అంతర్జాతీయంగా కృత్రిమ మేధస్సు (AI) దూసుకుపోతోంది. ఈ రంగం ఆ రంగం అని తేడా లేకుండా అన్ని రంగాల్లో ఆధిపత్యం దిశగా పయనిస్తోంది. ఉద్యోగులు సంవత్సరాల తరబడి చేసే పనిని AI రోజుల వ్యవధిలో చేస్తోంది. దీంతో కంపెనీలు ఐఏ మీద భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.
ఈ రంగంలో పెట్టుబడులు వెల్లువలా ప్రవహిస్తుండటంతో ఉద్యోగులకు గడ్డు కాలం మొదలయింది. ప్రపంచ వ్యాప్తంగా వేలాది కంపెనీలు లక్షలాది మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. భవిష్యత్తులో కూడా ఏఐ దెబ్బకు లక్షలాది మంది రోడ్డు మీదకు వస్తారని నివేదికలు చెబుతున్నాయి. టాప్ టెక్ కంపెనీలు కూడా ఏఐ స్కిల్స్ నేర్చుకుంటేనే భవిష్యత్ అని ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
తాజాగా ఈ రంగంలో ఏ దేశం ముందు ఉందనే ప్రశ్నకు నిపుణులు తమ అభిప్రాయాలను వెలిబుచ్చుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధస్సు (AI) రంగంలో వేగంగా మార్పులు జరుగుతున్న వేళ.. చైనా ఈ పోటీలో ముందంజలో ఉందని Christopher Wood వ్యాఖ్యానించారు.

Jefferiesలో గ్లోబల్ ఈక్విటీ స్ట్రాటజీ హెడ్‌గా ఉన్న ఆయన, మంగళవారం ఢిల్లీలో నిర్వహించిన BSE Manthan 2026 కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఓపెన్-సోర్స్ AI మోడళ్లపై చైనా ఎక్కువగా ఆధారపడటం వల్ల.. అమెరికా కంటే చైనా AI అభివృద్ధికి మరింత అనుకూలంగా మారిందని వివరించారు.
క్రిస్టోఫర్ వుడ్ ప్రకారం.. భారత్ ప్రస్తుతం ఒక ప్రత్యేకమైన రివర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రేడ్ మార్గాన్ని అనుసరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా AI రంగంలో పెద్ద టెక్ కంపెనీలు భారీ మూలధనాన్ని వెచ్చిస్తున్న కొద్దీ.. భారత మార్కెట్లు తాత్కాలికంగా ఇతర దేశాలతో పోలిస్తే బలహీనంగా ప్రదర్శించే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా AI మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెరుగుతున్న సమయంలో.. ఆ పెట్టుబడులు నిజంగా లాభాలను ఇస్తాయా లేదా అన్న ప్రశ్నలు ఈ ఏడాది అమెరికా స్టాక్ మార్కెట్లలో ఉత్పన్నమవుతాయని ఆయన అంచనా వేశారు.
అయితే భారతీయ ఐటీ సేవల కంపెనీల భవిష్యత్తుపై పూర్తిగా ప్రతికూల దృక్పథం అవసరం లేదని వుడ్ స్పష్టం చేశారు. మారుతున్న AI పరిసరాలకు ఈ కంపెనీలు ఎంత సమర్థవంతంగా అనుగుణంగా మారతాయనే అంశంపై నిపుణుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయని తెలిపారు. కొందరు విశ్లేషకులు AI కారణంగా సాంప్రదాయ ఐటీ సేవల లాభదాయకతపై ఒత్తిడి పెరుగుతుందని భావిస్తుండగా, మరికొందరు ఈ మార్పును ఒక అవకాశంగా చూస్తున్నారు.
రివర్స్ AI ట్రేడ్ అంటే ఏమిటి: ఈ విషయాన్ని వివరిస్తూ వుడ్ ఒక సరళమైన వివరణ ఇచ్చారు. సాధారణంగా ఒక దేశం ఖరీదైన AI మోడళ్లను స్వయంగా అభివృద్ధి చేయకుండా, ఇతర దేశాల్లో రూపొందించిన AI సాంకేతికతను వినియోగించి, దాని ఆధారంగా సేవలను అందించడం ద్వారా ఆదాయాన్ని పొందితే దానిని రివర్స్ AI ట్రేడ్ అంటారు.
ఈ నమూనాలో సాంకేతికత విదేశాల నుంచి దిగుమతి అవుతుంది. కానీ ఆ సాంకేతికత ఆధారంగా IT సేవలు, డేటా ప్రాసెసింగ్, సాఫ్ట్‌వేర్ మద్దతు లేదా విశ్లేషణ సేవలను ఎగుమతి చేస్తారు. సరళంగా చెప్పాలంటే AIని దిగుమతి చేసి, సేవల రూపంలో విలువను ఎగుమతి చేయడమే ఈ వ్యూహం. ఈ మార్గాన్నే భారత్ అనుసరిస్తుందని తెలిపారు.
భారత మార్కెట్ల నుంచి విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) ఎందుకు అమ్మకాలు జరుపుతున్నారన్న అంశంపైనా వుడ్ స్పష్టత ఇచ్చారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. ఇందుకు రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది 2024 చివర్లో చైనా స్టాక్ మార్కెట్ తీవ్రంగా పడిపోవడం. ఈ పతనం తర్వాత చైనా మార్కెట్లు ఆకర్షణీయంగా మారడంతో.. పలువురు విదేశీ పెట్టుబడిదారులు భారతదేశంలోని పెట్టుబడులను తగ్గించి చైనాకు నిధులను మళ్లించారు.
రెండవ కారణంగా తైవాన్, దక్షిణ కొరియా వంటి మార్కెట్లలో పెట్టుబడిదారులు అధిక బరువుతో ఉన్న పొజిషన్లను కలిగి ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ పరిస్థితిలో, తమ పోర్ట్‌ఫోలియోలను సమతుల్యం చేసుకోవడానికి వారు భారత మార్కెట్ల నుంచి డబ్బును ఉపసంహరించుకున్నారని వుడ్ తెలిపారు. ఏదేమైనా ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. China AI రంగంలో ముందుండగా, భారత్ సేవల ఆధారిత AI వ్యూహాన్ని అనుసరిస్తోందని, ఈ మార్పులు రాబోయే కాలంలో మార్కెట్ల దిశను నిర్ణయించడంలో కీలక పాత్ర పోషిస్తాయని క్రిస్టోఫర్ వుడ్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?



Click it and Unblock the Notifications