2025-2026 సంవత్సరాల్లో లక్షల సంఖ్యలో వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్న నేపథ్యంలో.. కెనడా ఒక తీవ్రమైన వలస సంక్షోభం వైపు దూసుకుపోతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామం వల్ల చట్టబద్ధ హోదా కోల్పోయే ప్రమాదంలో ఉన్నవారిలో భారతీయుల సంఖ్య అత్యధికంగా ఉండే అవకాశం ఉందని ఇమ్మిగ్రేషన్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజెన్‌షిప్ కెనడా (IRCC) అధికారిక డేటాను బేస్ చేసుకుని ఈ హెచ్చరికలు వెలువడ్డాయి.
మిస్సిస్సాగా కేంద్రంగా పనిచేస్తున్న ఇమ్మిగ్రేషన్ కన్సల్టెంట్ కన్వర్ సెయిరా ప్రకారం.. కేవలం 2025 చివరి నాటికి సుమారు 10.53 లక్షల వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్నాయి. అదే విధంగా 2026 సంవత్సరంలో మరో 9.27 లక్షల వర్క్ పర్మిట్‌లు ముగియబోతున్నాయి. అంటే రెండేళ్ల వ్యవధిలోనే దాదాపు రెండు మిలియన్ల మంది తాత్కాలిక నివాసితులు తమ చట్టబద్ధ హోదాను కోల్పోయే ప్రమాదంలో పడే అవకాశం ఉందన్న మాట.

వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత..సంబంధిత వ్యక్తి మరొక వీసా మార్గంలోకి మారకపోతే లేదా శాశ్వత నివాసం (పీఆర్) పొందకపోతే.. అతను లేదా ఆమె అవుట్-ఆఫ్-స్టేటస్ గా మారతారని సెయిరా వివరించారు. గతంలో ఉన్న మార్గాలతో పోలిస్తే.. ఇటీవలి కాలంలో కెనడా తీసుకున్న విధాన మార్పులు వీటిని మరింత కఠినంగా మార్చాయని ఆయన అన్నారు. ముఖ్యంగా తాత్కాలిక కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ నుంచి పీఆర్‌కు మారడం ఇప్పుడు చాలా క్లిష్టమైన ప్రక్రియగా మారింది.
ఈ సమస్య పరిమాణం 2026లో మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 2025 చివరి త్రైమాసికంలోనే 2.91 లక్షలకు పైగా వర్క్ పర్మిట్‌లు గడువు ముగియనున్నాయి. దానికి కొనసాగింపుగా.. 2026 జనవరి నుంచి మార్చి మధ్యకాలంలోనే దాదాపు 3.15 లక్షల వర్క్ పర్మిట్‌లు ముగియనున్నాయని అంచనా. ఇంత భారీ సంఖ్యలో ఎక్స్‌పైరీలను కెనడా ఇంతకు ముందు ఎప్పుడూ ఎదుర్కోలేదని సెయిరా పేర్కొన్నారు.
ఈ పరిస్థితి కొనసాగితే.. 2026 మధ్య నాటికి కెనడాలో చట్టబద్ధ హోదా లేకుండా నివసిస్తున్న వారి సంఖ్య రెండు మిలియన్లకు చేరుకోవచ్చని ఆయన అంచనా వేశారు. అందులో సగం మంది భారతీయులే ఉండవచ్చని చెప్పారు. ఇది సంప్రదాయవాద అంచనా మాత్రమేనని.. పరిస్థితులు మరింత కఠినంగా మారితే ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని ఆయన హెచ్చరించారు.
ఈ ప్రభావం ఇప్పటికే గ్రేటర్ టొరంటో ప్రాంతంలోని కొన్ని ప్రాంతాల్లో కనిపించసాగిందని సెయిరా తెలిపారు. బ్రాంప్టన్, కాలెడాన్ వంటి ప్రాంతాల్లో పత్రాలు లేని వ్యక్తులు నివసిస్తున్న అటవీ ప్రాంతాలలో తాత్కాలిక డేరా శిబిరాలు ఏర్పడుతున్నాయని ఆయన చెప్పారు. ఇది కేవలం ఇమ్మిగ్రేషన్ సమస్య మాత్రమే కాకుండా, సామాజిక, మానవీయ సంక్షోభంగా కూడా మారే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ అంశంలో భారతీయులు ప్రధానంగా కనిపించడానికి కారణం కెనడాలోని తాత్కాలిక నివాసితుల జనాభా స్వరూపమే. వర్క్ పర్మిట్‌లపై పనిచేస్తున్న కార్మికులు, అంతర్జాతీయ విద్యార్థులలో భారతీయులే అత్యధికంగా ఉన్నారు. వర్క్ పర్మిట్ గడువులు, కఠినమైన పీఆర్ మార్గాలు, ప్రాసెసింగ్ ఆలస్యాలు అన్నీ కలిసి వేలాది మందిని ఆందోళనలోకి నెట్టేస్తున్నాయని నిపుణులు అంటున్నారు.
అంటే Canada లో ఉద్యోగం ఉన్నా లేదా ఉద్యోగం వెతుకుతున్నా.. చెల్లుబాటు అయ్యే చట్టపరమైన హోదా లేకుండా జీవించాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితి కెనడా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థకు మాత్రమే కాకుండా, లక్షలాది వలసదారుల జీవితాలకు కూడా పెద్ద సవాలుగా మారబోతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications