న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల కోట్ల మేర పన్ను ఆదాయానికి గండిపడే అవకాశాలు ఉన్నాయని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం తెలిపారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కార్పోరేట్ ట్యాక్స్‌కు సంబంధించి రూ.2.34 లక్షల కోట్ల మేర గండిపడవచ్చునని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రాస్ ట్యాక్స్ కలెక్షన్స్ రూ.24.2 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అయితే ఇది రూ.5.2 లక్షల కోట్లు తగ్గి రూ.19 లక్షలుగా నమోదు కావొచ్చునని అంచనా వేస్తున్నారు.
అంతకుముందు ఆర్థిక సంవత్సరంలోని రూ.20 లక్షల కంటే కూడా ఇది తక్కువ. కార్పోరేట్ ట్యాక్స్ వసూళ్లు రూ.6.8 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా వేయగా, రూ.2.34 లక్షల కోట్ల మేర కోత పడుతుందని భావిస్తున్నారు. దీనిని రూ.4.46 లక్షల కోట్లకు సవరించారు. ఇన్‌కం ట్యాక్స్ వసూళ్లు రూ.6.38 లక్షల కోట్లుగా గత బడ్జెట్‌లో అంచనా వేయగా, రూ.1.8 లక్షలకోట్లు తగ్గుతుందని భావిస్తున్నారు. తాజా సవరణ ప్రకారం రూ.4.59 లక్షల కోట్లుగా ఉంటుందని భావిస్తున్నారు. ఇక జీఎస్టీ కలెక్షన్లు బడ్జెట్ టార్గెట్ రూ.6.9 లక్షల కోట్లు కాగా, రూ.5.15 కోట్లకు సవరించారు.

టెలికం ఇండస్ట్రీ నుండి 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం 60 శాతం పెరుగుతుందని కేంద్రం భావిస్తోంది. రక్షణ రంగానికి 4.78 లక్షల కోట్లు కేటాయించారు.
కాగా, నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ పైన ప్రధాని మోడీ ప్రశంసలు కురిపించారు. దేశ ప్రజలకు మేలు చేసేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. స్వయంసమృద్ధితో పాటు అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు నెరవర్చేలా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారన్నారు. ఆసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్ ప్రవేశపెట్టినట్లు తెలిపారు. కాగా, కేంద్ర బడ్జెట్ పైన రాహుల్ గాంధీ విమర్శల గుప్పించారు. మోనిటైజేషన్ ప్లాన్‌తో జాతికి చెందిన ఆస్తుల్ని అమ్మకానికి పెడుతున్నారని దుయ్యబట్టారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications