వేలమంది ఉద్యోగులకు కోకాకోలా భారీ షాక్! తగ్గిన సేల్స్, సంక్షోభం నుండి గట్టెక్కాలంటే..
కరోనా మహమ్మారి నేపథ్యంలో వివిధ రంగాల్లో పలు కంపెనీలు 2020 తొలి అర్ధ సంవత్సరంలో ఉద్యోగాల కోత, వేతనాల కోత చేపట్టిన విషయం తెలిసిందే. గత మూడునాలుగు నెలలుగా ఆర్థిక కార్యకలాపాలు వేగంగా పుంజుకుంటున్నాయి. దీంతో ఆయా కంపెనీలు ఇప్పుడు నియామకాలు చేపడుతున్నాయి. అయితే కరోనా కొన్ని రంగాలు, కంపెనీలపై సుదీర్ఘ ప్రభావం చూపాయి. దీంతో బ్రీవరేజ్ దిగ్గజం కోకాకోలా ప్రపంచవ్యాప్తంగా 2,200 మంది ఉద్యోగులను తొలగించనుందని వార్తలు వస్తున్నాయి.

భారీగా తగ్గిన కోకాకోలా సేల్స్
వర్క్ ఫోర్స్ రీస్ట్రక్చరింగ్ ప్లాన్‌లో భాగంగా కోకాకోలా రెండువేల మందికి పైగా ఉద్యోగులను తొలగించనుంది. అమెరికాలోనే కోక్ దాదాపు 1200 మంది ఉద్యోగులను తొలగించనుందని తెలుస్తోంది. హోమ్ మార్కెట్లో దీనికి 12 శాతం శ్రామిక శక్తి ఉంది. 2019 చివరి నాటికి ఈ కంపెనీలో ప్రపంచవ్యాప్తంగా 86,200 మంది ఉద్యోగులు ఉన్నారు. కరోనా నేపథ్యంలో ఆదాయంపై తీవ్ర ప్రభావం పడింది. దీని ఆదాయంలో ఎక్కువగా బయటి నుండి వస్తాయి. మూడో త్రైమాసికంలో కూడా కోకాకోలా నికర అమ్మకాలు 9 శాతం తగ్గాయి.

ఈ సంక్షోభం నుండి గట్టెక్కేందుకు
కోక్ తన వ్యాపార పునర్నిర్మాణం కోసం, అలాగే పోర్ట్‌పోలియోను తగ్గించే ప్రణాళికను వేగవంతం చేయడం ద్వారా ఈ సంక్షోభం నుండి గట్టెక్కాలని భావిస్తోంది. ఇప్పటికే ఇది తన ట్యాబ్, ఓఢ్వాల్లా బ్రాండ్ ఉత్పత్తులను నిలిపివేసింది. వీటి సేల్స్ దాదాపు లేకపోవడంతో పాటు ఇది మున్ముందు కూడా ఆశాజనకంగా లేదని చెబుతున్నారు. ప్రాంతీయ, స్థానికస్థాయిల్లో కొత్త ఆపరేటింగ్ యూనిట్లు ప్లాన్ చేస్తోంది.

550 మిలియన్ డాలర్ల వరకు..
కోకాకోలా పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఉద్యోగాల కోత ఉంటుందని తెలుస్తోంది. ఆగస్ట్ నెలలో అమెరికా, కెనడా, ప్యూర్టారికోలో వాలంటరీ లేఆఫ్ ప్యాకేజీని ప్రకటించింది. కరోనా సంక్షోభం నుండి గట్టెక్కే ఉద్దేశ్యంలో భాగంగా ఉద్యోగ కోత వంటి వాటి కోసం 350 మిలియన్ డాలర్ల నుండి 550 మిలియన్ డాలర్లు ఖర్చు చేయనుంది. 230 బిలియన్ డాలర్ల మార్కెట్ వ్యాల్యూ కలిగిన కోక్ స్టాక్స్ సానుకూలంగా ఉన్నాయి. అయితే 2020లో మొత్తంగా 3 శాతం క్షీణించాయి.


Click it and Unblock the Notifications