HRA Claim: ఒకవేళ నవంబర్ వరకు మీరు అద్దె ఇంట్లో ఉంటూ డిసెంబర్ 1, 2023న సొంతంగా కనుకున్న ఇంట్లోకి వెళ్లినట్లయితే.. టాక్స్ రిటర్న్స్‌లో HRA, హోమ్ లోన్ చెల్లింపులను ఏకకాలంలో క్లెయిన్ చేయటంపై అనేక మందికి అనుమానాలు ఉన్నాయి.
దేశంలోని పన్ను చట్టాల ప్రకారం నిర్దేశించిన షరతులకు లోబడి సంవత్సరానికి HRA, హోమ్ లోన్ కోసం ఏకకాలంలో పన్ను ప్రయోజనాలను క్లెయిమ్ చేయడంపై ఎటువంటి పరిమితి లేదని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో హెచ్ఆర్ఏ క్లెయిమ్ చేయటానికి వాస్తవంగా సదరు టాక్స్ చెల్లింపుదారుడు తనది కాని అద్దె నివాసంలో ఉంటూ దానికి ప్రతినెల చెల్లింపులు చేసి ఉండాలి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. హెచ్‌ఆర్‌ఏ ప్రయోజనం అనేది అద్దెను వాస్తవంగా చెల్లించిన కాలానికి లెక్కించబడుతుంది. కాబట్టి మీరు అద్దె ఇంటికి అద్దె చెల్లించి కాలానికి మాత్రమే HRA ప్రయోజనాన్ని క్లెయిమ్ చేయగలరు.

అదేవిధంగా సెక్షన్ 24(b) కింద వడ్డీని క్లెయిమ్ చేయాలంటే అందుకోసం మీరు సొంతంగా కొనుగోలు చేసిన ఇంటి కోసం తీసుకున్న రుణంపై వడ్డీని చెల్లిస్తూ ఉండాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం చివరి రోజున మీరు ఇంటిని స్వాధీనం చేసుకున్నప్పటికీ.. మీరు సంవత్సరం మొత్తానికి వడ్డీని క్లెయిమ్ చేయగలరని గుర్తుచుకోండి. కొనుగోలు చేసిన ఇల్లు స్వాధీనం చేసుకునే ముందు చెల్లించిన వడ్డీకి సంబంధించి.. మీరు స్వాధీనం చేసుకున్న సంవత్సరం నుంచి ఐదు సమాన వాయిదాల్లో క్లెయిమ్ చేయడానికి అనుమతించబడుతుంది.
ఇంటి నిర్మాణ వ్యవధిలో, ప్రస్తుత సంవత్సరంలో వడ్డీతో కూడిన మొత్తం వడ్డీ క్లెయిమ్ సొంతింటి విషయంలో సంవత్సరానికి రూ.2 లక్షలకు పరిమితం చేయబడింది. అయితే రూ.2 లక్షల కంటే పైన ఉన్న వడ్డీ మెుత్తాన్ని మర్చిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చట్టం కేవలం రూ.2 లక్షల వరకు మాత్రమే వడ్డీని మినహాయింపుగా పొందేందుకు అనుమతిస్తుంది. "ఇంటి ఆస్తి నుంచి వచ్చే ఆదాయం" హెడ్ కింద నష్టాన్ని ఇతర ఆదాయానికి వ్యతిరేకంగా సంవత్సరానికి రెండు లక్షల వరకు మాత్రమే సెటాఫ్ చేయవచ్చు. అలా సెటాఫ్ కాని నష్టాన్ని తర్వాత 8 సంవత్సరాల పాటు ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ నుంచి సెటాఫ్ చేసుకునేందుకు వెసులుబాటు ఉంటుంది.
డిసెంబర్ 1 నుంచి సొంతింటికి మారిన క్రమంలో.. మీరు 2023-2024 సంవత్సరానికి వడ్డీకి మరియు మార్చి 31, 2023 వరకు చెల్లించిన మొత్తం వడ్డీలో 1/5 పరిమితి రూ.2 లక్షలు ఇది మీ స్వంత ఆస్తి కాబట్టి.


Click it and Unblock the Notifications