Gold: భారీగా బంగారం కొనుగోలు చేస్తున్న సెంట్రల్ బ్యాంకులు.. చైనా 20 టన్నులు, పోలాండ్ 8 టన్నుల పసిడి కొనుగోలు..
వివిధ దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి. చైనా, పోలాండ్ కేంద్ర బ్యాంకులు మరోసారి భారీగా బంగారాన్ని కొనుగోలు చేశాయని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది.
జూలైలో కేంద్ర బ్యాంకులు దాదాపు 35 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపింది. అభివృద్ధి చెందుతున్న మార్కెట్లు కూడా బంగారం సేకరణను కొనసాగించాయి వివరించింది. ఇందులో చైనా 20 టన్నులు కొనుగోలు చేయగా పోలాండ్ 8 టన్నులు పసిడిని కొనుగోలు చేశాయి. చెక్ నేషనల్ బ్యాంక్ రెండు టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. అలాగే కజకిస్తాన్ నేషనల్ బ్యాంక్ (NBK) బ్యాంక్ నెగారా మలేషియా (BNM), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ బొలీవియా (CBB) ఒక్కో టన్ను చొప్పున కొనుగోలు చేశాయి.
జూలైలో రష్యా అత్యధికంగా నికర అమ్మకాలు జరిపిన దేశంగా నిలిచింది. రష్యా 6 టన్నుల బంగారాన్ని అమ్మింది. ఆ తర్వాత టర్కీ, జోర్డాన్, ఉజ్బెకిస్తాన్ ఒక్కో టన్ను చొప్పున అమ్మకాలు జరిపాయి.
ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన బంగారం కొనుగోళ్లలో పోలాండ్ మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటివరకు 90 టన్నులను కొనుగోలు చేసింది. "ఆ దేశం 700 టన్నుల పసిడిని నిల్వ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 640 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. ఇదే సమయంలో చైనా 2026లో తన బంగారు నిల్వలకు 60 టన్నులను సేకరించింది. జూలైలో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా వరుసగా 21వ నెల పసిడిని కొనుగోలు చేసింది.

చైనా అధికారిక బంగారు నిల్వలు దాదాపు 2,366 టన్నులుగా ఉన్నాయి. ఉజ్బెకిస్తాన్ సెంట్రల్ బ్యాంక్ ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన బంగారం కొనుగోళ్లు 40 టన్నులకు చేరాయి. కజకిస్తాన్ నేషనల్ బ్యాంక్ (NBK) ఈ ఏడాది ఇప్పటివరకు 29 టన్నుల బంగారాన్ని సేకరించింది. అత్యధికంగా బంగారం సేకరిస్తున్న మొదటి ఐదు సంస్థలలో ఇది ఒకటిగా ఉంది. ఈ ఏడాది ఇప్పటివరకు సెంట్రల్ బ్యాంకులు దాదాపు 130 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. గత ఏడాది వివిధ సెంట్రల్ బ్యాంకులు 160 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. విక్రయాల విషయానికొస్తే రష్యా ఈ ఏడాది ఇప్పటివరకు 50 టన్నుల బంగారాన్ని విక్రయించింది. దీనివల్ల దాని మొత్తం బంగారం నిల్వలు 2,277 టన్నులకు తగ్గాయి.
అలాగే టర్కీ విక్రయాలు ఈ ఏడాది ఇప్పటివరకు 85 టన్నులుగా నమోదు అయ్యాయి. బల్గేరియన్ నేషనల్ బ్యాంక్ యూరోను స్వీకరించే ప్రక్రియలో భాగంగా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్‌కు బదిలీ చేసిన 2 టన్నుల బంగారం వివరాలు ఈ చార్ట్‌లో చేర్చలేదని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ పేర్కొంది. బ్యాంక్ ఆఫ్ కొరియా (BOK) 13 ఏళ్ల తర్వాత బంగారం కొనుగోలు చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. బంగారం ఆధారిత ఈటీఎఫ్ (ETF)ల ద్వారా 2 టన్నులుగా బంగారంపై పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications
