Direct Taxes: కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న పలు ఆర్థిక సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. GST, కార్పొరేట్, ఇతర పన్నుల్లో పెరుగుదల నమోదు కావడమే దీనికి ఉదాహరణ. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆదాయపు పన్ను చెల్లించే వారి సంఖ్యను పెంచడం కోసం మోడీ సర్కారు వివిధ మార్పులు చేసింది. తద్వారా ఈ ఏడాదికి గాను పెద్ద మొత్తంలో ఆదాయపు పన్ను వసూలు కానుందని భావిస్తోంది.
2022-23కి గాను స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు (తాత్కాలికం) రూ.19.68 లక్షల కోట్లుగా నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. మొత్తం 20.33 శాతం వృద్ధి నమోదైనట్లు సోమవారం గణాంకాలను విడుదల చేసింది. పన్ను రాబడికి సంబంధించి రూ.14.20 లక్షల కోట్లను బడ్జెట్ లో అంచనా వేయగా.. వీటిని రూ.16.50 లక్షల కోట్లకు సవరించారు. తద్వారా బడ్జెట్ అంచనాలు 16.97, సవరించిన అంచనాల కంటే 0.69 శాతం పెరిగినట్లు వెల్లడించింది.

గత ఆర్థిక సంవత్సరంలో తాత్కాలిక గణాంకాల ప్రకారం.. ప్రత్యక్ష పన్నుల నికర వసూళ్లు రూ.16.61 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2021-22లో రాబట్టిన రూ.14.12 లక్షల కోట్లను దాటి వృద్ధి కనిపించింది. రెండు ఆర్థిక సంవత్సరాల మధ్య 17.63 శాతం పెరుగుదల ఏర్పడింది. 2022-23కి సంబంధించి రీఫండ్ సర్దుబాటుకు ముందు రూ.19.68 లక్షల కోట్లు జమయ్యాయి. అంటే అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే 20.33 శాతం వృద్ధి నమోదైంది.
స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 2022-23లో రూ.10.04 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏడాదిలో ఇది రూ.8.58 మాత్రమే. అంటే 16.91 శాతం ఎక్కువ రాబడి సాధించినట్లన్న మాట. ఈ విధంగా పన్నుల వసూళ్లు పెరుగుతున్న తరుణంలో వ్యక్తిగత ఆదాయపు పన్ను సైతం ఇదే స్థాయిలో రాబట్టాలని కేంద్రం సిద్ధం చేస్తున్న ప్రణాళికలు ఫలిస్తాయో, లేదో చూడాలి మరి..


Click it and Unblock the Notifications