Canada Tariffs: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాను చెప్పిన మాటలను నిలబెట్టుకోవటంలో వెనుకంజ వేయరనే విషయం మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన చెప్పినట్లుగా నేటి నుంచి వాణిజ్య పన్నుల యుద్ధం స్టార్ట్ అయ్యింది.
వాస్తవానికి బాధ్యతలు చేపట్టిన తర్వాత ట్రంప్ మెక్సికో, కెనడా, చైనాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై భారీ పన్నులను ప్రకటించారు. అయితే తమ దేశ వస్తువులపై పన్నులు వేసే ప్రతి దేశంపైనా అదే స్థాయిలో పన్నులు ఉంటాయని ట్రంప్ ఇండియాకు కూడా గట్టి దెబ్బ ఇచ్చారు. అయితే ఈ క్రమంలో కెనడాపై 25 శాతం వరకు టారిఫ్స్ ప్రకటించగా.. చైనా వస్తువులపై 10 శాతం వరకు టారిఫ్స్ ఉంటాయన్నారు. అయితే చైనా దీనిని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వద్ద చాలెంజ్ చేస్తూ తిరిగి అదే స్థాయిలో పన్నులకు సిద్ధమైంది.

దీంతో నేడు అమెరికా నిర్ణయాలపై స్పందిస్తూ కెనడా ప్రభుత్వం అమెరికాలో తయారైన ఉత్పత్తులపై కౌంటర్-టారిఫ్‌ల భారీ ప్యాకేజీని ప్రకటించింది. ట్రంప్ అన్యాయమైన నిర్ణయానికి సమాధానం చెప్పకుండా ఉండనివ్వమని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పేర్కొన్నారు. మొదటి దశలో కెనడా ప్రభుత్వం అమెరికా ఎగుమతిదారుల నుండి వచ్చే దాదాపు 20.6 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్లు వెల్లడైంది. అమెరికా తన సుంకాలను తగ్గించకపోతే న్యూయార్క్ సమయం ఉదయం 12:01 గంటలకు ఇది అమల్లోకి వస్తుందని ట్రూడో తేల్చి చెప్పారు.
దీని అమలు జరిగిన మూడు వారాల తర్వాత రెండవ విడతలో అమెరికా ఉత్పత్తులపై 125 బిలియన్ కెనడియన్ డాలర్ల ఉత్పత్తులపై ఇదే రేటుతో సుంకాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ జాబితాలో అమెరికా నుంచి కెనడాకు దిగుమతి అయ్యే కార్లు, ట్రక్కులు, ఉక్కు, అల్యూమినియం వంటి ఉత్పత్తులపై ప్రభావం ఉంటుందని ట్రూడో స్పష్టం చేశారు. టారిఫ్స్ విషయంలో అమెరికా వెనక్కి తగ్గేంత వరకు కెనడా ప్రకటించిన ప్రస్తుత సుంకాలు కొనసాగుతాయని వెల్లడించారు. ట్రంప్ దిగిరాకుంటే మరిన్ని ఇతర చర్యలకు సిద్ధమౌతున్నట్లు కెనడా వెల్లడించింది.
వాస్తవానికి అమెరికా ఉత్పత్తులను ఎక్కువగా కెనడా దిగుమతి చేసుకుంటుంది. ఇదే తరహాలో కెనడా నుంచి అమెరికాకు సైతం అనేక ఉత్పత్తులు ఎగుమతి చేయబడతాయి. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య విలువ ఏకంగా 900 బిలియన్ డాలర్లుగా ఉంది. అయితే ప్రస్తుతం ట్రంప్ చర్యలతో ప్రపంచంలోని రెండు దేశాల మధ్య ఉన్న ద్వైపాక్షిక వ్యాపార కార్యకలాపాలు భారీగా ప్రభావితం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. ట్రంప్ తాజా చర్యలతో కెనడా డాలర్ విలువ క్షీణించటంతో పాటు అక్కడి స్టాక్స్ భారీగా పతనాన్ని చూస్తున్నాయి. అయితే ఈ ప్రభావం గ్లోబల్ మార్కెట్లలో కూడా కనిపిస్తోంది.
దీర్ఘకాలిక టారిఫ్ యుద్ధం రెండు సంవత్సరాలలో కెనడియన్ ఉత్పత్తిని దాదాపు 3 శాతం తగ్గించే అవకాశం ఉందని ఈ కాలంలో "వృద్ధిని తుడిచిపెట్టే" అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ కెనడా ఆందోళన వ్యక్తం చేసింది. మరో పక్క ట్రంప్ సైతం ఇప్పటికే అమెరికాలోని రైతులకు వాణిజ్య సుంకాల విషయంలో సిద్ధంగా ఉండాలని వెల్లడించినట్లు వార్తలు కూడా వస్తున్న తరుణంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. వాస్తవానికి ఇలాంటి పరిస్థితులను వారు ట్రంప్ ఎన్నికకు ముందు నుంచే హెచ్చరిస్తున్నారు.
More From GoodReturns

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications