అగ్రరాజ్యం అమెరికా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు..ప్రపంచ దేశాలపై డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకాలను రద్దు చేసిన సంగతి విదితమే. ఇది చట్ట విరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ప్రపంచ దేశాలకు భారీ ఉపశమనం లభించింది. ముఖ్యంగా భారతదేశానికి ఇది చాలా మేలు చేసింది. దిగుమతి సుంకాలను ఏకపక్షంగా విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేదని కోర్టు స్పష్టం చేయడం ద్వారా.. భారత్-రష్యా ఇంధన వాణిజ్యంపై ఉన్న ఒత్తిడి కొంతవరకు తగ్గింది. ఈ పరిణామం నేపథ్యంలో, భారతదేశం రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగించగలదా అనే అంశంపై అంతర్జాతీయంగా కొత్త చర్చ మొదలైంది.
CNBC ఇంటర్నేషనల్ ప్రచురించిన వివరణాత్మక నివేదిక ప్రకారం.. ఈ కోర్టు తీర్పు భారతదేశ ఇంధన వ్యూహానికి అనుకూలంగా మారింది. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం (IEEPA) కింద విస్తృత స్థాయిలో దిగుమతి సుంకాలు విధించే చట్టపరమైన అధికారం అధ్యక్షుడికి లేదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. దీంతో, రష్యా నుంచి చమురు దిగుమతుల ఆధారంగా భారత్‌పై అదనపు సుంకాలు విధించే అవకాశాలు పరిమితమయ్యాయి.

ఇంధన నిపుణుల అభిప్రాయం ప్రకారం.. భారతదేశం తన ఇంధన అవసరాలు, ధరల ప్రయోజనం, సరఫరా భద్రతను దృష్టిలో ఉంచుకుని రష్యన్ చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేయడం అసంభవం. క్విన్సీ ఇన్‌స్టిట్యూట్ గ్లోబల్ సౌత్ ప్రోగ్రామ్ డైరెక్టర్ సారంగ్ షిడోర్ మాట్లాడుతూ.. ఇంధన రంగంలో సహా రష్యాతో భారతదేశం మంచి సంబంధాలను కొనసాగిస్తుంది. అవసరమైతే దిగుమతులు కొంత తగ్గవచ్చు, కానీ పూర్తిగా ఆపడం జరిగే అవకాశాలు తక్కువని అన్నారు.
ఇంధన డేటా సంస్థ క్ప్లర్ గణాంకాల ప్రకారం.. ఫిబ్రవరిలో భారత్ రోజుకు సగటున 1.16 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ చమురును దిగుమతి చేసుకుంది. ఇది 2025 సగటు రోజువారీ దిగుమతులైన 1.71 మిలియన్ బ్యారెళ్లతో పోలిస్తే తక్కువ. మార్చి, ఏప్రిల్ నెలల గణాంకాలు ఇంకా స్పష్టంగా లేనప్పటికీ.. US-భారత్ మధ్య తాత్కాలిక వాణిజ్య ఒప్పందం తర్వాత భారత శుద్ధి కర్మాగారాలు కొత్త రష్యన్ చమురు ఒప్పందాల విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఈ ధోరణి మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి.
నిపుణుల అంచనాల ప్రకారం.. భారత్ రష్యా నుంచి రోజుకు 8 లక్షల నుంచి 1 మిలియన్ బ్యారెళ్ల వరకు చమురు దిగుమతులను చేయగల స్థితిలో ఉంది. గతంలో రష్యన్ చమురు కొనుగోళ్లు భారత్-అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలకు దారితీశాయి. గత సంవత్సరం ఆగస్టులో.. ట్రంప్ పరిపాలన భారత్‌పై అదనంగా 25 శాతం సుంకం విధించింది. దీంతో భారత ఎగుమతులపై మొత్తం సుంక భారం 50 శాతానికి చేరింది. అనంతరం, తాత్కాలిక వాణిజ్య ఒప్పందం కింద ఈ సుంకాన్ని 18 శాతానికి తగ్గించారు.
ఫిబ్రవరిలో జారీ చేసిన ఒక కార్యనిర్వాహక ఉత్తర్వులో.. ట్రంప్ శిక్షాత్మక సుంకాన్ని ఎత్తివేసి, భారత్ రష్యన్ చమురు దిగుమతులను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. అయితే, రెండు దేశాల ఉమ్మడి ప్రకటనలో అలాంటి స్పష్టమైన నిబద్ధత ఏదీ నమోదు కాలేదు. మరోవైపు, రాబోయే ఐదేళ్లలో అమెరికా నుంచి సుమారు 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులు, ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేయాలనే ఉద్దేశాన్ని భారత్ వ్యక్తం చేసింది.
ఆక్స్‌ఫర్డ్ ఎకనామిక్స్‌కు చెందిన ఆర్థికవేత్త అలెగ్జాండ్రా హెర్మాన్ అభిప్రాయం ప్రకారం.. భారతదేశ ఇంధన వ్యూహం ధరల ప్రయోజనం, సరఫరా వైవిధ్యంపై ఆధారపడి ఉంటుంది. ఒకే సరఫరాదారుపై ఆధారపడకుండా, రష్యా, అమెరికా తదితర దేశాల నుంచి సమతుల్యంగా చమురు కొనుగోలు చేయడమే భారత్ లక్ష్యంగా పెట్టుకుంది. క్లుప్తంగా చెప్పాలంటే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు భారతదేశానికి వ్యూహాత్మక ఊపిరి పోసినట్లైంది. రష్యన్ చమురు కొనుగోళ్లపై అమెరికా నుంచి తీవ్రమైన ఒత్తిడి తగ్గే అవకాశాలు పెరిగాయని నిపుణులు భావిస్తున్నారు.
More From GoodReturns

ఇరాన్ యుధ్ధం.. హార్ముజ్ జలసంధిని దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు.. ఎలా సాధ్యమయిందంటే..

ఇరాన్ మా షరతులకు ఒప్పుకుంది..అణ్వాయుధాలు విడిచిపెడుతోంది..ట్రంప్ సంచలన ప్రకటన..

హార్ముజ్ జలసంధిని దాటిన మరో రెండు భారత LPG నౌకలు.. మరో మూడు షిప్పులు ఇంకా అక్కడే..

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

భారతదేశంలో లాక్డౌన్.. గూగుల్‌లో తెగ వెతికేస్తున్న నెటిజన్లు.. వెస్ట్ ఆసియా దేశాల్లో ఎమర్జెన్సీ ప్రకటన..

చమురు సంక్షోభంలో స్నేహితుడికి అండగా రష్యా.. భారత రిఫైనరీ కంపెనీలకు 6 కోట్ల బ్యారెళ్ల ముడి చమురు సరఫరా

మాట తప్పిన అమెరికాతో చర్చలు ఇక ఉండవని స్పష్టం చేసిన ఇరాన్.. గల్ఫ్ దేశాల తాగునీటిపై గురి పెట్టిన టెహ్రాన్..

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..



Click it and Unblock the Notifications