కరోనా వైరస్ కారణంగా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలుతున్నాయి. అగ్రరాజ్యంగా అమెరికా కకలావికళమవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ నుండి గట్టెక్కేందుకు అన్ని దేశాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కొన్ని దేశాలు డబ్బును ప్రింటింగ్ వంటి అసాధారణ చర్యలుతీసుకుంటున్నాయి. అమెరికా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు, జపన్, అభివృద్ధి చెందుతున్న దేశాలైన ఇండోనేశియా, టర్కీ వంటివి కూడా ఆర్థిక పునరుజ్జీవానికి డబ్బును ముద్రించాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కూడా మనీని ముద్రించాలా?

అసలు మనీ ప్రింటింగ్ అంటే ఏమిటి?
సెంట్రల్ బ్యాంకు నేరుగా ప్రభుత్వ, కార్పోరేట్లు, రుణదాతల డెబిట్, బాండ్స్‌ను కొనుగోలు చేస్తుంది. ఈ మనీ మొత్తాన్ని ఆర్థిక వ్యవస్థలోకి చొప్పిస్తుంది. ఎలక్ట్రానిక్ రూపంలో కూడా నగదు పెరిగే అవకాశముంది. సెంట్రల్ బ్యాంకు బాండ్స్, రుణదాతల నుండి బాండ్స్ కొనుగోలు చేయడం ద్వారా విక్రేత లిక్విడ్ అసెట్స్‌ను వదిలించుకొని, వచ్చిన నిధులను వేరేచోట ఫండింగ్ చేసే వెసులుబాటు ఉంటుంది.

ఇతర దేశాలు ఇలా చేశాయా?
- 2008లో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు యూఎస్ ఫెడ్ రిజర్వ్ భారీగా నగదును ముద్రించింది. కరోనా మహమ్మారి కారణంగా ఇప్పుడు మరోసారి నగదు ముద్రణకు సిద్ధమవుతోంది.
- యూరోపియన్ సెంట్రల్ బ్యాంకు బాండ్స్ కొనుగోలుపై ఉన్న నియంత్రణను ఎత్తివేసింది. ఇది ఏ యూరోపియన్ కంట్రీ నుండి అయినా కొనుగోలు చేయవచ్చు.
- అత్యవసరమైతే ప్రభుత్వానికి అవసరమైన మనీ ఇచ్చేందుకు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ సిద్ధంగా ఉంది.
- బ్యాంక్ ఆఫ్ జపాన్ అపరిమిత ప్రభుత్వ బాండ్స్ కొనుగోలు చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేసింది.

ఇప్పుడు మన దేశం ఏం చేయాలి?
- దేశం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి పెద్ద మొత్తంలో ఆర్థిక ప్యాకేజీ అవసరం. జీడీపీలో దాదాపు 9 శాతం నుండి 10 శాతం ఖర్చు చేయాలి. అంటే సుమారు రూ.18 లక్షల నుండి రూ.20 లక్షల కోట్లు. ఈ ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ రుణాలు రూ.8 లక్షల కోట్లు. వీటికి మార్కెట్ మద్దతివ్వదు.
- వడ్డీ రేట్లు క్రమంగా పెంచాల్సిన అవసరం ఉంది.
- ప్రయివేటు సెక్టార్స్/ఇతర ఇతర రుణ గ్రహీతలకు అప్పులు పుట్టవు.
- ఎక్కువ వడ్డీ రేట్లు/రుణాలు సకాలంలో లేకపోవడంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి.
- కాబట్టి వీటన్నింటికి పరిష్కారం ఆర్బీఐ నగదు ముద్రించడం ద్వారా మాత్రమే ఫండ్స్ సమకూర్చగలదనేది నిపుణుల మాట.

రిస్క్-రిటర్న్స్
ఇలా చేస్తే స్థూల సమతౌల్యత దెబ్బతింటుందని కూడా కొంతమంది ఆర్థికవేత్తలు అంటున్నారు. అధిక ద్రవ్యోల్భణం, అధిక కరెంట్ ఖాతా లోటు, కరెన్సీ తరుగుదల, నిర్లక్ష్య ఖర్చుతో ఎన్పీఏలకు ఆజ్యం వంటి ప్రభావం ఉంటాయని చెబుతున్నారు. అదే సమయంలో ప్రస్తుత పరిస్థితులు అనుకూలమని కొందరు చెబుతున్నారు. వాణిజ్యం లేదు కాబట్టి ఆందోళనకర పరిస్థితి అవసరం లేదు. ముడి చమురు ధరలు భారీగా తగ్గాయి. అవి మరికొన్నాళ్లు అలాగే ఉండే పరిస్థితి నెలకొని ఉంది. కరోనా కారణంగా క్రెడిట్ ప్రమాదం తక్కువగా ఉంది.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications