న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లక్షలాది మంది పన్ను చెల్లింపుదారులకు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ గుడ్‌న్యూస్ ఇచ్చింది. 23.99 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు సంబంధించిన సమాచారాన్ని విడుదల చేసింది. పన్ను చెల్లింపుదారులకు బిగ్ రిలీఫ్ కలిగించే ప్రకటనను వెలువడించింది. ట్యాక్స్ పేయర్లకు అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించినట్లు ఆదాయపు పన్నుల శాఖ తెలిపింది. ఈ మేరకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఓ ట్వీట్ చేసింది.

23.99 లక్షల మందికి..
సీబీడీటీ చేసిన ఈ ప్రకటన వల్ల 23.99 లక్షల మందికి పైగా పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ ఏడాది ఆర్థిక సంవత్సరం ఆరంభమైనప్పటి నుంచి అంటే.. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు సంబంధించి ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడంలో జాప్యం చేసిన పన్ను చెల్లింపుదారుల నుంచి కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కొరడా ఝుళిపించిన విషయం తెలిసిందే. 2020-2021 ఆర్థిక సంవత్సరంలో తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయని వారిపై ఈ రకంగా పెనాల్టీ విధించింది.

67 వేల కోట్లు..
ఆలస్యపు రుసుము, అదనపు వడ్డీ, ఇతర పెనాల్టీల రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని మళ్లీ ట్యాక్స్‌పేయర్లకు చెల్లించినట్లు తెలిపింది. కొత్త ఇన్‌కమ్ ట్యాక్స్ పోర్టల్‌లో చోటు చేసుకున్న సాంకేతిక లోపం, తప్పిదాలే దీనికి కారణమని ఆ తరువాత గుర్తించారు ఆదాయపు పన్ను శాఖ అధికారులు. సాంకేతిక లోపం వల్ల ఈ పరిణామం తలెత్తిన నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల జాప్యం లేదని గుర్తించింది. ఈ క్రమంలో ట్యాక్స్ పేయర్ల నుంచి వసూలు చేసిన అదనపు వడ్డీ, ఆలస్య రుసుమును తిరిగి చెల్లించినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ లో భాగమైన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తెలిపింది.

కార్పొరేట్ ట్యాక్స్ వాటా అధికం..
అదనపు వడ్డీ, ఆలస్య రుసుముల రూపంలో ఇన్‌కమ్ ట్యాక్స్ శాఖ అధికారులు ఈ అయిదు నెలల కాలంలోనే రాబట్టిన మొత్తం విలువ 67,401 కోట్ల రూపాయలు. ఇందులో కార్పొరేట్ ట్యాక్సుల వాటా అధికం. కార్పొరేట్ ట్యాక్సుల రూపంలో 51,029 కోట్ల రూపాయల మొత్తాన్ని అధిక వడ్డీ, ఆలస్య రుసుముగా వసూలు చేసింది. 1,37,327 కార్పొరేట్ కేసులు ఉన్నాయి. మిగిలిన 16,373 కోట్ల రూపాయల మొత్తాన్ని ఇండివిడ్యువల్స్ నుంచి వసూలు చేసింది. ఇలాంటి 22,61,918 మంది ఉన్నారు. మొత్తం 23.99 లక్షల మంది పన్ను చెల్లింపుదారుల నుంచి ఈ మొత్తాన్ని వసూలు చేసింది.
గడువు కూడా పొడిగింపు..
అలాగే- పన్ను చెల్లింపుదారులు తమ ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్నులను దాఖలు చేయడానికి లేటెస్ట్ వెర్షన్ ప్రిపరేషన్ సాఫ్ట్‌వేర్ వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసింది. పొరపాటు తమవైపే ఉండటం వల్ల ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి ఉద్దేశించిన గడువును కూడా పొడిగింది. ఇక ట్యాక్స్ పేయర్లు ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు కూడా తమ ఐటీ రిటర్నులను దాఖలు చేయడానికి వెసలుబాటును కల్పించింది. ఇదివరకు ఈ గడువు జూలై 31వ తేదీ వరకే ఉండేది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications