దేశంలో అనూహ్యంగా ఇంధన కొరత: పెట్రోల్ బంకుల్లో సమయపాలన: కొత్త వ్యవస్థ

న్యూఢిల్లీ: దేశంలో అనూహ్యంగా ఇంధన కొరత ఏర్పడింది. పలు రాష్ట్రాల్లో పెట్రోల్ సంక్షోభం నెలకొంది. ప్రత్యేకించి గ్రామాల్లో దీని తీవ్రత అధికంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొత్తగా యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్‌ వ్యవస్థను తెరమీదికి తీసుకొచ్చింది. ఇంధన కొరత అధికంగా ఉన్న రాష్ట్రాల్లో దీన్ని అమలు చేస్తోంది.

గుజరాత్, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌, తమిళనాడుల్లో ఇంధన సంక్షోభం నెలకొంది. వాహనదారులు పెట్రోల్, డీజిల్ కోసం పెట్రోల్ బంకుల ముందు బారులు తీరాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇది మరింత ముదరిపోకముందే పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వ శాఖ తక్షణ చర్యలకు దిగింది.

యూనివర్సల్ సర్వీస్ ఆబ్లిగేషన్‌ను తెరమీదికి తీసుకొచ్చింది. ఈ వ్యవస్థ కింద పెట్రోల్ బంకుల్లో సమయపాలనను పాటించాల్సి ఉంటుంది. జాతీయ రహదారులు, నగరాల్లో ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు మినహా మిగిలినవి నిర్దేశిత సమయం వరకు మాత్రమే కార్యకలాపాలను నిర్వహించాల్సి ఉంటుంది. పెట్రోలియం మంత్రిత్వ శాఖ జారీ చేసిన సమయానికి తెరవడం.. మూసివేసేలా ఉత్తర్వులు ఇచ్చింది.

Centre expanded the universal services obligation to all retail fuel outlets including remote areas

పెట్రోల్‌, డీజిల్ నిల్వ‌లు పూర్తిస్థాయిలో అడుగంటకుండా.. మినిమం ఇన్వెంటరీ లెవెల్స్‌ను కొనసాగించాలని సూచించింది. మూడు రోజులుగా ఇంధ‌న స‌ర‌ఫ‌రాల్లో పెట్రోల్ బంకులకు 50 శాత‌మే త‌మ‌కు అందుతోంది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల నుంచి అందిన ఆదేశాల మేరకే పెట్రోల్ సరఫరాను నియంత్రించాల్సి వచ్చినట్లు పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ల ప్రతినిధులు స్పష్టం చేస్తోన్నారు.

దేశ రాజధానిలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ.96.72 పైసలు, డీజిల్ రూ.89.62 పైసలు పలుకుతోంది. ముంబైలో పెట్రోల్ లీటర్ ఒక్కింటికి రూ111.35 పైసలు, డీజిల్ రూ.97.28 పైసలుగా నమోదైంది. కోల్‌కతలో పెట్రోల్ రూ.106.03 పైసలు, డీజిల్ రూ.92.76 పైసలుగా ఉంటోంది. చెన్నైలో పెట్రోల్ రేటు రూ.102.63 పైసలు, డీజిల్ 94.24 పైసలు.

బెంగళూరులో పెట్రోల్ రూ.101.94 పైసలు, డీజిల్ రూ.87.89 పైసలుగా ఉంటోంది. లక్నోలో పెట్రోల్ రూ.96.57 పైసలు, డీజిల్ 89.76 పైసలు, విశాఖపట్నంలో పెట్రోల్ రూ.110.48 పైసలు, డీజిల్ 98.38 పైసలుగా నమోదైంది. అహ్మదాబాద్‌లో పెట్రోల్ రూ.96.63 పైసలు, డీజిల్ 92,38 పైసలు, హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.109.66 పైసలు, డీజిల్ రూ.97.82 పైసలు, పాట్నాలో పెట్రోల్ 107.24 పైసలు, డీజిల్ రూ.94.04 పైసలు పలుకుతోంది. తిరువనంతపురంలో పెట్రోల్ 107.87 పైసలు, డీజిల్ రూ.96.67 పైసలుగా నమోదైంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+