Budget 2024: దశాబ్ధం తర్వాత ప్రావిడెంట్ ఫండ్‌కు కీలక మార్పులు.. ప్రతిపాదనలు రెడీ చేస్తున్న కార్మిక శాఖ
PF News: కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్ అతి త్వరలో ఈ ఆర్థిక ఏడాదికిగాను పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు సంబంధించిన పలు నిబంధనలు మారుస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ప్రావిడెంట్ ఫండ్ నుంచి NPS వరకు కీలక రూల్స్ ఛేంజ్ చేసింది. కాగా ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్‌పై తాజాగా దృష్టి పెడుతున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు చెబుతున్నాయి.
దశాబ్ధం పాటు స్తబ్ధుగా ఉన్న ప్రావిడెంట్ ఫండ్ పరిమితిని పెంచేందుకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 15 వేలుగా ఉన్న ఈ లిమిట్‌ను 25 వేలకు పెంచవచ్చని ప్రముఖ మీడియా సంస్థ నివేదించింది. ఇందుకు అనుగుణంగా కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు రెడీ చేస్తున్నట్లు పేర్కొంది.

ఈ సవరణతో సామాజిక భద్రత పథకం పరిధిని విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్రం చివరిగా 2014లో ఉద్యోగుల భవిష్య నిధి కింద విరాళాల పరిమితిని సవరించింది. 1 సెప్టెంబర్, 2015 నుంచి PF మొత్తాన్ని 6 వేల 500 నుంచి 15 వేలకి పెంచింది. కాగా ఇప్పటివరకు దాదాపు 9 సార్లు ఈ విధంగా లిమిట్‌కి మార్పులు చేసింది.
సామాజిక భద్రత కోడ్ 2020 ప్రకారం లక్షలాది మంది అసంఘటిత, గిగ్, ప్లాట్‌ఫారమ్ మరియు వ్యవసాయ కార్మికులను ప్రావిడెంట్ ఫండ్ కిందకు చేర్చాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ ప్రయత్నంలో భాగంగా రాబోయే బడ్జెట్‌లో సామాజిక భద్రతా నిధిని ఏర్పాటు చేయాలని కోరుతున్నాయి. ఈ మేరకు ఆర్థిక మంత్రి నిర్మలమ్మను గతనెలలో కలిసిన తర్వాత 10 కేంద్ర కార్మిక సంఘాలు ప్రకటన విడుదల చేశాయి.


Click it and Unblock the Notifications