Anil Ambani: ఈడీ ఎదుట అంబానీ సోదరుడు.. ఫెమా ఉల్లంఘన కేసులో ప్రశ్నలు..
Anil Ambani: దేశంలో ఒకప్పుడు సంపన్నుడు, ముఖేష్ అంబానీ సోదరుడు అనిల్ అంబానీకి తలనొప్పుడు కొనసాగుతూనే ఉన్నాయి. వ్యాపారంలో నష్టపోయి, ఆస్తులు కోల్పోయిన తర్వాత ఆయన పెద్దగా కనిపించలేదు.తాజాగా రిలయన్స్ ఏడీఏ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీ ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (FEMA) ఉల్లంఘనలకు సంబంధించిన కేసు విచారణలో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. సమాచారం ప్రకారం అంబానీ ఉదయం 10 గంటలకు ముంబైలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
FEMA చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బుక్ అయిన 64 ఏళ్ల అంబానీ ఈ కేసులో తన స్టేట్‌మెంట్‌ను నమోదు చేసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ కార్యాలయంలో హాజరైనట్లు వెల్లడైంది. దీనికి ముందు 2020 ప్రారంభంలో యెస్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్, ఇతరులపై మనీలాండరింగ్ కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ ED ముందు హాజరైన సంగతి తెలిసిందే. ఇది ఆయన కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన తాజా కేసని సంబంధిత వర్గాలు తెలిపాయి.

గత ఏడాది ఆగస్టులో రెండు స్విస్ బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.814 కోట్లకు పైగా వెల్లడించని నిధులపై రూ.420 కోట్ల పన్ను ఎగవేతకు పాల్పడ్డారంటూ ఆదాయపు పన్ను శాఖ అంబానీకి నల్లధన నిరోధక చట్టం కింద నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో బాంబే హైకోర్టు మార్చిలో స్టే విధించటంతో అంబానీ సోదరుడికి రిలీఫ్ వచ్చింది. అలాగే అతనిపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని ఆదాయపు పన్ను శాఖకు కోర్టు సూచించింది. తాజాగా జరిగిన పరిణామాలపై పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications