Reliance Communication: అనిల్ అంబానీకి అటుతిరిగి ఇటుతిరిగి మళ్లీ పాత సమస్యలు కొత్త కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఏదోలే రుణాలను సెటిల్ చేసుకుంటూ నిధానంగా వ్యాపారం దారినపడుతోందిలే అనుకునే సమయానికి ఏదో ఒక కంపెనీకి చెందిన చట్టపరమైన చిక్కులు వెనక్కి లాగుతున్నాయి. ఈ క్రమంలోనే మరో రుణదాత నుంచి షాక్ తగిలింది.
అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ రుణ ఖాతాను "మోసం"గా ప్రకటించాలని కెనరా బ్యాంక్ నోటీసు జారీ చేసింది. అంబానీ కంపెనీ తీసుకున్న రుణాలను భారీగా దుర్వినియోగం చేసిందని బ్యాంక్ అందులో పేర్కొంది. అనిల్ అంబానీ ఆర్ కామ్ కంపెనీకి క్రెడిట్ సౌకర్యాలుగా మంజూరు చేయబడిన రూ.1,050 కోట్ల రుణాలను ఉపయోగించడంలో సమస్యలను తాజా నోటీసులో బ్యాంక్ ప్రస్థావించింది. టర్మ్ లోన్‌లు, గ్యారెంటీలు, క్రెడిట్ లెటర్‌లను కలిగి ఉన్న రుణాలను RCOM తిరిగి చెల్లించడంలో డిఫాల్ట్ అయి, మంజూరు నిబంధనలను ఉల్లంఘించిన తర్వాత మార్చి 9, 2017న నిరర్థక ఆస్తులుగా వర్గీకరించబడ్డాయి.

ఈ డిఫాల్ట్ తర్వాత టెలికాం పరికరాల సరఫరాదారు ఎరిక్సన్ ఆర్‌కామ్‌పై దివాలా చర్యలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీని తర్వాత అక్టోబరు 15, 2020న పూర్తైన BDO ఇండియా లిమిటెడ్ ఫోరెన్సిక్ ఆడిట్ రిపోర్టులో అసలు అంబానీ కంపెనీ నిధులను ఎలా వినియోగించారనే విషయంలో వ్యత్యాసాలు బయటకు వచ్చాయి. ఆడిట్ రిపోర్ట్ ప్రకారం.. RCOM, దాని అనుబంధ సంస్థలు-రిలయన్స్ టెలికాం లిమిటెడ్, రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్ లిమిటెడ్-వివిధ బ్యాంకుల నుంచి ఏకంగా రూ.31,580 కోట్ల రుణాలు పొందాయని వెల్లడైంది. ఈ మొత్తంలో రూ.13,667.73 కోట్లను అంబానీ సంస్థ ఇతర బ్యాంకులకు రుణాలు, ఆర్థిక బాధ్యతలను చెల్లించడానికి ఉపయోగించినట్లు గుర్తించబడింది. అలాగే మరో రూ.12,692.31 కోట్లు అనుసంధానిత పార్టీలకు బదిలీ చేయబడ్డాయని గుర్తించబడింది.
కంపెనీ రుణ నిబంధనలకు విరుద్ధంగా రుణంగా పొందిన డబ్బును ఇతర లోన్ చెల్లింపులకు ఉపయోగించిందని తేలింది. ఈ లావాదేవీలు నిధుల స్పష్టమైన మళ్లింపును సూచించాయి. RITL ద్వారా పొందిన రుణ నిధులు రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ద్వారా మళ్లించబడి, ఆపై RCOMకు బదిలీ చేయబడిందని వెల్లడైంది. మూలధన వ్యయాల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా మంజూరు చేసిన రుణాల దుర్వినియోగాన్ని కూడా ఆడిట్ ప్రస్తావించింది. దుర్వినియోగం ఇన్‌వాయిస్ ఫైనాన్సింగ్‌కు కూడా విస్తరించిందని ఆడిట్ ఫైండింగ్స్ ప్రకారం వెల్లడైంది.

ఇప్పటికే దివాలా విచారణలో ఉన్న రిలయన్స్ కమ్యూనికేషన్స్ తాజాగా కెనరా బ్యాంక్ ఇచ్చిన నోటీసుపై అధికారికంగా స్పందించలేదని తెలుస్తోంది. దీనికి ముందు రిలయన్స్ పవర్ ఇటీవల బిడ్ కోసం నకిలీ బ్యాంక్ గ్యారెంటీని అందించినందుకు సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ నుండి షోకాజ్ నోటీసు వచ్చిన సంగతి తెలిసిందే. "నకిలీ ఎండార్స్‌మెంట్" అందించినందున భవిష్యత్తులో టెండర్‌లలో బిడ్‌లను సమర్పించకుండా SECI అంబానీ సంస్థను నిషేధిస్తూ నోటీసులు సైతం పంపించింది. దీనికి ముందు డిసెంబర్ 2020లో రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థల రుణ ఖాతాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ Fraudగా ప్రకటించాయి. ప్రస్తుతం కెనరా బ్యాంక్ సైతం అదే పని చేసింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications