ఆర్థిక విస్తరణ ఆశించిన మేర కొనసాగని పరిస్థితుల్లో రానున్న మూడేళ్లలో బ్యాంకుల నుండి తీసుకున్న 4 శాతం కార్పోరేట్ రుణాలు డిఫాల్ట్‌గా మారే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. 4 శాతం అంటే దాదాపు రూ.2.54 లక్షల కోట్లుగా ఉంటుంది. ఈ మేరకు టాప్ 500 (రుణాలు తీసుకున్న) ప్రయివేటు సెక్టార్ కంపెనీలపై చేసిన స్టడీలో తేలింది.

10.5 లక్షల కోట్లు నష్టపోయే అవకాశం
ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ టాప్ 500 ప్రయివేటు రంగ సంస్థలపై చేసిన అధ్యయనం మేరకు వారి రుణాలలో 10.5 లక్షల కోట్లు నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు తీసుకున్న రుణగ్రహీతలు ఈ రుణాలు తీర్చి చెల్లించడానికి ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఉంటాయి.

రుణాలు రూ.39.28 లక్షల కోట్లు
టాప్ 500 అధిక రుణాలు కలిగిన కంపెనీలు మొత్తంగా రూ.39.28 లక్షల కోట్ల లోన్ రుణాలు కలిగి ఉన్నారు. ఇందులో ప్రస్తుతం ఉన్న డిఫాల్ట్స్ మొత్తం రూ.7.35 లక్షల కోట్లు. రానున్న మూడేళ్లలో దీనికి రూ.2.54 లక్షల కోట్లు జత అయితే ఇది రూ.10.5 లక్షల కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి.

కారణాలివే..
సిస్టమ్ లెవల్ కార్పోరేట్ లోన్ బుక్ వ్యాల్యూ దాదాపు రూ.64 లక్షల కోట్లుగా ఉంది. కార్పోరేట్లు తమ నిధులను ఉత్పాదకత కోసం ఉపయోగించుకోకపోవడం వల్ల సమస్యలు వస్తున్నాయని ఈ స్టడీలో తేలింది. పెరుగుతున్న రుణ నష్టాల నేపథ్యంలో నిధులు సమకూర్చుతున్నారని, దీంతో ఉత్పాదక ఆస్తుల వాటా తగ్గిందని తేలింది. కార్పోరేట్ ప్రమాణాలను బలోపేతం చేయడం అత్యవసరమని ఇండియా రేటింగ్ అండ్ రీసెర్చ్ అనలిస్ట్ అరిందమ్ అన్నారు.

వృద్ధి రేటు..
ఆర్థిక మందగమనం నేపథ్యంలో 2019-20 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 5గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యల నేపథ్యంలో 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలలో 6 శాతం పైకి చేరుకుంటుందని వివిధ రేటింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో క్వార్టర్‌లో జీడీపీ 4.7 శాతంగా ఉంది. గత కొంతకాలంగా ప్రపంచ, భారత వృద్ధి రేటు మందగించింది.

బ్యాంకులపై ఒత్తిడి
కొత్తగా రూ.2.54 లక్షల కోట్ల రుణాలు పెరిగితే బ్యాంకులపై మరింత ఒత్తిడి పెరుగుతుంది. బ్యాంకుల లాభదాయకతపై ప్రభావం పడుతుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నిబంధన ప్రకారం కంపెనీలు లోన్ రీపేమెంట్ సింగిల్ డే ఆలస్యమైతే డిఫాల్టర్‌గా భావిస్తారు. ఓ ఖాతా 90 రోజుల పాటు సర్వీస్‌లో లేకుంటే ఎన్పీఏగా చెబుతారు.


Click it and Unblock the Notifications