ప్రపంచ టెక్ తయారీలో భారతదేశంకో స్థానం సంపాదించాలన్న ఆశతో ముందుకు వెళ్తోంది. మొబైల్ తయారీ రంగం ఇప్పుడు దేశానికి మారిన ముఖచిత్రం. ఆపిల్, గూగుల్, మోటరోలా, శామ్‌సంగ్... ఇవన్నీ మన భారత భూమినే తయారీ కేంద్రంగా ఎంచుకున్నాయి. కానీ ఈ వేగాన్ని చూసి బాధపడుతున్న దేశం ఒకటి ఉంది అదే చైనా.

భారత మొబైల్ ఎగుమతులు FY25లో $24 బిలియన్ల మార్క్ దాటగా, 2025-26లో $32 బిలియన్ లక్ష్యంను చూపిస్తున్నాం. కానీ ఈ అభివృద్ధి అంతా ఇప్పుడు ఒక అజ్ఞాత అడ్డంకిలో చిక్కుకుని పోవచ్చని పరిశ్రమలో ఆందోళన వ్యక్తమవుతోంది.
భారతి ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ చైనా అమలు చేస్తున్న అధికారికంగా ప్రకటించకుండా వాణిజ్య ఆంక్షలపై అలారం మోగించింది. ఇవి భారత పోటీ శక్తిని దెబ్బతీసి, ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యంగా పెట్టుకున్న 32 బిలియన్ డాలర్ల స్మార్ట్‌ఫోన్ ఎగుమతి లక్ష్యాన్ని ప్రమాదంలో పడేయవచ్చని పరిశ్రమ హెచ్చరిస్తోంది.
చైనా మూలధన పరికరాలు, ఇతర ఖనిజాలు, నైపుణ్యం గల సాంకేతిక సిబ్బంది మీద విధిస్తున్న ఆంక్షలను తక్షణమే పరిష్కరించాలని పరిశ్రమ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అధికారిక రూపంలో ఏ ప్రకటనలు లేకుండా, కేవలం మాటల ఆదేశాల ద్వారానే నియంత్రణలు అమలు అవుతున్నాయని పరిశ్రమ ఎత్తి చూపింది. ఈ లేఖను ఇండియా సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) అనే పరిశ్రమ సంఘం రాశింది. ఇది తక్షణమే చర్చించాల్సిన సమస్య అని. తయారీ ఆలస్యమైతే కేవలం టార్గెట్‌నే కాదు భారత్ వృద్ధి గమనానికే అంతరాయం కలుగుతుందని స్పష్టం చేసింది.
ICEA ఇలా చెప్తున్నారు "ప్రస్తుతం దేశీయ తయారీకి పెద్ద అంతరాయం ఏమీ లేదనిపించొచ్చు. కానీ ఎగుమతుల ఆధారంగా మనం తయారు చేస్తున్న ఉత్పత్తులే ఇప్పుడు పెద్ద హిట్టు అవుతున్నాయి. వాటికి ఇవన్నీ వ్యతిరేకం." ICEA సభ్యుల్లో ఆపిల్, గూగుల్, మోటరోలా, ఫాక్స్‌కాన్, వివో, ఒప్పో, లావా, డిక్సన్, ఫ్లెక్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.
ఇప్పటికే పరికరాలపై ఆంక్షలు, అరుదైన లోహాలపై నియంత్రణలు, సిబ్బంది బదిలీలు అన్నీ జరిగిపోతున్నాయి. ఇది సాధారణ నిబంధనలు కాదని, సూక్ష్మ వ్యూహాలు అని పరిశ్రమ చెబుతోంది. ఇంకా భారత పరిశ్రమకు నష్టాన్ని తెచ్చేలా, చైనా తాజాగా అరుదైన లోహాల (రేర్ ఎర్త్ మెటీరియల్స్) ఎగుమతులపై ఆంక్షలు విధించడం వలన, స్మార్ట్‌ఫోన్ తయారీదారులకు అవసరమైన ముడిసరకుల కొరత ఏర్పడుతోంది. స్థితిని మరింత కఠినతరం చేస్తూ, చైనా తాజాగా చైనా, తైవాన్ లేదా భారత కంపెనీల్లో పని చేస్తున్న చైనా జాతీయ ఉద్యోగులను, వారు పని మద్యలోనే ఉన్నా సరే, వెంటనే తన దేశానికి తిరిగి వెళ్ళాలని ఆదేశించింది. ఇలాంటి నిపుణుల సంఖ్య వందల్లో ఉంది. ఫలితంగా, టెక్నాలజీ బదిలీలు, నైపుణ్య శిక్షణలు భంగం కలిగిపోతున్నాయి; ముఖ్యంగా, ఉత్పత్తి ఖర్చులు పెరగడంతో భారత్ పోటీ సామర్థ్యం దెబ్బతింటోందని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు.
ఈ చర్యల వల్ల టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్ నెమ్మదిస్తుంది. ఉత్పత్తిలో నైపుణ్యం తగ్గుతుంది. ఖర్చులు పెరుగుతాయి. చివరికి, అంతర్జాతీయ మార్కెట్‌లో భారత్ పోటీ చేయడం కష్టమవుతుంది.
ఇప్పుడు చేయాల్సింది...
చైనా ఆధారిత కొనుగోళ్లను తగ్గించే వ్యూహాలు రూపొందించాలి. జపాన్, కొరియా, మలేసియా లాంటి దేశాలతో కొత్త టెక్ ప్యాక్టులు చేసుకోవాలి. దేశీయ పరిశ్రమల్లో నైపుణ్యం పెంచేలా గవర్నెన్స్ ఫాస్ట్ ట్రాక్ అవ్వాలి. ఎగుమతులకు ప్రత్యేక గేట్‌వేలా పనిచేసే మల్టీ-నేషనల్ ప్రాసెసింగ్ జోన్‌లు ఏర్పాటు చేయాలి.
ఈసారి భారత్ చేసిన ప్రగతి చిన్నది కాదు. మనం "జస్ట్ అసెంబుల్" దేశం కాదు, "డిజైన్ - మేక్ - ఎక్స్‌పోర్ట్" దేశంగా ఎదుగుతున్నాం. కానీ చైనా వేసిన ఈ మౌనపు అడ్డంకుల మీద మనం కలవరపడకూడదు, స్పందించాలి.
More From GoodReturns

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్‌లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్‌లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం



Click it and Unblock the Notifications