కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1, 2022, మంగళవారం 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ వైపు యావత్ దేశం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్స్, డెస్క్ టాప్ కంప్యూటర్లతో పాటు ఫ్రిజ్, టీవీ, ఏసీ వంటి గృహోపకరణాలు నిత్యకృత్యమయ్యాయి. ఇండియన్ మేడ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పైన తగ్గింపు దిశగా బడ్జెట్‌లో ఊరట లభించవచ్చునని భావిస్తున్నారు. అలాగే, విడిభాగాల దిగుమతులపై సుంకాలు తగ్గించాలని కోరుతోంది పరిశ్రమ.

మరింత అండ...
మొబైల్ హ్యాండ్‌సెట్ ఇండస్ట్రీ ధరల పెరుగుదల ఇబ్బందులను ఎదుర్కొంటోంది. గత సంవత్సరం సగటు విక్రయ ధర (యావరేజ్ సెల్లింగ్ ప్రైస్) రూ.14,600 కాగా, ప్రస్తుతం 17,800కు పెరిగింది. ఈ సంవత్సరం మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైనా తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హ్యాండ్ సెట్ మార్కెట్ భారత్‌ది.
హ్యాండ్ సెట్ మార్కెట్‌లో షియోమీ, వివో, ఒప్పో, రియల్‌మి, శాంసంగ్ టాప్ 5లో ఉన్నాయి. 350 నుండి 400 మిలియన్ల ఫీచర్ ఫోన్ యూజర్లు స్మార్ట్ ఫోన్‌లకు మరలే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్థానిక మొబైల్ ఫోన్ అసెంబ్లీ క్రమంగా పుంజుకుంటోంది. ఇందుకు ప్రభుత్వం అందించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ (PLI) దోహదపడింది. మొబైల్ పరిశ్రమ ఎగుమతులు, మరింత మద్దతును కూడా ఆశిస్తోంది ఈ బడ్జెట్‌లో.

పరిశ్రమ రికమండేషన్స్
PLI పథకం కింద దరఖాస్తు చేసుకుంటే క్రెడిట్ గ్యారెంటీ కింద రూ.1000 కోట్ల వరకు డొమెస్టిక్ కంపెనీలకు అందించాలి.
మొబైల్ ఫోన్ల పైన జీఎస్టీని 18 శాతం నుండి 12 శాతానికి తగ్గించాలి.
హై-ఎండ్ ఫోన్స్ పైన 20 శాతం కస్టమ్ డ్యూటీని కొనసాగిస్తూనే, ఒక్కో డివైజ్ పైన గరిష్టంగా రూ.4000 ఉండేలా చూడాలి.
PLI స్కీం విస్తరణ ద్వారా ఫ్యాబ్స్, వేరబుల్స్, పీసీబీఏ మ్యానుఫ్యాక్చరింగ్ బూస్టింగ్‌కు ఉపయోగపడుతుంది.
కాంపిటీటివ్ ఎగుమతుల కోసం టారిఫ్ రేషనలైజేషన్ అవసరం.

దిగుమతి సుంకం
ఆడియో డివైజ్, వేరబుల్స్(స్మార్ట్ వాచీలు, స్మార్ట్ బాండ్స్) పైన దిగుమతి సుంకం తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎగుమతుల ప్రోత్సహించేందుకు నిర్మలమ్మ నుండి ఈ ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. దేశీయంగా ఉత్పత్తి చేసిన స్మార్ట్ ఫోన్స్ విదేశాలకు విజయవంతంగా ఎగుమతి చేసేందుకు విడి భాగాల దిగుమతి సుంకం తగ్గింపు అంశాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
బ్యాటరీ ప్యాక్స్, చార్జర్స్, యూఎస్బీ కేబుల్స్, కనెక్టర్లు, ఇండక్టివ్ కాయిల్స్, మ్యాగ్నటిక్స్, ఫ్లెక్సిబుల్ పీసీబీఎస్ దేశీయంగా ఉత్పత్తి చేయడమే లక్ష్యం. 2026 నాటికి 300 బిలియన్ డాలర్ల ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ పవర్ హౌస్‌గా తీర్చిదిద్దాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం 75 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తి అవుతోంది.
More From GoodReturns

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్‌లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications