Jobs: కంపెనీల్లో లక్షల్లో ఖాళీలు.. ఉద్యోగుల వేటలో సంస్థలు.. మెగా రిక్రూట్‌మెంట్స్..
Jobs: భారత ఆర్థిక వ్యవస్థపై కరోనా ప్రభావం లేదు. దీంతో రానున్న పండుగల సీజన్ కోసం ప్రజలు భారీగా షాపింగ్ చేస్తున్నారు. దీంతో ఆర్థిక వ్యవస్థలో ఉపాధి అవకాశాలు కూడా పెరిగాయి.

భారీగా ఉద్యోగాలు..
వేగంగా వ్యాపారాలు పుంజుకుంటున్న వేళ పోటీ కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. అయితే కంపెనీలకు మాత్రం మానవ వనరుల కొరత పెద్ద సంక్షోభంగా మారింది. కంపెనీలు సిబ్బంది కొరతను తగ్గించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. వీటి కోసం ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సిద్ధం చేసుకుంటున్నాయి. ఒక నివేదిక ప్రకారం ఈ ఏడాది పండుగల సీజన్‌లో 5 నుంచి 6 లక్షల తాత్కాలిక సిబ్బంది అవసరం కావచ్చని తెలుస్తోంది.

మెగా రిక్రూట్‌మెంట్..
క్వెస్, టీమ్‌లీజ్ సర్వీసెస్, సీల్ హెచ్‌ఆర్ సర్వీసెస్, మ్యాన్‌పవర్, రాండ్‌స్టాడ్, పర్సోల్‌కెల్లీ వంటి స్టాఫ్ కంపెనీలు స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్‌ల భారీ రిక్రూట్ మెంట్లు చేపడుతున్నాయి. ఇందుకోసం ఈమెయిల్, సోషల్ మీడియా ప్రచారాలను సైతం నిర్వహిస్తున్నాయి. మాజీ డిఫెన్స్ సిబ్బంది, వైకల్యాలున్న వ్యక్తులను కనెక్ట్ చేయడం, నైపుణ్యం కలిగిన డేటాబేస్ నుంచి పేర్లను సేకరించడం చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు బస్ కండక్టర్లు, ఆటోరిక్షా డ్రైవర్లు, సెక్యూరిటీ గార్డులను కూడా ఆశ్రయిస్తున్నాయి.

30 శాతం జీతాల పెంపు..
కొత్త ఉద్యోగులను చేర్చుకోవడానికి 30% వరకు జీతం పెంచడానికి కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. వీటికి తోడు వారికి వివిధ రకాల ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నాయి . దీంతో పాటు ఇన్సెంటివ్‌లు, బోనస్‌లతో పాటు తమ నైపుణ్యాలను పెంచుకునేందుకు కొత్త అవకాశాలను అందిస్తున్నారు. అసంఘటిత రంగాల నుంచి వచ్చే వారికి ఇది సరైన అవకాశమని క్వెస్ ప్రెసిడెంట్ లోహిత్ భాటియా తెలిపారు.

తాత్కాలిక ఉద్యోగులకు డిమాండ్..
దేశంలో ఎలాంటి ఆంక్షలు లేకుండా ఈ ఏడాది పండుగలను జరుపుకుంటున్నామని సీఐఎల్ హెచ్‌ఆర్ సీఈవో ఆదిత్య నారాయణ్ మిశ్రా అన్నారు. దీనికి ముందు కరోనా మహమ్మారికి సంబంధించి రెండేళ్ల పాటు అనేక ఆంక్షలు కొసాగిన విషయం తెలిసిందే. అటువంటి పరిస్థితిలో.. ఈసారి వినియోగం కొత్త గరిష్ఠ స్థాయికి చేరుకోవచ్చని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత ఏడాది కంటే ఈ ఏడాది తాత్కాలిక ఉద్యోగులకు 30 నుంచి 40 శాతం డిమాండ్ పెరిగింది. ఏదేమైనా ఉద్యోగాల కోసం వెతుకున్న వారికి పండుగ కొత్త అవకాశాలను తీసుకొచ్చింది.


Click it and Unblock the Notifications