Income Tax: రూ.15 లక్షల వరకు నో ఇన్కమ్ టాక్స్..! బడ్జెట్ 2025లో కీలక ప్రకటన..
Budget 2025: దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం స్థాయిలు ప్రజల ఆధాయాలను తినేస్తున్నాయి. ధరల భారంతో ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతున్న వేళ చాలా మంది కేంద్ర ప్రభుత్వంపై అదాయపుపన్ను తగ్గించాలనే ఒత్తిడి పెరుగుతోంది. గత ఆర్థిక సంవత్సరం సైతం చాలా మంది ఆదాపుపన్ను పరిమితులను పెంచాలని డిమాండ్ చేసినప్పటికీ అప్పట్లో ప్రభుత్వం ఊరటను అందించలేదు.
కానీ ప్రస్తుతం 2024 నేటితో ముగియనున్న వేళ దేశంలోని ఉద్యోగులు పన్ను మినహాయింపు ఆదాయ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. ఈ క్రమంలో మధ్యతరగతి ఆదాయవర్గాలకు చెందిన ప్రజలు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పై కోటి ఆశలతో ఉన్నారు. ఫిబ్రవరి 1, 2025న ఆమె తన వార్షిక బడ్జెట్ సమావేశాల్లో రూ.15 లక్షల వరకు ఆదాయాన్ని పన్నురహితంగా మార్చాలని కోరుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పటికే నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రభుత్వం కొత్త బడ్జెట్ సమావేశాల్లో దీనికి సంబంధించిన కీలక ప్రకటన ఉండవచ్చని చెబుతున్న సంగతి తెలిసిందే.

వాస్తవానికి దేశంలో ప్రజల కొనుగోలు శక్తిని పెంచటంతో పాటు ఆర్థిక వ్యవస్థ నెమ్మదించటాన్ని తిరిగి పునరుద్దరించేందుకు పన్నుల తగ్గింపులను ఆర్థిక వేత్తలు సైతం సమర్థిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వ బడ్జెట్లో ఆదాయపు పన్నుకు సంబంధించి తగ్గింపులను ప్రకటిస్తే లక్షల మంది పన్ను చెల్లింపుదారులకు ఇది పెద్ద ప్రయోజనాన్ని అందిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం దేశంలో రెండు టాక్స్ విధానాలు అందుబాటులో ఉన్నాయి. ముందుగా ఓల్డ్ టాక్స్ రీజిమ్ ప్రకారం ప్రజలకు అనేక పన్ను మినహాయింపులు ఇప్పటికీ అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ప్రభుత్వం కొత్త టాక్స్ రీజిమ్ అందుబాటులోకి తీసుకురావటంతో పాటు దానిని డీఫాల్ట్ ట్యాక్స్ విధానంగా మార్చింది. ఇందుల్లో పన్ను శ్లాబ్ రేట్లు కొంత ఊరటను అందిస్తున్నప్పటికీ చాలా వరకు మినహాయింపులను ప్రభుత్వం తొలగించింది.
2020లో అమలు చేయబడిన కొత్త పన్ను విధానంలో సంవత్సరానికి రూ.3 లక్షల వరకు సంపాదించే వ్యక్తులు ఆదాయపు పన్ను నుండి మినహాయించబడ్డారు.రూ.3-7 లక్షల మధ్య ఆదాయం 5% పన్నుకు లోబడి ఉంటుంది. ఆదాయం రూ.7-10 లక్షలపై 10 శాతం, రూ.10-12 లక్షల వరకు ఆదాయంపై 15 శాతం పన్ను రేటును ప్రభుత్వం ప్రకటించింది. అలాగే రూ.12-15 లక్షల వరకు ఆదాయంపై 20శాతం ఆపై వచ్చే ఆదాయంపై ఏకంగా 30 శాతం వరకు పన్ను రేటు వసూలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశంలో చాలా మంది కొత్త టాక్స్ రీజిమ్ కిందకు మారాలని ప్రభుత్వం కొరుకుటోంది. దీనికింద చాలా తక్కువ మినహాయింపులు ఉండటంతో పాటు ఎక్కువ మంది సులభతరంగా టాక్స్ చెల్లింపులకు అంగీకరిస్తారని ప్రభుత్వం భావిస్తోంది.


Click it and Unblock the Notifications