కరోనా మహమ్మారి నేపథ్యంలో ఆర్థికవ్యవస్థలు కుప్పకూలాయి. ప్రపంచ దేశాల్లో కేవలం చైనా, ఆ తర్వాత భారత్ మాత్రమే త్వరగా కోలుకుంటాయని ఆర్థికవేత్తల అంచనా. చైనా అయితే ప్రతికూల వృద్ధి రేటు నమోదు చేయదని తెలిపారు. అందుకు తగినట్లే ఈ క్యాలెండర్ ఇయర్ రెండో క్వార్టర్‌లో డ్రాగన్ వృద్ధి రేటు 3.2 శాతంగా నమోదయింది. కరోనా మహమ్మారి నుండి ఈ దేశం వేగంగా కోలుకుంటోందని ఈ లెక్కలు చెబుతున్నాయి. భారత్‌లోను ఆర్థికకార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

రెండో క్వార్టర్‌లో భారీగా పుంజుకొని..
ఏడాది క్రితం ఇదే క్వార్టర్‌తో పోలిస్తే ఈసారి 3.2 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు చైనా నివేదించింది. ఏప్రిల్ నుండి జూన్ మధ్య 2.5 శాతం వృద్ధి రేటు నమోదవుతుందని అంచనా వేశారు. కానీ ఊహించిన దాని కంటే ఎక్కువగా కనిపించింది. మొదటి క్వార్టర్ (జనవరి-మార్చి)లో చూసిన క్షీణత నుండి పుంజుకుందని తెలిపింది. కరోనా మహమ్మారి పుట్టింది చైనాలోని వూహాన్‌లో. దీంతో అక్కడ లాక్ డౌన్ విధించారు. ఆర్థిక వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఉద్దీపన చర్యలు ప్రారంభించారు.

చైనా లెక్కలు సరే.. కానీ అనుమానాలు
ప్రపంచ రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన చైనా మొదటి క్వార్టర్‌లో వృద్ధి రేటు 6.8 శాతం ప్రతికూలత నమోదు చేసింది. 1992 నుండి చైనాకు వరస్ట్ క్వార్టర్ జనవరి - మార్చి 2020 కావడం గమనార్హం. అయితే రెండో క్వార్టర్‌లో పుంజుకుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు శుభసూచకంగా భావిస్తున్నారు. అయితే ఇక్కడ ఓ అనుమానం ఉంది. కానీ చైనా ఏ విషయం చెప్పినా.. అందులో మిగతా ప్రపంచానికి అనుమానాలు ఉంటాయి. ఆర్థిక వ్యవస్థ మొదలు చైనా నివేదికల్లోని కచ్చితత్వం సందేహాలనే మిగుల్చుతాయి.

అదే నిజమైతే మంచి సంకేతం
కరోనా నుండి బయటపడుతున్నామని, ఈ మహమ్మారి ప్రభావాన్ని తమ ఆర్థిక వ్యవస్థ అధిగమించి కోలుకుంటోందని చైనా నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. ఖర్చులు పెంచడం, వడ్డీ రేట్లు తగ్గించడం సహా వివిధ చర్యలు తీసుకుందని పేర్కొంది. చైనా కచ్చితత్వంపై అనుమానాలు ఉన్నప్పటికీ, అదే వాస్తవమైతే మాత్రం ప్రపంచానికి మంచి సంకేతమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

భారత్‌కు కూడా సానుకూలం...
అంతేకాదు, జూన్ నెలలో డాలర్ వ్యాల్యూలో ఎగుమతులు, దిగుమతులు పెరిగాయి. మే నెలతో పోలిస్తే జూన్ నెలలో మ్యానుఫ్యాక్చరింగా కార్యకలాపాలు కూడా పెరిగాయి. ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో లాక్ డౌన్ ప్రభావం తక్కువగా ఉందని చెబుతున్నారు. రాబోయే రెండు క్వార్టర్‌లలోను ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉంటుందని భావిస్తున్నారు. రానున్న క్వార్టర్‌లలో 5 శాతానికి చేరుకోవడం ఖాయమని, పూర్తి ఏడాదికి 6.1 శాతంగా నమోదు కావొచ్చునని చెబుతున్నారు. ఆర్థికవేత్తల అంచనా మేరకు చైనా పుంజుకుంటే.. ప్రపంచ దేశాల్లో చైనా తర్వాత భారత్ ఆర్థిక వ్యవస్థ భేష్ అని గతంలోనే భావించారు. ఐఎంఎఫ్ వంటివి కూడా వెల్లడించాయి. దానికి తగినట్లు భారత్‌లో కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. చైనా పుంజుకోవడం భారత్ అంచనాలకు కూడా సానుకూల పరిణామంగా చెబుతున్నారు.
More From GoodReturns

చైనాతో రహస్యంగా జతకట్టిన ఇరాన్.. అమెరికాకు బిగ్ షాక్..హార్ముజ్ జలసంధి వేదికగా డాలర్ ఆధిపత్యానికి చెక్..

హార్ముజ్ జలసంధిని మళ్లీ మూసేసిన ఇరాన్.. ఇజ్రాయెల్ దాడులతో సంక్షోభంలోకి కాల్పుల విరమణ ఒప్పందం..

ఇరాన్ ప్రతిపాదనను చెత్త బుట్టలో పడేసిన ట్రంప్.. టెహ్రాన్ కోరికల జాబితాను ఆమోదించే ప్రసక్తే లేదన్న వైట్ హౌస్..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

LPG: ఏడేళ్ల తర్వాత భారత్‌కు ఇరాన్ ఆయిల్: ఈ వారమే రాబోతున్న భారీ షిప్మెంట్!

మెంతికూరపై హాట్ డిబేట్..భారత్ వర్సెస్ అమెరికా రేట్లతో పోల్చిన మహిళ..నెటిజన్ల రియాక్షన్ ఏంటంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..



Click it and Unblock the Notifications