ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సంస్థలు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు అని అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలను ఉల్లంఘించాయని ఆరోపించింది. వీటిపై కఠిన చర్యలు తీసుకోవాలని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని కోరింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్, ప్లిప్‌కార్ట్ ఇతర ఈ-కామర్స్ సంస్థల చేతుల్లో విలవిల్లాడుతున్నాయని, చిన్న వ్యాపారస్తులు దెబ్బతింటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.

ఆర్థిక ఉగ్రవాదులు
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లను CAIT ఆర్థిక ఉగ్రవాదులు అంటూ విరుచుకుపడింది. FDI నిబంధనలు ఉల్లంఘించాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయితే, ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి ఈ ఆరోపణలను కొట్టి పారేశారు. తాము భారత్‌లోని చట్టాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నామని, ఎక్కడా ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని తెలిపారు.

ప్రభుత్వం తోడ్పాడు
స్వార్థ ప్రయోజనాల కోసం తమపై విమర్శలు చేయడం దురదృష్టకరమని ఫ్లిప్‌కార్ట్ అధికార ప్రతినిధి అన్నారు. దేశంలో ఉద్యోగాలు, సంపద సృష్టికి, ఆర్థిక వృద్ధికి కేంద్ర ప్రభుత్వం తోడ్పడుతోందని చెప్పారు. కానీ కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం వ్యవస్థాపక స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. అమెజాన్ ఇండియా కూడా దీనిపై స్పందించాల్సి ఉంది.

మోడీ కలకు ప్రధాన అడ్డంకి...
అయితే, ఈ-కామర్స్ సంస్థల వల్ల తమ వ్యాపారాలు దెబ్బతింటున్నాయని చిన్న వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఆర్థిక ఉగ్రవాదులే కాకుండా, ప్రధాని నరేంద్ర మోడీ కంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగేందుకు ప్రధాన అడ్డంకిగా మారుతాయని హెచ్చరించారు. ప్రభుత్వం వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని CAIT విజ్ఞప్తి చేసింది.

5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం ఫ్లిప్‌కార్ట్ వాదన
మోడీ ప్రభుత్వం కలలు కంటున్న 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ కోసం ఇన్నోవేషన్, టెక్ డ్రైవెన్ డిజిటల్ వాణిజ్యం అవసరమని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. MSMEలు, కిరాణా విజయవంతమయ్యేందుకు, కొత్త జీవనోపాధి అవకాశాలు సృష్టించడం కోసం, ఆర్థిక వ్యవస్థకు అండగా ఉండేందుకు, ఖజానాకు ఎక్కువ పన్ను తీసుకు రావడం కోసం అవసరమని చెబుతోంది.

లక్షలాది ఉద్యోగాలు సృష్టించాం
గత అయిదేళ్లలో మౌలిక సదాపాయాలు, సెల్లర్ ఎకోసిస్టంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం ద్వారా లక్షలాది ఉద్యోగాలు సృష్టించామని ఫ్లిప్‌కార్ట్ చెబుతోంది. అలాగే, తమ టెక్నాలజీ, ఇంజినీరింగ్ టీమ్ ద్వారా ఎన్నో ఆవిష్కరణలు చేశామన్నారు.

భారీ తగ్గింపుల పేరుతో...
మరోవైపు, CAIT భారీ తగ్గింపు, భారీ ఆఫర్ల పేరుతో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు చిరు వ్యాపారస్తులను దెబ్బతీస్తున్నారని మండిపడింది. ఈ-కామర్స్ సంస్థలు, బ్రాండెడ్ కంపెనీలు, బ్యాంకులు కలిసి ఆయా వస్తువులపై భారీ తగ్గింపులు, క్యాష్ బ్యాక్‌లు ఇస్తున్నారని, వారిది అపవిత్ర కలయిక అంటోంది. భారీ తగ్గింపులకు వ్యతిరేకంగా అలాగే, ఈ-కామర్స్ సంస్థల ఉల్లంఘనలపై సమగ్ర దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications