మందగమనం, కరోనా మహమ్మారి కారణంగా చమురుకు డిమాండ్ తగ్గి, ధరలు పడిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ఓ సమయంలో చమురు ధరలు బ్యారెల్ 20 డాలర్లకు దిగువకు పడిపోయింది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియేట్ మైనస్‌లలోకి వెళ్లింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ఆర్థిక మందగమనం, చమురు ధరల తగ్గుదల చైనా చమురు కంపెనీలపై కూడా భారీగా ప్రభావం పడింది.
ఓ చైనా కంపెనీ డాలర్ డినామినేటెడ్ బాండ్ డిఫాల్టుగా నిలిచింది. హిలాంగ్ హోల్డింగ్స్ కంపెనీ నష్ట ప్రభావాన్ని అంచనా వేస్తోంది. అయితే ప్రపంచ దేశాలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆర్థిక వ్యవస్థపై దృష్టి సారించాయి. దీంతో షట్ డౌన్‌కు దాదాపు ముగింపు పలికి చమురుకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.

క్రూడ్, గ్యాస్ ఉత్పత్తి పెంపు
మరోవైపు, ఇంధన భద్రత పెంపు కోసం చైనా ఈ ఏడాది చమురు, సహజవాయు ఉత్పత్తిని పెంచాలని భావిస్తోంది. 2019 సంవత్సరం కంటే 2020లో ముడి చమురు ఉత్పత్తిని 1 శాతం, సహజవాయువు ఉత్పత్తిని 4.3 శాతం పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారిక లక్ష్యాలు వెల్లడిస్తున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎనర్జీ కన్స్యూమర్ చైనా. నేషనల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ (NEA) ప్రకారం 2020లో 193 మిలియన్ టన్నుల క్రూడ్ లేదా రోజుకు 3.85 మిలియన్ బ్యారెల్స్, 181 బిలియన్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ ఉత్పత్తి చేయాలని నిర్ణయించింది.

ఈ నాలుగు ప్రాంతాల్లో విస్తరణ
2019లో 191 మిలియన్ టన్నుల క్రూడాయిల్, 173.62 బిలియన్ క్యూమిక్ మీటర్ల గ్యాస్‌ను ఉత్పత్తి చేసింది. తమ తాజా లక్ష్యాన్ని అందుకోవడానికి కీలకమైన నాలుగు ఇంధన ఉత్పత్తి స్థావరాలను విస్తరించడంపై దృష్టి సారిస్తామని నేషనల్ ఎనర్జీ అడ్మినిస్ట్రేషన్ (NEA) తెలిపింది. ఇందులో నార్తర్న్ చైనాలోని బోహాయ్‌బే, సౌత్-వెస్ట్‌లోని సిచువాన్ ప్రావిన్స్‌లో, అలాగే ఎర్డోస్ బేసిన్, వెస్టర్న్ జిన్‌జియాంగ్ రీజియన్‌లోని వాటిని విస్తరిస్తుంది.

బొగ్గు వాడకం తగ్గించాలని..
సంప్రదాయక హైడ్రోకార్పన్స్ స్థానంలో దాని సామర్థ్యాన్ని మెరుగుపరిచేందుకు పునరుత్పాదక, ఇంధన ఇథెనాల్, బొగ్గు నుండి లిక్విడ్స్ సహా వివిధ కొత్త ఎనర్జీని మరింత డెవలప్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. 2020 వార్షిక ప్రణాళికలో 900 గిగావాట్ల వ్యవస్థీకృత నాన్ శిలాజ ఇంధన విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉండాలని, అలాగే ప్రాథమిక ఇంధన మిశ్రమంలో బొగ్గు వాటాను 57.5 శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2019లో బొగ్గు వాడకం 57.7 శాతానికి పడిపోయింది. అయినప్పటికీ బొగ్గు వినియోగం ఏడాది ప్రాతిపదికన 1 శాతం పెరిగింది.
More From GoodReturns

యుద్ధాన్ని వదిలి బంగారంపై కన్నేసిన చైనా.. టన్నుల కొద్ది పసిడి రహస్యంగా కొనుగోలు.. ధరల పెరుగదలపై ఆందోళన..

Oil prices: జపాన్ రహస్య ఆయిల్ నిధి! ఆరు నెలలకు సరిపడా చమురుని జపాన్ ఎలా దాచిపెట్టింది?

విశ్వ విజేతగా భారత్.. కళ్లు చెదిరే నజరానా.. ICC Men's T20 World Cup 2026 ప్రైజ్ మనీ పూర్తి వివరాలు ఇవే..

పశ్చిమాసియాలో యుద్ధం.. చమురు ధరల్లో భారీ పెరుగుదల.. ఎంతలా ఎగబాకాయంటే..

నేస్తం నేనున్నా.. భారత్‌కు అండగా నిలిచిన రష్యా.. చమురు సంక్షోభంపై కీలక ప్రకటన..

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్‌లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..



Click it and Unblock the Notifications