Migrate To Canada: ప్రస్తుతం దేశంలో చాలా మంది స్కిల్డ్ వర్కర్లు మంచి ఉద్యోగ అవసరాల కోసం వేచిచూస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో లక్షల మంది ప్రజలు తమ అనుభవం, స్కిల్స్ ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు వలస వెళ్లి అక్కడే స్థిరపడుతున్నారు. ఇది చాలా మంది జీవితాలను మెరుగుపరిచిన సంగతి తెలిసిందే.
ఇమ్మిగ్రేషన్ గురించి ప్రపంచవ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతున్న వేళ కెనడా మాత్రం తమ దేశంలో శాశ్వతంగా స్థిరపడాలని భావిస్తున్న నైపుణ్యం కలిగిన కార్మికులకు అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ క్రమంలోనే కొత్తగా గ్రామీణ కమ్యూనిటీ ఇమ్మిగ్రేషన్ పైలట్ (RCIP), ఫ్రాంకోఫోన్ కమ్యూనిటీ ఇమ్మిగ్రేషన్ పైలట్ అనే రెండు ఇమ్మిగ్రేషన్ కార్యక్రమాలను కెనడా మంత్రి మార్క్ మిల్లర్ ప్రకటించారు. దాదాపు 18 కమ్యూనిటీల్లో ఉద్యోగుల కొరతకు పరిష్కారంగా ఈ నిర్ణయంతో వచ్చింది. ఇది కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీకి కూడా హామీని అందించటం చాలా మందిని ఆకట్టుకుంటోంది.

ముందుగా గ్రామీణ కమ్యూనిటీ ఇమ్మిగ్రేషన్ పైలట్ కార్మిక కొరతతో పోరాడుతున్న గ్రామీణ పట్టణాల కోసం దీనిని రూపొందించటం జరిగింది. ఈ కార్యక్రమం కింద విదేశాల నుంచి వచ్చే నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని స్థానిక వ్యాపారాలకు లింక్ చేస్తుంది. అలాగే కెనడా ప్రకటించిన రెండవ ప్రోగ్రామ్.. ఫ్రాంకోఫోన్ కమ్యూనిటీ ఇమ్మిగ్రేషన్ పైలట్ క్యూబెక్ వెలుపల ఉన్న మైనారిటీ ఫ్రాంకోఫోన్ కమ్యూనిటీల్లో ఫ్రెంచ్ మాట్లాడే వలసదారులను లక్ష్యంగా చేసుకుంటుంది. ఈ ప్రాంతాల భాషా, సాంస్కృతిక ఫాబ్రిక్‌ను కాపాడటానికి కెనడా చేస్తున్న ప్రయత్నాలకు కార్యక్రమం మద్దతుగా నిలవనుంది.
గ్రామీణ కమ్యూనిటీ ఇమ్మిగ్రేషన్ పైలట్ కింద పిక్టౌ కౌంటీ, నార్త్ బే, సడ్‌బరీ, టిమ్మిన్స్, సాల్ట్ స్టీ మేరీ, థండర్ బే, స్టెయిన్‌బాచ్, ఆల్టోనా, బ్రాండన్, మూస్ జా, క్లారెషోల్మ్, వెస్ట్ కూటేనే, ఉత్తర ఒకనాగన్ షుస్వాప్, పీస్ లియర్డ్ ఉన్నాయి. ఇదే క్రమంలో ఫ్రాంకోఫోన్ కమ్యూనిటీ ఇమ్మిగ్రేషన్ పైలట్ కోసం అకాడియన్ ద్వీపకల్పం, సడ్‌బరీ, టిమ్మిన్స్, సుపీరియర్ ఈస్ట్ ప్రాంతం, సెయింట్ పియరీ జోలిస్, కెలోవానా ఉన్నాయి.
భారతదేశం నుంచి అర్హత కలిగిన వ్యక్తులు అవసరమైన నిబంధనల కింద ఉద్యోగం పొందినట్లయితే దీనిని వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా నర్సు సహాయకులు, గృహ సహాయకులు సహా ఆరోగ్య సంరక్షణ కార్మికులు నిర్దిష్ట పాత్రలకు అర్హులు. పర్మనెంట్ రెసిడెండ్ దరఖాస్తు ప్రాసెస్ చేయబడినప్పుడు రెండు సంవత్సరాల పాటు చెల్లుబాటు అయ్యే తాత్కాలిక వర్క్ పర్మిట్‌కు కూడా అర్హత పొందవచ్చు.


Click it and Unblock the Notifications