ముంబై: ఇటీవల కాస్త ఉపశమనం కలిగించిన ఉల్లి ధరలు మళ్లీ పెరిగాయి. వివిధ రాష్ట్రాలలో కిలో రూ.80 నుంచి రూ.100 వరకు ఉంది. ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఉల్లి ధరలు రూ.80 వరకు పలికిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నరేంద్రమోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ధరలు దిగి వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ధరలు పెరుగుతున్నాయి. ఉల్లి అధికంగా పండించే మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో అకాల వర్షాలు పడి, పంటలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. దీంతో ఉల్లి మార్కెట్లకు రావడం తగ్గింది. దీంతో వ్యాపారుల వద్ద ఉన్న నిల్వలతో ధర పెరుగుతోంది.

భారీగా పెరిగిన ఉల్లి ధరలు
నిన్నటి వరకు రూ.30, రూ.40 ఉన్న ఉల్లి ధర ఒక్కసారిగా రెండు రెట్లు, మూడు రెట్లు అయింది. దీంతో ఉల్లి కొనాలంటే కంట కన్నీరు వచ్చే పరిస్థితులు. ఉత్తర ప్రదేశ్, చండీగఢ్ వంటి రాష్ట్రాల్లో డిమాండుకు సరిపడా స్టాక్ లేకపోవడంతో ఉల్లి ధర రూ.100 వరకు చేరుకుంది. భారీ వర్షాల వల్ల పంట నష్టానికి తోడు సరైన దిగుబడి లేక ఉల్లి, కూరగాయల ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు.

అకాల వర్షాల వల్ల...
మహారాష్ట్రలోని ఉల్లి పంట సాగుచేసే ప్రాంతాల్లో అకాల వర్షాలు పంటకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. దీంతో కొత్త పంట చేతికి అందటం లేదని అటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వినియోగదారులకు ధరలు ఘాటెక్కిస్తున్నాయి. ప్రభుత్వం ఉల్లి, టమాటాలపై సమీక్ష నిర్వహించింది. ధరల్ని నియంత్రణలోకి తీసుకువచ్చేలా చర్యలు తీసుకుంటామని చెబుతోంది.

ఢిల్లీలో రూ.55 నుంచి రూ.80కి
కొన్ని నగరాల్లో ఉల్లి ధరలు 40 శాతం నుంచి అంతకంటే ఎక్కువ పెరిగాయి. చాలా నగరాల్లో ఉల్లి రూ.60 నుంచి రూ.100 వరకు పలుకుతోంది. అక్టోబర్ 31వ తేదీన ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.55గా ఉండగా, మంగళవారం రూ.80గా ఉంది.

ఆల్ టైమ్ హైకి సమీపంలో ఉల్లి ధర
దేశంలోనే అతిపెద్ద ఉల్లి హోల్ సేల్ మార్కెట్ మహారాష్ట్రలోని లాసాల్‌గావ్. ఇక్కడ క్వింటాల్ ఉల్లి ధర అనూహ్యంగా రూ.650 పెరిగింది. ఉల్లి ధరలు భారీగా పెరిగిన సమయంలో 22 ఆగస్ట్ 2015న ఆల్ టైమ్ హై రూ.5700గా ఉంది. ఇప్పుడు రూ.650 పెరిగి రూ.5,551గా ఉంది. దీంతో ఆల్ టైమ్ హై సమీపానికి వచ్చింది. పరిస్థితులు ఇలాగే ఉంటే ఉల్లి క్వింటాల్ రూ.6,000 పెరిగి జీవనకాల గరిష్టానికి చేరుకుంటుందని చెబుతున్నారు.

15 రోజుల్లో 126 శాతం పెరిగిన ఉల్లి ధర
గత పదిహేను రోజులుగా హోల్ సేల్ ఉల్లి ధరలు 126 శాతం పెరిగాయి. అక్టోబర్ 18వ తేదీన క్వింటాల్‌కు రూ.2450గా ఉంది. ఇప్పుడు ఏకంగా రూ.5,551కి చేరుకుంది. నాసిక్ రిటైల్ మార్కెట్లో కిలో ఉల్లి ధర రూ.70 పలుకుతోంది. గత కొద్ది రోజుల్లోనే రిటైల్ ధరలు రూ.30కి పైగా పెరిగాయి.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications