సాఫ్టువేర్ దిగ్గజం కాగ్నిజెంట్ జనవరి - మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించింది. మార్చి క్వార్టర్‌లో నికర ఆదాయంలో 16.7% క్షీణత నమోదై 367 మిలియన్ డాలర్లుగా ఉంది. కాగ్నిజెంట్ సంస్థ క్యాలెండర్ ఇయర్ జనవరి నుండి డిసెంబర్ ఆర్థిక సంవత్సరాన్ని అనుసరిస్తుంది. 2019లో ఇదే క్వార్టర్‌లో నికర లాభం రూ.441 కోట్లుగా ఉంది. కాగ్నిజెంట్ హెడ్ క్వార్టర్ న్యూజెర్సీలో ఉంటుంది. ఈ కంపెనీకి ఇండియాలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు.

రాన్‌సమ్ వేర్ అటాక్ ఖరీదు 70 మిలియన్ డాలర్లు
క్వార్టర్ రెవెన్యూ 2.8 శాతం పెరిగి 4.2 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతకుముందు ఏడాది ఇది 4.11 బిలియన్ డాలర్లుగా ఉంది. రాన్‌సామ్ అటాక్ కారణంగా ఈ క్వార్టర్‌లో 50 మిలియన్ డాలర్ల నుండి 70 మిలియన్ డాలర్ల మేర ప్రభావం పడిందని అంచనా వేస్తోంది. 2020లో మార్జిన్స్ 16 శాతం నుండి 17 శాతానికి ఉంటాయని అంచనా వేస్తోంది.

ఆపరేషన్స్ ఖర్చు
కాగ్నిజెంట్ ఆఫరేషన్స్ ఖర్చు మార్చి క్వార్టర్‌లో 15.1 శాతంగా ఉంది. అంతకుముందు డిసెంబర్ క్వార్టర్‌లో 17 శాతంగా ఉంది. కంపెనీ డిజిటల్ రెవెన్యూ 41 శాతంగా ఉంది. అంతకుముందు ఏడాది ఇదే సమయంలో 19 శాతంగా ఉంది. ఎంప్లాయీస్ రిటెన్షన్ కాస్ట్ 10 మిలియన్ డాలర్లుగా ఉంది. ఉద్యోగుల వేతనాల కోసం 26 మిలియన్లు ఖర్చు చేసింది. ఏప్రిల్ నెల వరకు ఇది 1.74 బిలియన్ డాలర్లు రుణాన్ని తగ్గించుకుంది.

20,000 నియామకాలు
కంపెనీ డిజిటల్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తిగా ఉంది. ఇందుకోసం 20,000 కొత్త నియామకాలను చేపట్టనుంది. 41 శాతం ఆదాయం డిజిటల్ సర్వీసెస్ ద్వారా వచ్చింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..



Click it and Unblock the Notifications