ప్రతిరోజూ లక్షల మంది రైల్లో ప్రయాణిస్తూ ఉంటారు. వారిలో చాలామంది భారీ లగేజ్‌తో వస్తుంటారు. రైల్లో ఎక్కేటప్పుడు, సీటు కింద, సీటు మీద ప్రతి మూలలో బ్యాగులను నింపేస్తూ ఉంటారు. జనరల్ కంపార్ట్మెంట్లలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. రైల్వేలు ఎప్పటినుంచో ఓవర్ క్రౌడింగ్, రిసోర్సుల దుర్వినియోగం, లగేజ్ ఓవర్లోడింగ్ వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పుడు వాటిపై కఠినంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి.

ఎయిర్‌పోర్ట్‌లో లాగే, రైల్వేలకూ ఇప్పటికే లగేజ్ పరిమితులు ఉన్నాయి. ఇవి ప్రయాణించే క్లాస్ ఆధారంగా నిర్ణయించబడ్డాయి. లగేజ్ లిమిట్ మించితే, ఫైన్ కూడా ఉంటుంది. ఇది కొత్త నిబంధన కాదు, ఇంతకుముందు దీన్ని సరిగ్గా అమలు చేయలేకపోయింది.
రైల్వే మంత్రిత్వశాఖ సీనియర్ అధికారి దిలీప్ కుమార్ ప్రకారం, ఇకపై స్టేషన్లలో ఎలక్ట్రానిక్ వెయిట్ మెషిన్స్ ద్వార లగేజ్‌ను తూకం వేస్తారు. అనుమతించిన బరువు మించితే, జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
ప్రతి క్లాస్‌కి వేరువేరు పరిమితులు ఉన్నాయి:
AC ఫస్ట్ క్లాస్: 70 కిలోల వరకు తీసుకెళ్లొచ్చు. అదనంగా 15 కిలోల సడలింపు. ఇంకా ఎక్కువ కావాలంటే 65 కిలోల పార్సిల్ వాన్ బుక్ చేసుకోవాలి.
AC సెకండ్ క్లాస్: 50 కిలోల వరకు అనుమతి. 10 కిలోల అదనపు సడలింపు. మించితే 30 కిలోల పార్సిల్ వాన్ బుక్ చేసుకోవాలి.
AC థర్డ్ క్లాస్ / చైర్ కార్: 40 కిలోల వరకు లగేజ్ అనుమతి. 10 కిలోల సడలింపు. మించితే 30 కిలోల పార్సిల్ వాన్ బుక్ చేయాలి.
స్లీపర్ క్లాస్: 40 కిలోల వరకు లగేజ్ తీసుకెళ్లొచ్చు. 10 కిలోల అదనపు సడలింపు. మించితే 70 కిలోల పార్సిల్ వాన్ బుక్ చేసుకోవాలి.
జనరల్ క్లాస్: 35 కిలోల వరకు లగేజ్ తీసుకెళ్లవచ్చు. 10 కిలోల అదనంగా. ఇంకా ఎక్కువ అయితే 60 కిలోల పార్సిల్ వాన్ బుక్ చేయాలి.
రైలులో ప్రయాణం చేస్తే, కేవలం లగేజ్ బరువు మాత్రమే కాదు, బ్యాగుల సైజ్‌కి కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. సాధారణంగా ట్రంక్, సూట్‌కేస్ లేదా ఇతర బ్యాగుల పరిమాణం 100 సెం.మీ పొడవు, 60 సెం.మీ వెడల్పు, 25 సెం.మీ ఎత్తు మించకూడదు. అంటే చాలా పెద్ద బ్యాగ్ అయితే రైల్లో అనుమతించరు. కానీ మీరు AC 3-టియర్ లేదా చైర్ కార్లో వెళ్తే మరింత కఠినమైన నిబంధన ఉంటుంది. అక్కడ లగేజ్ సైజ్ 55 సెం.మీ x 45 సెం.మీ x 22.5 సెం.మీ లోపల ఉండాలి. బ్యాగులు ఈ పరిమాణాన్ని మించితే, వాటిని రైలు బ్రేక్ వాన్ లో బుక్ చేయాలి. దీని కోసం కనీస ఛార్జీ రూ.30 నుంచి మొదలవుతుంది.
మరొక ముఖ్యమైన విషయం బ్యాగులు ఎక్కే లేదా దిగే ప్రదేశంలో మార్గాన్ని అడ్డుకుంటే, రైల్వే ఫైన్ విధిస్తుంది. పిల్లల విషయంలో కొంచెం సడలింపు ఉంది. 5 నుంచి 12 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలకు సాధారణ లగేజ్ పరిమితిలో 50% వరకు ఉచితంగా అనుమతిస్తారు.
పరిమితులు మించితే ఏమవుతుంది?
లగేజ్ వెయిట్, సైజ్ లిమిట్ మించితే, సాధారణ ఛార్జీకి 1.5 రెట్లు జరిమానా విధిస్తారు. కనీస జరిమానా రూ.30. కనీస బరువు 10 కిలోలు, కనీస దూరం 50 కిలోమీటర్లు. స్కూటర్, బైక్ లేదా భారీ వస్తువులు వేరుగా బుక్ చేయాలి. ఇవి ఫ్రీ లగేజ్ అలవెన్స్‌లో లెక్కలోకి రావు. ప్రయాణం చేసే ముందు రైల్వే లగేజ్ రూల్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే అనవసరమైన జరిమానాలు, ఇబ్బందులు తప్పించుకోవచ్చు.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications