Milk import: హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవాల ద్వారా దేశాన్ని వ్యవసాయం, పాల ఉత్పత్తి, ఆక్వా రంగాల్లో స్వయం సమృద్ధిగా తీర్చిదిద్దడానికి అప్పటి పాలకులు బాటలు వేశారు. వాటి ఫలితంగా ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా ఇండియా మంచి పేరు గడించింది. అయితే 12 సంవత్సరాల తర్వాత, 2024 ఎన్నికలకు ముందు.. ధరలను తగ్గించడానికి, సరఫరా పరిమితులను సరిచేయడానికి ప్రభుత్వం పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి.
గతంతో పోలిస్తే ఇప్పుడు పాల ఉత్పత్తి శాతం కొంత స్తబ్దుగా ఉందని పశుసంవర్ధక శాఖ సీనియర్ అధికారి ఒకరు అభిప్రాయపడినట్లు ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. సాధారణంగా ఉత్పత్తి సంవత్సరానికి 6 శాతం వృద్ధి చెందుతుండగా.. ఈ ఏడాది అది నిలిచిపోయినట్లు తెలిపారు. కానీ సహకార రంగానికి సంబంధించిన డేటాను పరిశీలిస్తే 2 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రైవేట్ రంగాన్ని పరిగణనలోకి తీసుకోలేదన్నారు.

వాస్తవానికి ఈ ఏడాది 8-10 శాతం డిమాండ్ పెరిగినట్లు పశుసంవర్ధక శాఖ మరియు డెయిరీ కార్యదర్శి రాజేష్ సింగ్ వెల్లడించారు. ఇది కొవిడ్ -19 వల్ల అణచివేయబడిన డిమాండ్ ఇప్పుడు పుంజుకున్నట్లు భావిస్తున్నామన్నారు. పాల సరఫరాపై పరిమితులు లేవనీ.. కొవ్వులు, నెయ్యి, వెన్న విషయంలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండవచ్చని తెలిపారు. అంతగా అవసరమైతే ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని చెప్పారు.
భారతదేశం పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునే అవకాశం గురించి కొన్ని తప్పుదోవ పట్టించే వార్తా నివేదికలు వచ్చినట్లు సింగ్ తెలిపారు. ఇవి రైతులతో పాటు ఇతర వాటాదారుల్లో ఆందోళనకు దారితీసిందన్నారు. పాల ఉత్పత్తుల దిగుమతులకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఆయన వెల్లడించారు. ఏవైనా నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే రైతుల ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు.
నెయ్యి, వెన్న వంటి పాల ఉత్పత్తులను దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయాన్నైనా పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు NCP అధినేత శరద్ పవార్ వెల్లడించారు. ఈ తరహా చర్యలు దేశీయ పాల ఉత్పత్తిదారుల ఆదాయాన్ని ప్రభావితం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా సంక్షోభం నుంచి ఇటీవలే బయటపడిన పాడి రైతులు పునరుద్ధరణ ప్రక్రియకు ఈ నిర్ణయం తీవ్ర ఆటంకం కలిగిస్తుందన్నారు.
అయితే 2024లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆహార ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం కేంద్ర ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఇచ్చిన వాగ్ధానాన్ని అమలు చేసేందుకు గాను పాడి, పశుసంపద సహా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసే దిశగా కృషి చేస్తోంది. వినియోగదారుల ధరల సూచికలో ఆహార వస్తువులకు 46 శాతం వెయిటేజీ ఉండగా.. వీటిలో పాలు మరియు పాల ఉత్పత్తులకు 6.61 శాతం ప్రాముఖ్యత ఉంది. కాబట్టి డెయిరీ విభాగంలో 1 శాతం ధరల పెరుగుదల కూడా CPIపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితుల్లో మోడీ సర్కారు ఏం చేస్తుందో వేచి చూడాలి మరి!
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications