న్యూఢిల్లీ: నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోందా? అంటే కావొచ్చుననే వాదనలు వినిపిస్తున్నాయి. 2014లో అనూహ్య మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం దీర్ఘకాలిక ప్రయోజనాలతో ముందుకు వెళ్తోందనేది ఆర్థిక నిపుణుల వ్యాఖ్య. ఇందులో భాగంగా 2016 నవంబర్ 8న రాత్రి సమయంలో ప్రధాని మోడీ రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ ప్రకటన చేశారు. ఈ నోట్ల రద్దుతో సామాన్యులు ఎంతో ఇబ్బందులు పడ్డారు. కానీ భావి భారత నిర్మాణానికి ఇలాంటి సంచలన నిర్ణయాలు అవసరమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఆ తర్వాత జీఎస్టీని అమలులోకి తీసుకు వచ్చారు.

బంగారంపై కీలక నిర్ణయం
మోడీ ప్రభుత్వం భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పని చేస్తోందనే ఆర్థికవేత్తల అభిప్రాయం. దీంతో ప్రజలు తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం 2014 కంటే ఎక్కువ సీట్లు గెలిచి ప్రజా మద్దతు ఉందని నిరూపించుకుంది. ఈ నేపథ్యంలో మోడీ ప్రభుత్వం మరెన్నో సంచలన నిర్ణయాలతో ముందుకు సాగుతారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా ప్రస్తుతం బంగారంపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంటుందని వార్తలు వస్తున్నాయి.

నిర్ణీత ప్రమాణానికి మించి బంగారం ఉంటే జరిమానా
ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం బంగారానికి సంబంధించి కేంద్రం ఓ ఆమ్నెస్టీ పథకాన్ని తీసుకు రానుందట. ప్రతిపాదిత పథకం కింద నిర్ణీత ప్రమాణానికి మించి ఉన్న బంగారంపై జరిమానా ఉంటుంది. ఈ పథకానికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉందని చెబుతున్నారు. అయితే ఇది ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో మాత్రమే ఉందని తెలుస్తోంది. బంగారం పరిమితుల్లో మార్పు చేయడానికి ముందు కొత్త క్షమాభిక్ష పథకాన్ని తీసుకు వస్తుంది. దీని ప్రకారం లెక్కల్లో చూపించని బంగారాన్ని చూపించి పన్ను చెల్లించవచ్చు. ఆ తర్వాత పరిమితిని మించితే జరిమానా విధించే అవకాశముంది.

లెక్కలేని బంగారం వివరాలు ఇవ్వాలి
లెక్కలేని లేదా రసీదులేని బంగారం ఉంటే వివరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వవలసి ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయించిన రేటు ఆధారంగా దానిపై పన్ను విధిస్తారు. అంటే ప్రభుత్వ స్థిర ప్రమాణానికి మించి బంగారం ఉంటే జరిమానా లేదా పన్ను విధిస్తారు. ఇండివిడ్యువల్స్, ఫ్యామిలీస్‌కు ఇది వర్తిస్తుంది.

బ్లాక్ మనీ నిరోదానికి...
మోడీ ప్రభుత్వం ఏ సంచలన నిర్ణయం తీసుకున్నా భారత దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతానికి పరిమితికి మించిన బంగారం ఉంటే పన్ను కేవలం పరిశీలనలో ఉందని తెలుస్తోంది. ఒకవేళ దీనిని అమలు చేసినా దానికి కారణం ఉందని చెబుతున్నారు. బంగారంలో నల్లధనం పెట్టుబడిని నిరోధించేందుకు దీనిని తీసుకు వస్తున్నారని చెబుతున్నారు.
More From GoodReturns

బంగారం, వెండి ధరల పెరుగుదలపై కీలక అప్డేట్.. కొత్త లక్ష్యాలను విడుదల చేసిన ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పతనంపై బిగ్ అలర్ట్.. ఈ రాత్రి గడిస్తే చాలురా దేవుడా అంటున్న ఇన్వెస్టర్లు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరుగుదలపై షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నెలలో ఈ రేటును దాటడం ఖాయం అంటున్న నిపుణులు..

బంగారం ధర ఈ వారం ఎంత పెరిగిందో తెలుసా.. రూపాయి పైనే పెట్టుబడిదారుల ఆశలు.. ఎందుకంటే..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

బంగారం ధరల తగ్గుదలపై యూబీఎస్ సంచలన నివేదిక.. సామాన్యులకు పండగలాంటి వార్తే ఇది.. ఇన్వెస్టర్లకు మాత్రం..

Today Gold Silver Rate Live: తగ్గిన బంగారం, వెండి ధరలు.. తీవ్రమవుతున్న ఇరాన్ యుద్ధం

Today Gold Silver Rate Live: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!



Click it and Unblock the Notifications