ట్యాక్స్ సమయానికి చెల్లించలేకపోయిన వారికి ఊరట కలిగించే వార్త. పన్ను చెల్లింపుదారులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ వార్షిక రిటర్న్స్ గడువును మళ్లీ పెంచింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ గడువును డిసెంబర్ 31వ తేదీ వరకు పెంచింది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను మార్చి 31వ తేదీ వరకు పొడిగించింది. జీఎస్టీని ఫైల్ చేసేందుకు వాడే రెండు ఫామ్స్‌లలో కొన్ని అంశాల్ని ఆప్షన్‌గా మార్చింది. కాబట్టి అవి నింపకపోయినా ఏమీ కాదు. ఈ నిర్ణయం ట్యాక్స్ చెల్లింపుదారులకు ప్రయోజనకరం. సమన్వయ నివేదిక కాలపరిమితిని పెంచింది.
జీఎస్టీ చెల్లింపులకు సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ప్రయోజనం కలిగించేలా రెండు జీఎస్టీ దరఖాస్తులను మరింత సరళతరం చేస్తున్నట్లు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(CBIC) ఓ ప్రకటనలో తెలిపింది. గత రెండు ఆర్థిక సంవత్సరాలకుగాను జీఎస్టీఆర్ 9 (వార్షిక రిటర్న్స్), జీఎస్టీఆర్ 9సీ(రీకన్సిలేషన్ స్టేట్‌మెంట్) గడువులను వచ్చే మార్చి వరకు పెంచడానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది.

గతంలో 2017-18 ఏడాదికి గాను నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఉండగా, 2018-19 సంవత్సరానికి గాను డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు ఉండేది. ఈ గడువును పెంచుతూ ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చింది.
గడిచిన రెండు ఆర్థిక సంవత్సరాలకు గాను ట్యాక్స్ చెల్లింపుదారులు తమ ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ను జతపరచాల్సిన అవసరం లేదు. జీఎస్టీ చెల్లింపులో ఇబ్బందులు పడుతున్న వారికి ప్రయోజనం కలిగేలా రెండు జీఎస్టీ ఫారాలను ఈజీగా ఉండేలా చేసినట్లు CBIC తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.6 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూలైంది. బడ్జెట్లో నిర్దేశించుకున్న రూ.13.35 లక్షల కోట్లలో సగాని కంటే తక్కువగా వచ్చింది. బడ్జెట్లో నిర్దేశించుకున్న లక్ష్యానికి చేరుకునేందుకు ప్రయత్నిస్తామని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. ఈ ఏడాది ప్రారంభంలో రూ.13.35 లక్షల కోట్లు వసూళ్లు లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు సగాని కంటే తక్కువగా (రూ.6 లక్షల కోట్లు) వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే రీఫండ్ చెల్లింపులు 20% పెరిగే అవకాశముందని చెబుతున్నారు.


Click it and Unblock the Notifications