EPF for Home loans: గృహ రుణం అనేది లాంగ్ టర్మ్ లోన్. సాధారణ రుణాలతో పోలిస్తే ఇది ఎక్కువ కాలం కొనసాగుతుంది. దీంతో సహజంగానే రుణదాతలకు తిరిగి కట్టాల్సిన వడ్డీ భారీ మొత్తంలో ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా లోన్ తిరిగి చెల్లించి విముక్తి పొందాలని అందరూ భావిస్తారు. ఇందుకోసం తమకు అందుబాటులోని వివిధ వనరులను ఉపయోగించుకుంటారు. వీటిలో ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను ఒకటిగా చెప్పుకోవచ్చు.
ప్రావిడెంట్ ఫండ్‌ను ఉద్యోగుల డీఫాల్ట్ సేవింగ్స్‌గా భావించవచ్చు. ఎందుకంటే సిబ్బంది వేతనంలో 12 శాతాన్ని ప్రతి యజమాని నేరుగా EPFOకి జమ చేయాల్సి ఉంటుంది. దీనిపై ఉద్యోగులకు వడ్డీ లభిస్తుంది. దీని ఉద్దేశం రిటైర్‌మెంట్ అయినప్పటికీ గృహ రుణం చెల్లింపు వంటి ప్రత్యేక పరిస్థితుల్లో కొంత మొత్తాన్ని ఉపసంహరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది.

సాధారణంగా గృహ రుణాల ముందస్తు చెల్లింపుల కోసం చాలామంది ఈ ప్రావిడెంట్ ఫండ్‌ను వినియోగిస్తుంటారు. అయితే 10 ఏళ్ల పాటు చందా చెల్లిస్తేనే ఇలా చేసేందుకు అర్హత లభిస్తుంది. ఐదేళ్ల తర్వాత విత్‌డ్రా చేసే మొత్తంపై పన్ను కూడా విధించబడదు. అయినప్పటికీ PF కార్పస్‌ను ఉపయోగించే ముందు అన్ని అంశాలనూ పరిగణలోనికి తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
PF వినియోగంపై నిర్ణయం విషయంలో ఉద్యోగి వయసు కీలక పాత్ర పోషిస్తుందని గమనించాలి. 30 ఏళ్ల వ్యక్తి ఆ మొత్తాన్ని ఉపయోగించుకున్నా తిరిగి తన రిటైర్‌మెంట్ లోపు మరలా కూడబెట్టే ఆప్షన్ ఉంది. కానీ వయసు పెరిగేకొద్దీ ఈ అవకాశం సన్నగిల్లుతూ ఉంటుంది. అయితే EPFపై వడ్డీ రేటు హోమ్ లోన్ వడ్డీకి సమానంగా లేదా ఎక్కువ ఉంటే కార్పస్‌ను కదిలించకపోవడం మంచిది.
హోమ్ లోన్ విషయంలో ఎదురవుతున్న ఆర్థిక సవాళ్లను ఎదుర్కొనేందుకు ఫిక్స్డ్ డిపాజిట్లు వంటి ఇతర మార్గాలను ఉపయోగించడం మంచిది. PF అనేది జీవిత చరమాంకంలో ఆర్థిక స్వాతంత్ర్యం కోసం ఉద్దేశించినది కావడంతో దాన్ని చివరి ప్రయత్నంగా మాత్రమే చూడాలి. గృహ రుణాల వడ్డీ రేట్లు నిరంతరం పెరుగుతున్న క్రమంలో మాత్రం ఇదొక చక్కటి ఎంపికగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు. అయితే ఏవైనా ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే మందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం మంచిదని గుర్తించుకోవాలి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications