భారత్ దేశం చైనాకు ఎట్టకేలకు షాకిచ్చింది. గత కొద్ది రోజులుగా రేర్ ఎర్త్ మెటల్స్ విషయంలో చైనా చూపిస్తున్న పక్షపాత వైఖరికి భారత్ పుల్ స్టాప్ పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అరుదైన భూమి మూలకాల (rare-earth magnets) సరఫరాకు సంబంధించి ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతో భారతదేశం చర్చలు జరుపుతోందని చెప్పే ఒక ముఖ్యమైన నివేదిక వెలుగులోకి వచ్చింది. ఈ వార్త బయటకు రాగానే భారతదేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ మారుతి సుజుకి షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. మారుతి సుజుకి షేర్లు దాదాపు 2% పెరగగా.. NSEలో ఆ కంపెనీ షేర్లు 12,841కి చేరుకున్నాయి.
కాగా గత కొద్ది రోజుల నుంచి చైనా నుంచి రేర్ ఎర్త్ మాగ్నైట్ దిగుమతులపై సస్పెన్స్ నెలకొంది. చైనా దీనిపై ఎటువంటి నిర్ణయం భారతదేశానికి తెలపకపోవడంతో ఆటోమొబైల్ పరిశ్రమలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతుందని వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భారత్ ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టింది. చైనా నుంచి కాకుండా ఆస్ట్రేలియాను అరుదైన-భూమి అయస్కాంతాల కొత్త వనరుగా మార్చాలని భారత్ పరిశీలిస్తోందని నివేదికలు పేర్కొన్నాయి.

ప్రభుత్వ అధికార వర్గాల ప్రకారం..ఆస్ట్రేలియా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ వంటి దేశాలతో ఈ అరుదైన భూమి మూలకాల (REE) సరఫరాకు సంబంధించి ఇండియా చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. దీని ప్రధాన ఉద్దేశం చైనాపై ఈ అరుదైన అయస్కాంత లోహాలపై ఆధారపడటాన్ని తగ్గించడమేనని చెప్పుకొవచ్చు.
భారత్ ఆటోమొబైల్ రంగంలో ఈ అరుదైన భూమి అయస్కాంతాలు కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలలో మోటార్లు, ఇతర ఎలక్ట్రిక్ భాగాలలో అరుదైన-భూమి అయస్కాంతాలను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఇప్పటివరకు భారతదేశం ఈ అయస్కాంతాల కోసం పొరుగు దేశం చైనాప మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంది.ఈ నేపథ్యంలోనే చైనా అరుదైన-భూమి అయస్కాంతాలపై ఆంక్షలు విధించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆటోరంగ పరిశ్రమలో ఆందోళనలు మొదలయ్యాయి. అయితే భారత్ దీనికి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. తద్వారా చైనాకు చెక్ పెట్టాలని యోచిస్తోంది.
అరుదైన భూమి అయస్కాంతాల విషయానికి వస్తే.. 44 మిలియన్ టన్నుల నిల్వలతో చైనా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది. దాని తర్వాత భారత్ 6.9 మిలియన్ టన్నులతో ఉంది. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నిల్వలుగా చెప్పుకోవచ్చు. ఇక చైనా ప్రధానమైన బలం ఏంటంటే..అరుదైన భూమి అయస్కాంతాలే..ఆ దేశంలో 60% కంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుంది. వాటిలో 90% కంటే ఎక్కువ చైనాలోనే ప్రాసెస్ జరుగుతుంది.
ఇక వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ కూడా ఈ వ్యవస్థను బలోపేతం చేయడానికి భారతదేశం అనేక దేశాలతో చర్చలు జరుపుతోందని.. ఈ అంశంపై దౌత్య స్థాయిలో చైనాతో రూడా చర్చలు కూడా జరుగుతున్నాయని తెలిపారు. ఇక ఆటో మొబైల్ దిగ్గజం మారుతి సుజుకీ త్వరలోనే తొలి ఎలక్ట్రిక్ కారు ఈ-విటారాను గ్రాండ్ గా విడుదల చేయబోతోంది .
Disclaimer: This article is strictly for informational purposes only. It is not a solicitation to buy, sell in precious metal products, commodities, securities or other financial instruments. Greynium Information Technologies Pvt Ltd, its subsidiaries, associates and the author of this article do not accept culpability for losses and/or damages arising based on information in this article.


Click it and Unblock the Notifications