క్రిప్టో కరెన్సీని పన్ను పరిధిలోకి తీసుకు వచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ డిజిటల్ కరెన్సీ లాభాల పైన పన్ను వేసేలా ఆదాయపు పన్ను చట్టంలో మార్పులు చేయాలని భావిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్ సందర్భంగా సవరణలను ప్రతిపాదించాలని కేంద్రం భావిస్తోందని తెలుస్తోంది.
ఇప్పటికే కొంతమంది క్రిప్టోపై ద్వారా వచ్చే ఆదాయం పైన మూలధన లాభాల పన్ను చెల్లిస్తున్నారని చెబుతున్నారు. క్రిప్టోను ఒక ఆస్తిగా భావిస్తున్న వారు చాలామంది ఉన్నారు. అయితే జీఎస్టీ చట్టంలో మార్పులు చేయాల్సిన అవసరం ఉండకపోవచ్చునని అంటున్నారు.

జీఎస్టీలో ఇతర సేవలు అన్న అంశం ఉందని, వాటికి ఏ రేటు వర్తిస్తుందో అదే జీఎస్టీ రేటు క్రిప్టో ట్రాన్సాక్షన్‌కు వర్తిస్తుందని చెబుతున్నారు.క్రిప్టో ట్రేడింగ్ కోసం ట్యాక్స్ కలెక్టెట్ ఎట్ సోర్స్(TCS) నిబంధనను తీసుకు వస్తారా అని అడగగా, ఒకవేళ కొత్త చట్టం వస్తే అందులో అంతా ఉంటుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు.
కొద్దినెలలుగా క్రిప్టో కరెన్సీల్లో పెట్టుబడులపై ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారని తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రిప్టోను పూర్తిగా నిషేధించడం కంటే వాటి నియంత్రణకే ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. క్రిప్టో కరెన్సీల అంశంపై ఆర్బీఐ, వివిధ మంత్రిత్వ శాఖల సీనియర్ ఆఫీసర్లతో ప్రధాని నరేంద్ర మోడీ చర్చలు జరిపారు. ఈ నెల 29న మొదలయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో క్రిప్టోకరెన్సీలపై బిల్లును కేంద్రం పరిచయం చేసే అవకాశముంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications