సిటీ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ సహా 13 దేశాల్లో రిటైల్ వ్యాపారం నుండి బయటకు వచ్చేందుకు అమెరికాకు చెందిన ఈ బ్యాంకింగ్ దిగ్గజం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ రిటైల్ బిజినెస్‌ను విక్రయించేందుకు సరైన కొనుగోలుదారు కోసం చూస్తోంది. వినియోగదారు వ్యాపారం నుండి బయటకు వచ్చిన తర్వాత పూర్తిగా కార్పోరేట్ వ్యాపారం పైన దృష్టి సారించి ఈ విభాగంలో విస్తరించేందుకు పెట్టుబడులు పెట్టాలని భావిస్తోంది.

అనుమతులు రాగానే విక్రయం
నియంత్రణ అనుమతులు రాగానే బ్యాంకు రిటైల్ వ్యాపారం విక్రయం పూర్తి చేస్తామని సిటీ బ్యాంకు ఇండియా సీవో తెలిపారు. ఈ బ్యాంక్‌కు దేశంలో 35 శాఖలు ఉన్నాయి. సిటీ కన్స్యూమర్ బ్యాంకింగ్ విభాగంలో దాదాపు 4,000 మంది ఉద్యోగులు ఉన్నారు. మొత్తం 19వేల మంది ఉద్యోగులు ఉన్నారు. సిటీ బ్యాంకుకు 29 లక్షల మంది రిటైల్ ఖాతాదారులు ఉన్నారు. 12 లక్షల బ్యాంకు అకౌంట్లు, 22 లక్షల క్రెడిట్ కార్డు అకౌంట్స్ ఉన్నాయి. భారత్ సహా 13 దేశాల్లో కన్స్యూమర్ బ్యాంకింగ్ నుండి వైదొలుగుతున్నట్లు సిటీ బ్యాంక్ గ్లోబల్ సీఈఓ గురువారం వెల్లడించారు.

అప్పటి వరకు సేవలు
మార్కెట్లలో తమ బ్యాంక్ ఇతర సంస్థలతో పడలేకపోవడం ఇందుకు కారణమని స్పష్టం చేశారు. సిటీ బ్యాంక్ ఈ వ్యాపారం నుండి ఎలా వైదొలగనుందనే అంశంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. అంతేకాదు, భారత్‌లో ఈ వ్యాపారం నుండి వైదొలిగేందుకు ఆర్బీఐ ఆమోదం అవసరం. అప్పటివరకు తమ కస్టమర్లకు యధావిధిగా సేవలు అందించనుంది.

ఎన్నో ఏళ్లుగా సేవలు
బయ్యర్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నామని, ఈ సేల్ వల్ల ఇప్పటికే ఉన్న కస్టమర్లపై ఎలాంటి ప్రభావం ఉండదని సిటీ బ్యాంకు తన ప్రకటనలో తెలిపింది. 1902లో భారత మార్కెట్లోకి ప్రవేశించిన సిటీబ్యాంకు 1985లో కన్స్యూమర్ బ్యాంకింగ్ సేవలను ప్రారంభించింది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications