LPG Cylinder Prices: ప్రతి నెల మెుదటి రోజున ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నాయి. అయితే ఈ సారి కూడా ధరలను కొంతమేర తగ్గిస్తూ కంపెనీలు ఊరటను ప్రకటించాయి. ద్రవ్యోల్పణంతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు, వ్యాపారులకు ఇది కొంత ఊరటన ఇస్తోంది.

గ్యాస్ ధర మార్పులు..
పండుగల సమయంలో అక్టోబర్ 1న ఎల్‌పీజీ సిలిండర్ల ధరలను చమురు కంపెనీలు మరోమారు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఎల్‌పీజీ సిలిండర్ ధరలో ఏకంగా రూ.25.50 తగ్గింపును ప్రకటించాయి. అయితే.. ఈ ధర తగ్గింపు కేవలం వాణిజ్య సిలిండర్లపై మాత్రమే. 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ల విషయంలో చమురు కంపెనీలు ఈ నెల ఎలాంటి ప్రకటన చేయలేదు.

దేశంలోని నగరాల్లో తగ్గింపు ఇలా..
అక్టోబర్ 1 నుంచి ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఇండేన్ సిలిండర్ ధర రూ.91.50, కోల్‌కతాలో రూ.36.50, ముంబైలో రూ.32.50, చెన్నైలో రూ.35.50 తగ్గినట్లు కంపెనీలు వెల్లడించాయి. వాణిజ్య సిలిండర్ల ధరల తగ్గింపు ప్రకటనతో హోటల్ పరిశ్రమ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా వరుస తగ్గింపులు వారికి కొంత ఊరటన కలిగిస్తున్నాయి. అయితే ఈ తగ్గింపు వినియోగదారులకు, ఆహార ప్రియులకు కొంత భారాన్ని తగ్గిస్తుందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

తగ్గింపు తర్వాత రేట్లు..
ఈ రోజు చమురు కంపెనీలు ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించడంతో.. ఢిల్లీలో 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్ ధర రూ.1,885 నుంచి రూ.1,859.50కి తగ్గింది. అదే సమయంలో కోల్‌కతాలో ధర తగ్గాక రూ.1959కి చేరింది. గతంలో ఇది రూ.1995.50గా ఉంది. ముంబైలో సిలిండర్ ధర రూ.1,811.50కి తగ్గగా.. గతంలో అది రూ.1,844గా ఉండేది.

గృహ వినియోగదారులకు నిరాశ..
జూలై 6 నుంచి డొమెస్టిక్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే.. సిలిండర్ ధర ఇప్పటికీ అప్పటి రేటుకే అందుబాటులో ఉంటుంది. ఇండేన్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ.1,053, కోల్‌కతాలో రూ.1,079, ముంబైలో రూ.1,052, చెన్నైలో రూ.1,068గా కొనసాగుతున్నాయి.

గతంలో తగ్గింపులు ఇలా..
ఆగస్టులో కూడా కమర్షియల్ సిలిండర్ల ధరలను కంపెనీలు తగ్గించారు. అప్పట్లో సిలిండర్ కు రూ.36 తగ్గింపును కంపెనీలు ప్రకటించాయి. జూలైలో సిలిండర్ పై ధర రూ.9 మేర తగ్గింది. అంతకుముందు.. జూన్ లో వాణిజ్య సిలిండర్ ధర రూ.198 తగ్గింది. అలాగే సెప్టెంబర్ మాసంలో రూ.100, అక్టోబర్ నెలలో రూ.25.50 తగ్గింపు వచ్చింది.
దీంతో మెుత్తంగా జూన్ నుంచి ఇప్పటి వరకు వాణిజ్య సిలిండర్ ధర రూ.503.50 తగ్గింది. ఇది కమర్షియ సిలిండర్ వినియోగదారులకు పెద్ద ఊరట. అయితే సహజ వాయువు ధరలు పెరుగుతున్నందున రానున్న కాలంలో సీఎన్జీ, పీఎన్జీ గ్యాస్ ధరలు భారీగా పెరగవచ్చని నిపుణులు చెబుతున్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications