IT Returns: సాధారణంగా ఏప్రిల్ నెల నుంచి పన్ను చెల్లింపుదారులతో పాటు ఆయా సంస్థలు చాలా బిజీగా మారిపోతుంటాయి. గడువులోగా ఆదాయపు పన్ను రిటర్నులను ఫైల్ చేసేందుకు శ్రమిస్తుంటాయి. కంపెనీలతో పాటు ఛారిటబుల్ ట్రస్టులు, మతపరమైన సంస్థలు కూడా ఇందుకు మినహాయింపు కాదు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(CBDT) పన్ను చెల్లింపుదారులకు ఊరట కలిగించే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆధ్యాత్మిక సంస్థలతో పాటు ఛారిటబుల్ ట్రస్టులకు సంబంధించి ఫారం 10A/10AB దాఖలు చేసేందుకు మరో 2 నెలలు గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం Xలో పోస్ట్ చేసింది.

ఇప్పటికే పలు దఫాలుగా 10A/10AB ఫారం సబ్మిషన్ కోసం CBDT గడువును పొడిగిస్తూ వచ్చింది. గతసారి సెప్టెంబర్ 30, 2023 వరకు అవకాశం ఇవ్వగా, ఇప్పుడు జూన్ 30, 2024 లోగా ఈ పని పూర్తి చేసేందుకు మరో ఛాన్స్ ఇచ్చింది. పన్ను చెల్లింపుదారులకు ఎదురవుతున్న సమస్యలు సహా పలువురి అభ్యర్థనలను పరిగణలోనికి తీసుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డ్ తెలిపింది.
ఆయా సంస్థలు, ట్రస్టులు ఆదాయపు పన్ను మినహాయింపు కోసం రిజిస్టర్ చేసుకునేందుకు ఈ 10A ఫారమ్స్ ఫైల్ చేస్తుంటాయి. ఇక శాశ్వత రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం 10ABని వినియోగిస్తాయి. AY 2022-23కి గాను 10A సమర్పించని సంస్థలకు ఇది మంచి అవకాశమని CBDT చెబుతోంది. తిరస్కరించబడిన రీ-రిజిస్ట్రేషన్స్ దాఖలు చేసేందుకూ దీన్ని వినియోగించుకోవాలని కోరింది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications