ముంబై: బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ఉధయం 11 గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. ఈ దశాబ్దానికి పార్లమెంటు తొలి సెషన్ ఈ రోజు ప్రారంభమైందని, దేశ అత్యుత్తమ భవిష్యత్తుకు ఈ దశాబ్దం ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. అనంతరం కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను ప్రవేశ పెడుతున్నారు. నిర్మలమ్మ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు.
4:32 PM
Feb 1, 2021
అగ్రి ఇన్ఫ్రా సెస్‌తో చమురు ఉత్పత్తుల ధరల్లో మార్పు ఏమీ ఉండదని కేంద్రం కూడా స్పష్టం చేసింది.
4:22 PM
Feb 1, 2021
అగ్రిసెస్‌తో పెట్రోల్, డీజిల్ ధరలపై ఎలాంటి ప్రభావం ఉండదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
4:17 PM
Feb 1, 2021
మోనిటైజేషన్ ప్లాన్‌తో జాతికి చెందిన ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారని దుయ్యబట్టారని రాహుల్ గాంధీ అన్నారు.
4:16 PM
Feb 1, 2021
కేంద్ర బడ్జెట్ పైన రాహుల్ గాంధీ పెదవి విరిచారు.
4:02 PM
Feb 1, 2021
తెలంగాణకు బడ్జెట్‌లో ఏమీ రాలేదని రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలు చెబుతుండగా, ఏపీకి ఏం రాలేదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ, టీడీపీ నేతలు పెదవి విరుస్తున్నారు.
3:58 PM
Feb 1, 2021
కరోనా సమయంలో వైద్య పరీక్షలకు సౌకర్యాలు లేక ఇబ్బందులు ఏర్పడ్డాయని, ఈ బడ్జెట్లో ల్యాబ్స్, వైరాలజీ సంస్థల ద్వారా మౌలిక వసతులు కల్పిస్తామన్నారు.
3:30 PM
Feb 1, 2021
బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు నిర్మలా సీతారామన్ అన్నారు. వైద్య, ఆరోగ్య రంగాలకు రంగంపై ఈ బడ్జెట్‌లో ఎక్కువగా దృష్టి సారించామన్నారు.
3:12 PM
Feb 1, 2021
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ సామాన్యుడికి అండగా నిలిచేలా ఉందని, అన్ని వర్గాలకు సంతృప్తికలిగేలా, పారదర్శకతతో బడ్జెట్‌ను ప్రవేశ పెట్టినట్లు మోడీ తెలిపారు.
3:00 PM
Feb 1, 2021
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించామని, అన్ని వర్గాలకు నిర్మలమ్మ చేయూతనిచ్చారని ప్రధాని అన్నారు.
2:59 PM
Feb 1, 2021
బడ్జెట్‌లో మౌలిక వసతులకు పెద్దపీట వేసినట్లు ప్రధాని మోడీ తెలిపారు.
2:56 PM
Feb 1, 2021
బడ్జెట్ పైన ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు.
2:50 PM
Feb 1, 2021
ఐరన్, స్టీల్ ధర తగ్గాయి. నైలాన్ క్లాత్స్ ధరలు తగ్గనున్నాయి. కాపర్ వస్తువులు, సాధారణ షూ ధరలు, డ్రై క్లీనింగ్, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు కూడా దిగిరానున్నాయి. వెండి, బంగారం ధరలు తగ్గుతాయి.
2:49 PM
Feb 1, 2021
2021 బడ్జెట్ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు పెరగనున్నాయి. మొబైల్ ఫోన్స్, చార్జర్ల ధరలకు రెక్కలు రానున్నాయి. వినియోగదారుల అవసరాన్ని బట్టి మొబైల్ ధరలు పెరుగుతుంటాయి. ఈ సారి పద్దు ద్వారా కూడా పెరుగుతున్నాయి. రత్నాలు, లెదర్ షూ ధరలు పెరగనున్నాయి. కాబులీ చానా, పప్పులు, యూరియా, ఆటో స్పెర్ పార్ట్స్ ధరలకు రెక్కలు రానున్నాయి. దిగుమతి చేసుకున్న క్లాత్స్, వంట నూనే, ఆటో పార్ట్స్ ధరలు పెరుగుతున్నాయి.
2:33 PM
Feb 1, 2021
లిక్కర్ రేట్లు పెరగనున్నాయి.
2:21 PM
Feb 1, 2021
బీమా రంగంలో 74 శాతం FDIకి పెంపు
2:17 PM
Feb 1, 2021
పెట్రోల్ ధరలు పలు నగరాల్లో రూ.100 పైకి చేరుకుంది.
2:04 PM
Feb 1, 2021
కరోనాను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పథకాలతో ఇన్వెస్టర్లు సంతృప్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా, నిఫ్టీ 560 పాయింట్లకు పైగా కదలాడింది.
1:50 PM
Feb 1, 2021
మద్యం ఉత్పత్తులపై 100%, ముడి పామాయిల్ పైన 17.5% సోయాబిన్, పొద్దు తిరుగుడు ముడి నూనెపై 20% అగ్రిఇన్‌ఫ్రా సెస్ ప్రకటించారు.
1:45 PM
Feb 1, 2021
స్థూల జాతీయోత్పత్తిలో 9.5 శాతం లోటు నెలకొందని, దీన్ని అందుకోవడానికి రుణాలను తీసుకోవడం తప్పనిసరి అన్నారు. 2021-2022 ఆర్థిక సంవత్సరానికి స్థూల జాతీయోత్పత్తిలో ఈ ద్రవ్యలోటు 6.8 శాతంగా నమోదవుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
1:37 PM
Feb 1, 2021
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి నాటికి.. 12 నెలల కాలంలో రూ.12 లక్షల కోట్ల మేర అప్పులు తీసుకోవాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
1:36 PM
Feb 1, 2021
ఈ రెండు నెలల కాలానికి వేల కోట్ల రూపాయల మేర రుణాలు తీసుకోనున్నట్లు నిర్మలమ్మ తెలిపారు.
1:35 PM
Feb 1, 2021
బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు మొండి చేయి చూపారని వైసీపీ రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
1:32 PM
Feb 1, 2021
రైల్వేలకు రూ.1.10 లక్షల కోట్లు కేటాయించారు. విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు. ఆరోగ్య రంగానికి మొత్తం రూ.2 లక్షల కోట్లు, అర్బన్ స్వచ్చ భారత్‌కు రూ.1.41 లక్షల కోట్లు.
1:29 PM
Feb 1, 2021
నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీగా జంప్ చేశాయి. మధ్యాహ్నం గం.1.30 సమయానికి సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లకు పైగా, నిఫ్టీ 500 పాయింట్లకు పైగా లాభపడింది.
1:16 PM
Feb 1, 2021
పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరగనున్నాయి. లీటర్ పెట్రోల్ పైన రూ.2.50 సెస్, లీటర్ డీజిల్ పైన రూ.4 వ్యవసాయ సెస్ విధిస్తున్నారు.
1:06 PM
Feb 1, 2021
గతంలో ఉన్న విధంగానే ఆదాయపు పన్ను శ్లాబులు కొనసాగనున్నాయి.
12:57 PM
Feb 1, 2021
ఆదాయపు పన్ను స్లాబ్స్‌లో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మార్పులు చేయలేదు. ఐటీ స్లాబ్స్‌ను యథాతథంగా ఉంచారు.
12:54 PM
Feb 1, 2021
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకాన్ని మరో ఏడాది పొడిగించారు. 31 మార్చి 2022 వరకూ ఇళ్లకొనుగోలుపై రాయితీ ఇస్తున్నట్లు తెలిపారు.
12:52 PM
Feb 1, 2021
ఇంపోర్టెడ్ దుస్తుల ధరలు పెరగనున్నాయి.
12:51 PM
Feb 1, 2021
బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.
కార్ల విడిభాగాల ధరలు పెరగనున్నాయి.
మొబైల్ రేట్లు పెరిగే అవకాశం.
నైలాన్ దుస్తుల ధరలు తగ్గవచ్చు.
సోలారన్ ఇన్వెస్టర్లపై పన్ను పెంపు
12:47 PM
Feb 1, 2021
సామాజిక భద్రత పథకాల్లోకి వీధి వ్యాపారులను తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు.
12:41 PM
Feb 1, 2021
పెన్షన్ పైన మాత్రమే ఆధారపడే సీనియర్ సిటిజన్లకు రిటర్న్ ఫైలింగ్ నుండి మినహాయిస్తున్నట్లు తెలిపారు
12:36 PM
Feb 1, 2021
ఎన్నారైలకు డబుల్ ట్యాక్సేషన్ నుండి ఊరట
12:35 PM
Feb 1, 2021
పన్ను చెల్లింపు దారుల కోసం వివాద పరిష్కార కమిటీ ఏర్పాటు
12:29 PM
Feb 1, 2021
డిజిటల్ జనాభా లెక్కింపు కోసం రూ.3.726 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్థికమంత్రి ప్రకటించారు.
12:29 PM
Feb 1, 2021
వన్ నేషన్ - వన్ రేషన్ కింద 69 కోట్ల మంది లేదా 86 శాతం మంది లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.
12:26 PM
Feb 1, 2021
భవన నిర్మాణ కార్మికుల కోసం పోర్టల్
12:25 PM
Feb 1, 2021
ఎయిరిండియా, బీపీసీఎల్, ఎస్సీఐ, సీసీఐ, ఐడీబీఐ, బీఈఎంఎల్ సంస్థల ప్రయివేటీకరణపై ప్రకటన చేశారు నిర్మలమ్మ.
12:25 PM
Feb 1, 2021
ఎల్ఐసీ ఐపీవో 2022లో రానుంది.
12:22 PM
Feb 1, 2021
లేహ్‌లో సెంట్రల్ యూనివర్సిటీ.
12:19 PM
Feb 1, 2021
బ్యాంకు రీక్యాపిటలైజేషన్ కోసం రూ.20వేలకోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.
12:18 PM
Feb 1, 2021
రూ.5లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యం చేరాలంటే రెండంకెల వృద్ధి ఉండాలి.
12:18 PM
Feb 1, 2021
కొత్త ప్రాజెక్టుల కోసం ప్రస్తుత ప్రాజెక్టుల్లో పెట్టుబడుల ఉపసంహరణ.
12:18 PM
Feb 1, 2021
రూ.50 లక్షల నుంచి రూ.2 కోట్ల పెట్టుబడి పరిమితి వరకు చిన్న సంస్థలుగా గుర్తింపు.
12:16 PM
Feb 1, 2021
వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధరను ప్రకటించారు. ఉత్పత్తి కంటే 1.5 రెట్లు ప్రకటించారు.
12:15 PM
Feb 1, 2021
కొత్తగా మరో 750 ఏకల్య స్కూల్స్ ఏర్పాటు.
12:15 PM
Feb 1, 2021
32 రాష్ట్రాల్లో వన్ నేషన్, వన్ రేషన్ కార్డు ఏర్పాటు.
రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. వ్యవసాయ ఉత్పత్తులు భారీగా పెరిగాయి.
12:04 PM
Feb 1, 2021
రెగ్యులేటర్ గోల్డ్ ఎక్స్ఛేంజీల ఏర్పాటు. ఇన్వెస్టర్ చార్టర్ ద్వారా పెట్టుబడిదారుల ప్రయోజనాల పరిరక్షణ.
12:03 PM
Feb 1, 2021
ఎన్పీఏలు, మొండి బకాయిలు బ్యాడ్ బ్యాంకుకు తరలింపు.
12:02 PM
Feb 1, 2021
2021-22 ఆర్థిక సంవత్సరానికి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం రూ.1.75 లక్షల కోట్లు.
12:01 PM
Feb 1, 2021
బ్యాంకుల ఖాతాలను సజావుగా నిర్వహించే చర్యలు
12:01 PM
Feb 1, 2021
బ్యాడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం.
12:01 PM
Feb 1, 2021
బీమారంగంలో FDIలు 49శాతం నుంచి 74 శాతానికి పెంపు. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థలో సంస్కరణలు. 1938 బీమా చట్టానికి సవరణ. డిపాజిట్లపై బీమా పెంపు ఉంటుంది.
12:00 PM
Feb 1, 2021
ఈ ఏడాది ఐడీబీఐలో పెట్టుబడుల ఉపసంహరణ
11:53 AM
Feb 1, 2021
వచ్చే మూడేళ్లలో ఇంటింటికి గ్యాస్ సరఫరా అందించడం లక్ష్యం. జమ్ము కాశ్మీర్‌లో గ్యాస్ పైప్ లైన్. కోటి మందికి ఉజ్వల సాయం.
11:52 AM
Feb 1, 2021
విద్యుత్ పంపిణీ రంగంలో మరిన్ని పంపిణీ సంస్థలు. రూ.3,05,984 కోట్లతో డిస్కంలకు సాయం. హైడ్రోజన్ ఎనర్జీపై దృష్టి సారించనున్నట్లు తెలిపారు. ఇండియన్ షిప్పింగ్ కంపెనీకి రూ.1624 కోట్లు. నౌకల రీసైక్లింగ్ సామర్థ్యం పెంపు.
11:51 AM
Feb 1, 2021
సౌర రంగానికి రూ.1000 కోట్లు.
11:47 AM
Feb 1, 2021
విద్యుత్ రంగానికి రూ.3.05 లక్షల కోట్లు
11:47 AM
Feb 1, 2021
చెన్నై మెట్రో రైలుకు రూ.63,246 కోట్లు, బెంగళూరు మెట్రోకు రూ.14,788 కోట్లు కేటాయించారు. కొచ్చి మెట్రో రెండే దశకు కేంద్రం సాయం అందించనుంది.
11:46 AM
Feb 1, 2021
భారత్ 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా ఎదగాలంటే నిర్మాణ రంగం పుంజుకోవాలని నిర్మలమ్మ అన్నారు.
11:45 AM
Feb 1, 2021
పశ్చిమ బెంగాల్‌లో రూ.25వేల కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు. అసోంలో రోడ్ల అభివృద్ధికి రూ.19వేల కోట్లు, కోల్‌కతా-సిలిగురి రహదారి విస్తరణకు నిధులు.
11:45 AM
Feb 1, 2021
అయిదు ప్రత్యేక జాతీయ రహదారుల అభివృద్ధికి రూ.5వేల కోట్లు కేటాయించారు. 11వేల కిలో మీటర్ల జాతీయ రహదారుల కారిడార్ నిర్మాణాన్ని ఈ బడ్జెట్‌లో ప్రకటించారు.
11:42 AM
Feb 1, 2021
రైల్వే మౌలిక సౌకర్యాలకు రూ.1,01,055 కోట్లు. 2023 కల్లా విద్యుదీకరణ పూర్తి చేస్తామన్నారు.
11:42 AM
Feb 1, 2021
ఈ కారిడార్‌లో భాగంగా ఖరగ్ పూర్-విజయవాడ మధ్య ఈస్ట్-కోస్ట్‌కు సరకు రవాణా కారిడార్‌ను ఏర్పాటు చేయనున్నారు.
11:41 AM
Feb 1, 2021
2022 జూన్ నాటికి తూర్పు, పశ్చిమ ప్రత్యేక సరకు రవాణా కారిడార్లు అందులోకి తెస్తామని నిర్మలమ్మ ప్రకటించారు.
11:38 AM
Feb 1, 2021
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచానికి భారత్ ఆశాకిరణంలా కనిపిస్తోంది.
11:38 AM
Feb 1, 2021
మరో రెండు వ్యాక్సీన్లు రాబోతున్నాయి. ఆర్థిక రికవరీ వేగంగా ఉంది.
11:36 AM
Feb 1, 2021
ప్రతి జిల్లాలో సమగ్ర హెల్త్ ల్యాబ్స్
11:36 AM
Feb 1, 2021
వాయు కాలుష్యం నివారణకు రూ.2,217 కోట్లు.
11:36 AM
Feb 1, 2021
భారత్‌తో పాటు మరో వంద దేశాలకు వ్యాక్సిన్ అందిస్తున్నాం. దేశంలో మరో 4 ప్రాంతీయ వైరల్ ల్యాబ్స్ ఏర్పాటు.
11:32 AM
Feb 1, 2021
రహదారుల కోసం న్యూఎకనమిక్ ఆర్థిక కారిడార్లు.
11:32 AM
Feb 1, 2021
క్యాపిటల్ వ్యయానికి రూ.5.54 లక్షల కోట్లు.
11:32 AM
Feb 1, 2021
జలజీవన్ మిషన్‌కు రూ.2.87 లక్షల కోట్లు.
11:31 AM
Feb 1, 2021
అర్బన్ క్లీన్ ఇండియా మిషన్ రూ.1.41 లక్షల కోట్లు
11:29 AM
Feb 1, 2021
వ్యవసాయ ఆదాయాలను రెట్టింపు చేసే పథకాలు. హెల్త్ కేర్‌కు రూ.2 లక్షల కోట్లు.
11:29 AM
Feb 1, 2021
త్వరలో మెగా ఇండస్ట్రియల్ టెక్స్ టైల్ పార్క్.
11:29 AM
Feb 1, 2021
స్వచ్ఛ భారత్, స్వస్థ భారత్ ఈ బడ్జెట్ లక్ష్యాలు
11:29 AM
Feb 1, 2021
20 ఏళ్లు దాటిన వాహనాలకు ఫిట్ నెస్ టెస్టులు.
రక్షిత మంచి నీటి పథకానికి రూ.87వేల కోట్లు.
11:27 AM
Feb 1, 2021
కరోనా నేపథ్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆరోగ్య రంగానికి ఈ బడ్జెట్‌లో పెద్ద పీట వేసింది. ఆరోగ్య రంగానికి రూ.64,180 కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీఎం ఆత్మనిర్భర్ భారత్ స్వస్థ్ యోజనకు శ్రీకారం చుడుతున్నామన్నారు. దీనికి రూ.64వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. గత ఏడాదితో పోలిస్తే 137 శాతం అధికంగా కేటాయించడం గమనార్హం.
11:22 AM
Feb 1, 2021
కరోనా వ్యాక్సీన్ కోసం రూ.33వేల కోట్ల నిధులు కేటాయించామని, అవసరమైతే మరిన్ని కేటాయిస్తామన్నారు.
11:20 AM
Feb 1, 2021
ఆరు మూలస్థంబాల మీద బడ్జెట్‌ను రూపొందించినట్లు తెలిపారు. ఆస్ట్రేలియాలో టీమిండియా గెలిచినట్లు ఆర్థికరంగం పుంజుకుంటుందన్నారు.
11:16 AM
Feb 1, 2021
పీఎం ఆత్మనిర్భర్ భారత్ స్వస్థ్ యోజనకు శ్రీకారం చుడుతున్నట్లు నిర్మలమ్మ తెలిపారు. దీనికి రూ.64వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
11:13 AM
Feb 1, 2021
అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో బడ్జెట్‌ను రూపొందించినట్లు ఆర్థికమంత్రి తెలిపారు.
11:12 AM
Feb 1, 2021
కరోనా కారణంగా ప్రభుత్వం, ఆర్బీఐ ప్రకటించిన రూ.27.1 లక్షల కోట్ల ప్యాకేజీ జీడీపీలో 13 శాతమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
11:06 AM
Feb 1, 2021
దశాబ్దాలలోనే ఇది కీలకమైన బడ్జెట్. నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆమె ప్రసంగం ప్రారంభమైంది.
10:59 AM
Feb 1, 2021
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ తెలిపింది.
10:54 AM
Feb 1, 2021
కాసేపట్లో ఆర్థకమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
10:45 AM
Feb 1, 2021
రాహుల్ గాంధీ బడ్జెట్ పైన ట్వీట్ చేశారు. రైతులు, ఎంఎస్ఎంఈలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.
10:41 AM
Feb 1, 2021
కేంద్ర కేబినెట్ భేటీ ప్రారంభమైంది.
10:40 AM
Feb 1, 2021
నిర్మలమ్మ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కరోనా తర్వాత ఆర్థిక వృద్ధి మెరుగ్గా కనిపించినప్పటికీ దేశంలో ఉపాధి ఇంకా కరోనా ముందుస్థాయికి చేరుకోలేదు. నిరుద్యోగాలు పెరుగుతున్నాయని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ(CMIE) తెలిపింది. డిమాండ్ భారీగా క్షీణించిందని, వినియోగం పెంచే చర్యలు తీసుకోవాల్సి ఉంది. కీలకమైన వృద్ధి కేంద్రీకృత రంగాలలో పెట్టుబడులను పెంచడం మరో అంశం. నిర్మలమ్మ ముందు ఇలా పలు సవాళ్లు ఉన్నాయి.
10:19 AM
Feb 1, 2021
ఇటీవలి కాలంలోనే ఇది అత్యంత క్లిష్టమైన బడ్జెట్ అని మార్కెట్ నిపుణులు అన్నారు.
10:01 AM
Feb 1, 2021
2020-21 బడ్జెట్ ప్రజల అంచనాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
9:59 AM
Feb 1, 2021
Finance Minister @nsitharaman, MoS Finance & Corporate Affairs @ianuragthakur, and senior officials of the Ministry of Finance, called on President Kovind at Rashtrapati Bhavan before presenting the Union Budget 2021-22. pic.twitter.com/FUNptDXnHB
నిర్మలా సీతారామన్ 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు.
9:15 AM
Feb 1, 2021
బడ్జెట్‌కు ముందు జీఎస్టీ వసూళ్లు సానుకూలంగా ఉన్నాయి. జనవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.20 లక్షల కోట్లుగా నమోదయింది. జీఎస్టీ వసూళ్లలో ఇప్పటి వరకు ఇదే అత్యధికం.
9:11 AM
Feb 1, 2021
అన్ని వర్గాలు, అన్ని రంగాలకు అనుకూలంగా బడ్జెట్ ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
9:09 AM
Feb 1, 2021
బ్యాంకింగ్ రంగంలో అత్యవసరంగా సంస్కరణలు అవసరం.
9:09 AM
Feb 1, 2021
ఈ బడ్జెట్లో రుణాలపై మారటోరియంతో పాటు ఆర్బీఐ ద్రవ్య పరపతి విధానం, రుణాల పునర్వ్యవస్థీకరణ, ఆర్థిక రంగానికి ఉన్న అవరోధాలను అధిగమించాలి. ఆరోగ్య మౌలిక వసతుల పైన దృష్టి పెట్టాల్సి ఉంది.
9:06 AM
Feb 1, 2021
ప్రజల అంచనాలు, ఆశలకు అనుగుణంగా బడ్జెట్ ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు.
ఆర్థికమంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చిన నిర్మలా సీతారామన్
8:43 AM
Feb 1, 2021
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎదుట అనేక సవాళ్లు ఉన్నాయి. కరోనా కారణంగా సాధారణ బడ్జెట్ కంటే భిన్నంగా, క్లిష్ట పరిస్థితుల్లో బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు. నిర్మలమ్మ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి.
8:34 AM
Feb 1, 2021
గత పదేళ్లలో బడ్జెట్‌కు ముందు, బడ్జెట్ రోజున మార్కెట్లు ఎక్కువసార్లు నష్టపోయాయి.
8:25 AM
Feb 1, 2021
బడ్జెట్‌కు ముందు గత ఆరు సెషన్లలో మార్కెట్లు వరుసగా నష్టాల్లోకి వెళ్లి, దిద్దుబాటుకు గురయ్యాయి.
8:25 AM
Feb 1, 2021
కరోనా నేపథ్యంలో వివిధ రంగాలకు ఊరటనిచ్చే ఉద్దేశ్యంలో భాగంగా రియాల్టీ రంగానికి కూడా ప్రోత్సాహకాలు ఉండవచ్చు.
8:08 AM
Feb 1, 2021
భారత జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మైనస్ 7.7 శాతానికి పడిపోనుందని అంచనా వేస్తున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021-22) 11 శాతంగా ఉంటుందని అంచనా.
8:02 AM
Feb 1, 2021
కరోనా నేపథ్యంలో స్వతంత్ర భారతంలోనే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ అతి క్లిష్టమైన బడ్జెట్‌ను ప్రవేశ పెడుతున్నారు
7:53 AM
Feb 1, 2021
రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిని రూ.8 వేలకు పెంచే అవకాశముంది. చమురు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం తగ్గించవచ్చు. తయారీరంగ ప్రోత్సాహకాలు ఉంటాయి.
7:52 AM
Feb 1, 2021
ఆదాయ పరిమితి పెంపుపై వేతనజీవులకు ఊరట ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. గరిష్ట పన్ను స్లాబ్స్‌లోని వారికి కరోనా సెస్ ఉండవచ్చు.
7:51 AM
Feb 1, 2021
ఈసారి ఆరోగ్య రంగానికి భారీ కేటాయింపులు ఉండే అవకాశాలు ఉన్నాయి.
7:50 AM
Feb 1, 2021
ఈ యాప్ ద్వారా మొత్తం 14 పేజీల కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల యాక్సెస్ యూజర్లకు లభిస్తుంది. బడ్జెట్ వివరాలు, కేటాయింపులు, గ్రాంట్లు, ఆర్థిక బిల్లు.. ఇవన్నీ చూడొచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషల్లో బడ్జెట్ డాక్యుమెంట్లను ఇందులో పొందుపరుస్తారు.
7:50 AM
Feb 1, 2021
Union Budget 2021 appను గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లు దీన్ని తమ మొబైల్ ఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీనితో పాటు https://www.indiabudget.gov.in అనే వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
7:49 AM
Feb 1, 2021
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పేపర్ లెస్ బడ్జెట్‌ను రూపొందించారు. బడ్జెట్ ప్రతిపాదనల గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్తగా మొబైల్ యాప్‌ను రూపొందించింది.
7:41 AM
Feb 1, 2021
2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
7:31 AM
Feb 1, 2021
కరోనా నేపథ్యంలో ఈ బడ్జెట్ పైన వివిధ రంగాలు, వివిధ వర్గాలు ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి.
7:08 AM
Feb 1, 2021
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను సమర్పిస్తారు.
9:12 PM
Jan 30, 2021
రేటింగ్ ఏజెన్సీలు భారత్ విషయంలో మరింత పారదర్శకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎకనమిక్ సర్వే పేర్కొంది. భారత ఆర్థిక వ్యవస్థ మూలాలను సార్వభౌమ రేటింగ్ ప్రతిఫలించడం లేదని, ఇంత వరకు ఒక్క డిఫాల్ట్ రేటింగ్ లేని విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించింది.
9:11 PM
Jan 30, 2021
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి ప్రవేశ పెట్టే బడ్జెట్ ఆర్థిక వ్యవస్థకు వ్యాక్సీన్‌గా ఉంటుందని ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) శనివారం తెలిపింది.
10:24 PM
Jan 29, 2021
ప్రమాదంలో ఉన్న ప్రమాణాన్ని కాపాడటం ధర్మానికి మూలధారమని మహాభారతం చెబుతోందని, ఈ మానవీయ సిద్ధాంతం నుండే కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో భారత ఆర్థిక విధానాలు రూపొందుతున్నాయని CEA తెలిపారు.
10:23 PM
Jan 29, 2021
భారత ఆర్థిక వ్యవస్థ V షేప్ రికవరీ కనిపిస్తోందని చీఫ్ ఎకనమిస్ట్ అడ్వైజర్ (CEA) కృష్ణమూర్తి సుబ్రమణియన్ చెప్పారు.
3:11 PM
Jan 29, 2021
ఆర్థిక వృద్ధికి మరింత చురుకైన చర్యలు తీసుకోవాలని ఎకనమిక్ సర్వే తెలిపింది.
2:37 PM
Jan 29, 2021
ప్రయివేటు రైళ్లను 2023.-24లో ప్రవేశ పెట్టే అవకాశముంది.
2:36 PM
Jan 29, 2021
ప్రయివేటు రైళ్ళ బిడ్డింగ్ మే 2021 నాటికి పూర్తవుతుంది.
2:36 PM
Jan 29, 2021
విమాన ప్రయాణాలు 2021 ప్రారంభంలో కరోనా పూర్వస్థాయికి చేరుకుంటాయని అంచనా.
2:21 PM
Jan 29, 2021
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ 11.5 శాతంగా ఉండవచ్చునని ఆర్థిక సర్వే పేర్కొంది.
2:21 PM
Jan 29, 2021
చీఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణియన్ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్నారు.
2:19 PM
Jan 29, 2021
నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం రాజ్యసభలో ఎకనమిక్ సర్వేను ప్రవేశ పెడతారు.
2:19 PM
Jan 29, 2021
అనంతరం లోకసభను సోమవారం (ఫిబ్రవరి 1)కి వాయిదా వేశారు. ఆ రోజు బడ్జెట్‌ను ప్రవేశ పెడతారు.
2:18 PM
Jan 29, 2021
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వేను లోకసభలో ప్రవేశ పెట్టారు.
2:16 PM
Jan 29, 2021
ఐఎంఎఫ్ ప్రకారం వచ్చే రెండేళ్లలో భారత్ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది.
2:14 PM
Jan 29, 2021
2021-22లో భారత రియల్ జీడీపీ 11.5 శాతంగా ఉంటుందని ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంచనా వేసింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 6.8 శాతంగా అంచనా వేసింది.
2:05 PM
Jan 29, 2021
ఆరోగ్య సంరక్షణ మార్కెట్ నిర్మాణాన్ని చురుగ్గా రూపొందించడంలో ప్రభుత్వానిది ముఖ్య పాత్ర.
2:04 PM
Jan 29, 2021
2020-21లో భారత జీడీపీ మైనస్ 7.7 శాతంగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. రియల్ జీడీపీ 11 శాతంగా, నామినల్ జీడీపీ 15.4 శాతంగా అంచనా వేస్తున్నారు.
2:01 PM
Jan 29, 2021
సావరీన్ క్రెడిట్ రేటింగ్ పద్ధతి మరింత పారదర్శకంగా, మరింత పారదర్శకత అవసరం.
1:58 PM
Jan 29, 2021
భారత సావరీన్ క్రెడిట్ రేటింగ్ ఫండమెంటల్స్‌ను ప్రతిబింబించదు.
1:52 PM
Jan 29, 2021
2021-22లో భారత రియల్ జీడీపీ 11 శాతం పెరుగుతుంది. కరోనా నుండి వేగంగా కోలుకుంటున్న దేశాల్లో ఒకటిగా ఉంది.
1:46 PM
Jan 29, 2021
FY21లో కరెంట్ అకౌంట్ సర్‌ప్లస్ జీడీపీలో 2 శాతంగా ఉంటుంది.
1:45 PM
Jan 29, 2021
భారత ఆర్థిక వ్యవస్థ వీ షేప్‌లో రికవరీ సాధిస్తుంది.
1:42 PM
Jan 29, 2021
FY22లో వృద్ధి రేటు 11 శాతంగా ఉంటుందని అంచనా.
1:42 PM
Jan 29, 2021
ప్రభుత్వ వినియోగం, నికర ఎగుమతులు తగ్గడం వృద్ధిని మరింత తగ్గించాయి.
1:41 PM
Jan 29, 2021
ఎకనమిక్ సర్వేలోని మరిన్ని అంశాలు.. కరోనా సమమయంలో వ్యవసాయం మాత్రమే ఆశాజనకంగా ఉన్నట్లు ఎకనమిక్ సర్వే తెలిపింది. కాంటాక్ట్ బేస్డ్ సేవలు, తయారీ, నిర్మాణ రంగాలు మాత్రం కరోనా వల్ల దెబ్బతిన్నాయి.
1:31 PM
Jan 29, 2021
నిర్మలమ్మ సభలో ఆర్థిక సర్వేను ప్రవేశ పెట్టారు. దీని ప్రకారం 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చు.
1:28 PM
Jan 29, 2021
ఈసారి రైల్వేల్లో భద్రతకోసం ప్రభుత్వం సరికొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టే అవకాశాలు ఉన్నాయి. భద్రత, ప్రైవసీ కోసం న్యూఢిల్లీ-హౌరా రాజధాని రైలులో స్మార్ట్ విండోను తీసుకు రానున్నారు.
1:11 PM
Jan 29, 2021
నిర్మలా సీతారామన్ ఆర్థిక సర్వే (ఎకనమిక్ సర్వేను ప్రవేశ పెట్టారు.
1:00 PM
Jan 29, 2021
పార్లమెంటు ఉభయ సభలు కోవిడ్ గైడ్ లైన్స్‌కు అనుగుణంగా నిర్వహిస్తారు.
12:46 PM
Jan 29, 2021
ప్రస్తుత బడ్జెట్‌ను కరోనా మహమ్మారి సమయంలో ప్రకటించిన చర్యలకు కొనసాగింపుగా చూడాలని ప్రధాని మోడీ అన్నారు.
12:28 PM
Jan 29, 2021
కొత్త వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని రాష్ట్రపతి అన్నారు.
12:12 PM
Jan 29, 2021
కరోనా సమయంలో జన్ ధన్ అకౌంట్లలో నగదు జమ చేసినట్లు తెలిపారు.
12:04 PM
Jan 29, 2021
ఆత్మనిర్భర్ భారత్ స్వయం సమృద్ధికి అడుగులు అని, రిపబ్లిక్ డే నాటి ఘటనలు దురదృష్టకరమని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
12:00 PM
Jan 29, 2021
దేశంలోకి విదేశీ పెట్టుబడులు గణనీయంగా పెరిగాయన్నారు.
11:59 AM
Jan 29, 2021
మౌలిక సదుపాయాల కోసం రూ.1 లక్ష కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్రపతి తెలిపారు.
11:53 AM
Jan 29, 2021
దేశ ఉజ్వల భవిష్యత్తుకు ఈ దశాబ్దం చాలా కీలకమని రాష్ట్రపతి తన ప్రసంగంలో పేర్కొన్నారు.
11:47 AM
Jan 29, 2021
ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వేను ప్రవేశ పెట్టనున్నారు.
11:47 AM
Jan 29, 2021
సమావేశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ దేశ చరిత్రలో తొలిసారి గత ఏడాది ఆర్థికమంత్రి ప్యాకేజీల రూపంలో మినీ బడ్జెట్‌లు ప్రవేశ పెట్టారన్నారు.
11:47 AM
Jan 29, 2021
ఉదయం గం.11.00 గంటలకు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.