ప్రస్తుత క్యాలెండర్ ఏడాది (2022)లో భారత ఉద్యోగుల సగటు వేతనం 9 శాతంగా ఉండవచ్చునని మెర్సర్ స్టడీ సర్వే వెల్లడించింది. కరోనా సంక్షోభం కారణంగా 2020లో ప్రోత్సాహకాలు, వేతనాలు భారీగా తగ్గిన విషయం తెలిసిందే. ఇప్పుడు క్రమంగా మళ్లీ కరోనా పూర్వస్థితికి చేరుకున్నట్లుగా నివేదిక తెలిపింది. ఈ సర్వేలో 5700 జాబ్ ఫంక్షన్స్, 14 లక్షలకు పైగా క్యుమ్యులేటివ్ ఎంప్లాయీస్ కలిగిన 988 కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సర్వేలో పాల్గొన్న కంపెనీల్లో టెక్నాలజీ, సర్వీసెస్, లైఫ్ సైన్సెస్, ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఎనర్జీ, కన్స్యూమర్ తదితరాలు ఉన్నాయి. మెర్సెర్ టోటల్ రెమ్యునరేషన్ పేరుతో ఈ సర్వేను నిర్వహించింది.

ఈ రంగాల్లో అధిక పెంపు
వినియోగదారు ఆధారిత, లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ తదితర రంగాల్లో పరిశ్రమ సగటు కంటే వేతన పెంపు అధికంగా ఉండవచ్చునని ఈ సర్వే అభిప్రాయపడింది. సానుకూల ఆర్థిక, వ్యాపార సెంటిమెంటుతో 2022లో వేతన పెంపు 9 శాతంగా ఉండవచ్చునని, 2020లో ఇది 7.7 శాతంగా ఉండే అవకాశముందని పేర్కొంది. టెక్ రంగంలో అన్ని విభాగాల ఉద్యోగుల వేతన ఇంక్రిమెంట్లు 2019 స్థాయికి చేరినట్లు తెలిపింది. 2021లో పరిశ్రమ సగటు వేతన పెంపు 8 శాతంగా ఉన్నట్లు తెలిపింది.

భవిష్యత్తు భేష్
టెక్నాలజీ సంబంధిత నైపుణ్యాలు కలిగిన ఉద్యోగులకు ప్రస్తుతం, భవిష్యత్తులో వేతన పెంపు అధికంగా ఉంటుందని తెలిపింది. 2018-21 మధ్య గత నాలుగేళ్ల కాలంలో టెక్ శాలరీ పెంపు 17 శాతంగా ఉండగా, సాఫ్టువేర్ డెవలప్‌మెంట్, ఆర్ అండ్ డీ, ప్రీ-సేల్స్, ప్రోడక్ట్ కన్సల్టింగ్, డేటా సైన్సెస్‌లో 12 శాతం వరకు ఉందని తెలిపింది.

మరో సర్వే కూడా
భారత్‌లో వేతన పెంపు ఈ ఏడాది అయిదేళ్ల గరిష్టం 9.9 శాతానికి చేరుకోవచ్చునని మరో నివేదిక ఆయాన్ సర్వే వెల్లడించింది. ఆర్థిక రికవరీ పుంజుకోవడం, సానుకూల వ్యాపార సెంటిమెంట్‌తో కంపెనీలు కొత్త తరం సామర్థ్యాలను నిర్మించేందుకు సిద్ధంగా ఉండటం, అధిక పెట్టుబడుల ప్రణాళికలతో ముందుకు వస్తుండటం వేతన పెంపుకు అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఈ-కామర్స్, వెంచర్ క్యాపిటల్, ఐటీ, ఐటీఈఎస్, లైఫ్ సైన్సెస్ రంగాల్లో అధిక వేతన పెంపు ఉండవచ్చునని తెలిపింది.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications