ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ పైన కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(CCI) దర్యాఫ్తుకు ఆదేశించింది. గూగుల్ నిర్వహణలోని గూగుల్ పే, గూగుల్ ప్లే పేమెంట్ అనుచిత, వివక్షాపూరిత వ్యాపార విధానాలు అనుసరిస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తడంతో సీసీఐ ఈ దర్యాఫ్తుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో వచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో సీసీఐ దర్యాఫ్తునుకు ఆదేశాలు జారీ చేసింది.

లోతుగా విచారణ..
గూగుల్ చెల్లింపు విధానాలపై CCI దృష్టి సారించింది. గూగుల్ పే, గూగుల్ ప్లే స్టోర్ చెల్లింపు విధానాల్లో కంపెనీ అనుచిత వ్యాపార విధానాలు అమలు చేస్తోందన్న ఆరోపణలపై లోతుగా విచారణ జరపాలని డైరెక్టర్ జనరల్‌కు ఆదేశాలు జారీ చేసింది. గూగుల్‌కు చెందిన 'పే' అనేది డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ కాగా 'ప్లే' అనేది ఆండ్రాయిడ్ సాధనాలు, ఉత్పత్తులకు సంబంధించి యాప్ స్టోర్. పోటీ సంస్థలను దెబ్బతీసే విధంగా గూగుల్ విధానాలు ఉంటున్నట్లు సీసీఐ పేర్కొంది.

ఈ నిబంధనతో ఇక్కట్లు
ప్లేస్టోర్‌లోని పెయిడ్ యాప్స్, ఇన్-యాప్ కొనుగోళ్లకు తప్పనిసరిగా గూగుల్ ప్లే చెల్లింపు విధానాన్ని ఉపయోగించాలని గూగుల్ నిబంధన విధించడం వల్ల డెవలపర్లకు ప్రత్యామ్నాయం ఎంచుకునే అవకాశం లేకుండా పోతోందని, భారీగా ఫీజులు వసూలు చేయడం వల్ల డెవలపర్లపై ప్రభావం పడుతోందని సీసీఐ అభిప్రాయపడింది. అల్పాబెట్, గూగుల్ ఎల్ఎల్‌సీ, గూగుల్ ఐర్లాండ్, గూగుల్ ఇండియా, గూగుల్ ఇండియా డిజిటల్ సర్వీసెస్ పైన విచారణ జరపాలని ఆదేశించింది. కమిషన్, అప్లికేషన్ తప్పనిసరి వినియోగం వంటి ఫిర్యాదులు ఉన్నాయి.

గూగుల్ విశ్వాసం
కాగా, అనామిక ఫిర్యాదుదారులుదారులు చేసిన పలు వాదనలను కమిషన్ తిరస్కరించిందని గూగుల్ తెలిపింది. అన్నింటి కంటే ముందు గూగుల్ పే పోటీ వాతావరణంలో పని చేస్తుందని సీసీఐ గుర్తిస్తుందని తాము విశ్వసిస్తున్నామని తెలిపింది. కస్టమర్లకు సరళమైన, సురక్షితమైన చెల్లింపుల అనుభవాన్ని అందిస్తుంటామని పేర్కొంది.


Click it and Unblock the Notifications