కరోనా నుండి ఐటీ రంగం వేగంగా పుంజుకుంటోంది. ముఖ్యంగా భారత ఐటీ రంగం మరింత దూసుకెళ్తోంది. కరోనా మొదలు ఐటీ రంగంలో డిజిటల్ సొల్యూషన్స్‌కు ప్రాధాన్యత ఏర్పడి, డిమాండ్ పెరిగింది. ఫ్రాన్స్ ఐటీ దిగ్గజం క్యాప్‌జెమిని ఈ ఏడాది భారత్‌లో దాదాపు 60వేల మంది ఉద్యోగులను నియమించుకోనున్నది. ఇది గత ఏడాదితో పోలిస్తే చాలా ఎక్కువ. డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్‌కు డిమాండ్ అంతకంతకూ పెరుగుతున్నదని క్యాప్ జెమిని సీఈవో అశ్విన్ యాద్రి అన్నారు.
డిజిటల్ ఆధారిత సొల్యూషన్స్ పైన పట్టు ఉన్న నిపుణులు ఇప్పుడు చాలా అవసరమని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 3,25,000 మంది ఉద్యోగులు క్యాప్‌జెమినిలో సేవలు అందిస్తున్నారు. ఇందులో సగం మంది భారత్‌లో ఉన్నారు. కొత్తవారిని, ప్రతిభావంతులను నియమించుకోవడానికి ప్రాధాన్యతనిస్తామని చెబుతోంది.

క్యాప్ జెమిని భారత్‌లో గత ఏడాది 5జీల్యాబ్ను ప్రారంభించింది. ఎరిక్సన్తో కలిసి దీనిని ప్రారంభించింది. గత ఏడాది ఈ రెండు సంస్థల భాగస్వామ్యంతో భారత్‌లో 5జీ ల్యాబ్‌ను ప్రారంభించారు. భారత్‌తో పాటు కొన్ని దేశాల్లోని క్లయింట్స్‌కు 5జీ రంగ సేవలు అందించేందుకు సిద్ధమవుతోంది. క్వాంటమ్, 5జీ, మెటావర్స్ టెక్నాలజీల్లో సేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications