Income Tax: IT రిటర్న్స్ ఫైలింగ్‌ పోర్టల్‌లో పెద్ద లొసుగు.. భారీగా నష్టపోతున్న ట్యాక్స్ పేయర్స్

Bug in IT portal: పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను శాఖ షాకుల మీద షాక్‌లు ఇస్తోంది. పోర్టల్‌లో ITR ఫైలింగ్‌కుగాను యూజర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇటీవల అప్‌డేట్‌తో ట్యాక్స్ పేయర్స్ మరింత నష్టపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఆదాయపు పన్ను చట్టం 1961కి విరుద్ధమని పలువురు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల ఆదాయపు పన్ను పోర్టల్‌లో ట్యాక్స్-ఫైలింగ్ యుటిలిటీని అప్‌డేట్ చేసిన తర్వాత ఓ సమస్య ఏర్పడినట్లు మీడియా నివేదికలు చెబుతున్నాయి. పన్ను చెల్లింపుదారులు స్వల్పకాలిక మూలధన లాభాలను బుక్ చేసినట్లయితే, కొత్త పన్ను విధానంలో రిబేట్ వదులుకోవలసి వస్తున్నట్లు సమాచారం. ట్యాక్స్ రిబేట్ అనేది తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులకు 25 వేల మేరకు పన్ను తగ్గించడంలో సహాయపడేందుకు ఇచ్చిన మినహాయింపు. కొత్త పన్ను విధానం ఎంచుకునే వ్యక్తులు మాత్రమే దీన్ని క్లెయిమ్ చేసేందుకు అనుమతించబడతారు.

Bug in tax filing portal caused loses to tax payers

'మొత్తం పన్ను విధించదగిన ఆదాయం'పై నెలకొన్న అవగాహనా రాహిత్యం వల్ల భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నట్లు చార్టర్డ్ అకౌంటెంట్స్ భావిస్తున్నారు. వందలాది మంది తక్కువ-ఆదాయం కలిగిన ట్యాక్స్ పేయర్స్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఈ తప్పును వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు.

'కొత్త పన్ను విధానంలో ఈ విచిత్రమైన ధోరణిని కనిపిస్తోంది. నికర ఆదాయం 7 లక్షల కంటే తక్కువ ఉన్నా ట్యాక్స్ పేయర్స్ పూర్తి రాయితీని పొందలేరు. సెక్షన్ 87A కింద 15 శాతం స్వల్పకాలిక మూలధన లాభాలను (STCG) బుక్ చేసి ఉంటే వారు 25 వేల రిబేట్ పొందేందుకు అనర్హులుగా పోర్టల్ పేర్కొంటోంది. అటువంటి వారికి రాయితీని ఇచ్చేందుకు పోర్టల్‌లో కొత్తగా చేర్చబడిన యుటిలిటీ నిరాకరిస్తోంది' అని 'ట్యాక్స్ ఆరామ్' ఇండియా వ్యవస్థాపక డైరెక్టర్ మయాంక్ మొహంకా తెలిపారు. అయితే జూలై 5, 2024కి ముందు దాఖలు చేసిన రిటర్న్‌లకు ఈ తగ్గింపు అందుబాటులో ఉండటం విశేషం.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+