బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు పసిడి ధరలను పెంచేస్తున్నాయి. దేశీయంగా కూడా బంగారం ధరలు సామాన్యులకు అందని విధంగా దూసుకుపోతున్నాయి. అయితే బడ్జెట్ సమీపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేంద్రం బంగారం ధరలను నియంత్రించడానికి ఏం చేయబోతుందనే ఆసక్తికరంగా మారింది. ఫిబ్రవరి 1 న కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో బంగారంపై తీసుకునే విధాన నిర్ణయాలు అత్యంత కీలకంగా మారాయి.
గత సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్లపై అంచనాల మధ్య ఈక్విటీ మార్కెట్లు ఎరుపు-ఆకుపచ్చ మధ్య ఊగిసలాడినా, బంగారం మాత్రం బలమైన ర్యాలీ కొనసాగించింది. 1979 తర్వాత తన ఉత్తమ వార్షిక పనితీరును నమోదు చేస్తూ.. 2025లో బంగారం భారతీయ కుటుంబాలకు అత్యంత ఇష్టమైన సురక్షిత ఆస్తిగా మారింది. US వడ్డీ రేటు కోతల అంచనాలు, బలహీనమైన డాలర్, సేఫ్-హేవెన్ డిమాండ్ కలిసి ధరలను ఆకాశానికి ఎత్తాయి. గత ఏడాది ప్రపంచ బంగారం ధరలు దాదాపు 67 శాతం పెరిగి.. డిసెంబర్ 26న ట్రాయ్ ఔన్సుకు 4,549.7 డాలర్ల చరిత్రాత్మక స్థాయికి చేరుకున్నాయి.

నివేదికల అంచనాల ప్రకారం.. భారతీయ గృహాల వద్ద దాదాపు 34,600 టన్నుల బంగారం ఉంది. దీని విలువ సుమారు 3.8 ట్రిలియన్ డాలర్లు. ఇది అమెరికా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్, రష్యా, చైనా వంటి దేశాల కేంద్ర బ్యాంకుల కలిపిన బంగారం నిల్వల కంటే ఎక్కువ. 1.4 బిలియన్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇది ఒక్కో వ్యక్తికి సగటున 25 గ్రాముల బంగారం ఉన్నట్టే. అందుకే బంగారం ధరల్లో చిన్న మార్పు కూడా దేశీయ ఆర్థిక వ్యవస్థపై పెద్ద ప్రభావం చూపిస్తుంది.
జూలై 2024లో ప్రభుత్వం బంగారంపై ప్రాథమిక కస్టమ్స్ సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించింది. ఈ నిర్ణయం అక్రమ రవాణాను తగ్గించడంతో పాటు, దేశీయ ధరలను కొంతకాలం నియంత్రించింది. అయితే ధరలు అంతర్జాతీయంగా వేగంగా పెరగడంతో, అక్రమ రవాణా మళ్లీ ఊపందుకుంది. కిలో Gold పై 6 శాతం దిగుమతి సుంకం, 3 శాతం అమ్మకపు పన్నును తప్పించుకోవడం ద్వారా స్మగ్లర్లకు రూ.11.5 లక్షలకుపైగా లాభం వస్తుండటంతో.. ఇది సూపర్ టెంప్టింగ్ గా మారిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
సుంకాల తగ్గింపుల ప్రభావం తాత్కాలికమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జూలై 2024లో జరిగిన సుంకం కోతతో దేశీయ ధరలు 5 శాతం తగ్గినా, అంతర్జాతీయ ర్యాలీ వల్ల త్వరలోనే 40 శాతం వరకు పెరిగాయి. ఫలితంగా 2025 ఆర్థిక సంవత్సరం రెండో భాగంలో Gold ఆభరణాల డిమాండ్ గణనీయంగా తగ్గింది. FY2026లో కూడా ధరలు అధికంగా ఉంటే, ఆభరణాల వినియోగం 20 శాతానికి పైగా తగ్గే అవకాశం ఉందని అంచనాలు చెబుతున్నాయి.
ఈ నేపథ్యంలో పరిశ్రమ వర్గాలు బడ్జెట్ 2026లో మరింత సుంకాల కోతలు, కస్టమ్స్ ప్రక్రియల సరళీకరణ, కారిగారులకు శిక్షణ, సాంకేతికత స్వీకరణ వంటి చర్యలను ఆశిస్తున్నాయి. అయితే, కరెంట్ అకౌంట్ లోటు, దిగుమతుల విలువ పెరుగుతున్న పరిస్థితుల్లో, ప్రభుత్వం భారీ సుంకాల కోతలకు వెళ్లే అవకాశాలు తక్కువేనని విశ్లేషకులు భావిస్తున్నారు.
More From GoodReturns

భారీగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు పెరుగుదలతో ఎంతకు చేరిందంటే.. మార్చి 25, బుధవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

బంగారం ధరలు కాస్త శాంతించాయి.. లక్షా యాభై వేల రూపాయల దిగువకు.. మార్చి 21, శనివారం ధరలు ఇవే..

కుప్పకూలిన బంగారం ధర.. 10 గ్రాములు ఏకంగా రూ. 5 వేలకు పైగా ఢమాల్.. కొనుగోలుపై నిపుణులు కీలక సూచన

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

భారీగా తగ్గిన బంగారం ధరలు .. భయపడి అమ్మేసుకుంటున్న పెట్టుబడిదారులు.. మార్చి 24, మంగళవారం ధరలు ఇవే.

కుప్పకూలిన బంగారం, వెండి ధరలు .. గంటల వ్యవధిలో 2 ట్రిలియన్ డాలర్లు ఆవిరి.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంతకు పడిపోయిందంటే.. మార్చి 23, సోమవారం ధరలు ఇవే..

బంగారం, వెండి ధరలు ఢమాల్.. గ్యాస్ ధరలు హడల్.. గ్లోబల్ మార్కెట్లో అసలేమి జరుగుతోంది..

భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు, కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం



Click it and Unblock the Notifications