లో అన్ని కార్యకలాపాల్ని, తయారీని నిలిపివేసినట్టు చెప్పారు. అయితే తమ ఉద్యోగులను ఇంటికి పంపించేందుకు ప్రభుత్వ సహాయాన్ని అర్థించారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలంతా ఇంటివద్దే సురక్షితంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటించాలని కూడా సూచించారు. తాను కూడా అదే పాటిస్తున్నానని తెలిపారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications