For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.2 లక్షలకు పైగా నగదు స్వీకరణ, ట్రీట్మెంట్ నోట్‌లో సవరణ

|

కరోనా మహమ్మారి నేపథ్యంలో రోగుల చికిత్స కోసం రూ.2 లక్షల వరకు పైగా నగదు చెల్లింపులను స్వీకరించేందుకు అనుమతి ఇచ్చారు. అయితే ఇందులో ఎర్రర్‌ను సవరిస్తూ కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ సోమవారం రాత్రి ఓ కారిజెండమ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు కరోనా రోగులు లేదా వారి బంధువులు రూ.2 లక్షలకు పైన నగదు చెల్లింపులు చేసినా, హాస్పిటల్స్, డిస్పెన్సరీలు, కొవిడ్ కేర్ కేంద్రాలు స్వీకరించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ఇందుకు సంబంధించి కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల మండలి (CBDT) గతవారం నోటిఫికేషన్ విడుదల చేసింది.

అయితే సదరు రోగి లేదా చెల్లింపుదారుడి పాన్/ఆధార్ వివరాలు సేకరించడం సహా వారి మధ్య సంబంధం తెలుసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఏప్రిల్ 1 నుండి మే 31వ తేదీ మధ్య నగదు రూపంలో చెల్లింపులకు సడలింపు మంజూరు చేసినట్లు తెలిపింది.

భారీ ఊరట, రూ.2 లక్షలకు పైగా నగదును స్వీకరించవచ్చుభారీ ఊరట, రూ.2 లక్షలకు పైగా నగదును స్వీకరించవచ్చు

Centre rectifies error in treatment payment note

అయితే 'పేయీ' అంటే చెల్లింపుదారుని సూచిస్తోందని, కానీ బిల్లు చెల్లించే వ్యక్తిని కాదని, కాబట్టి 'పేయీ' (చెల్లింపుదారు) పదాన్ని సరిదిద్దాలని కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మే 7వ తేదీన జారీ చేసిన 'పేయీ'కి బదులు 'పేయర్' (చెల్లింపుదారు) అని చదవవలసి ఉంటుందని ఆర్థికమంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ పేర్కొంది.

కాగా, 2016 నవంబర్ డీమానిటైజేషన్ అనంతరం నల్లధనం ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా రూ.2 లక్షలకు పైగా నగదు చెల్లింపులపై 2017 నుండి నిషేధించారు. ఇంత మొత్తాన్ని నగదు రూపంలో పొందిన ఏ వ్యక్తికి అయినా 100 శాతం జరిమానా విధిస్తారు.

English summary

రూ.2 లక్షలకు పైగా నగదు స్వీకరణ, ట్రీట్మెంట్ నోట్‌లో సవరణ | Centre rectifies error in treatment payment note

The Finance Ministry issued a corrigendum notification late on Monday night to enable cash payments of more than ₹2 lakh for treatment of COVID-19 patients, hours after assuring the Delhi High Court that an error in its May 7 notification to permit the same shall be rectified.
Story first published: Tuesday, May 11, 2021, 10:43 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X